Just In
- 7 hrs ago
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- 10 hrs ago
మీకు తెలుసా.. ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ట్రైన్ కానుంది
- 22 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 24 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
Don't Miss
- News
సుప్రీంకోర్టులో జగన్ సర్కార్ పిటీషన్: జస్టిస్ లావు నాగేశ్వర రావు బెంచ్ కాదిక: చివరి గంటల్లో
- Finance
రూ.49,000 స్థాయికి బంగారం, ధరలు పెరుగుతాయా?
- Sports
ధోనీ ప్రత్యేకతే ఇది.. అందుకే ఐపీఎల్లో సీఎస్కే సక్సెస్ అయింది: గౌతం గంభీర్
- Lifestyle
రాత్రుల్లో లోదుస్తులు ధరించకుండా ఒక వారం పాటు నిద్రించండి,ఏం జరుగుతుందో చూడండి, ఆశ్చర్యపోతారు
- Movies
విజయ్ మామూలోడు కాదు.. డిజాస్టరన్న సినిమాతోనే 200కోట్లు.. అరాచకం సామీ!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రూ. 9 లక్షలకు ఫ్యాన్సీ నెంబర్ సొంతం చేసుకున్న యువకుడు.. ఇంతకీ ఏంటి ఈ నెంబర్ స్పెషల్
ఖరీదైన లగ్జరీ కార్ కలిగిన వాహనదారులు ఆ వాహనాలకు ఒక స్పెషల్ నెంబర్ ఉండాలనుకుంటారు. ఈ తరుణంలో ఆ నెంబర్ కోసం ఈత డబ్బు ఖర్చుపెట్టటడానికైనా వెనుకాడరు. ఇదే నేపథ్యంలో కేరళకు చెందిన ఒక యువకుడు ప్రత్యేక నంబర్ కోసం ఏకంగా 9 లక్షల రూపాయలు వెచ్చించాడు. మలప్పురం లైఫ్ స్టైల్ దీనిపై సమాచారాన్ని ప్రచురించింది.

ఫ్యాన్సీ నెంబర్ కోసం, వారు కారుతో సమానంగా ఖర్చు చేస్తారు. కొన్నిసార్లు ఈ మొత్తం కారు ధర కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఇటీవలే మలప్పురంలో కొండోట్టి అనే కొత్త ఆర్టీఓ కార్యాలయం ప్రారంభించబడింది.

ఈ ఆర్టీఓ అధికారులు తమ కార్యాలయం యొక్క మొదటి రిజిస్ట్రేషన్ నంబర్ కెఎల్ 840001 ను వేలం వేయాలనుకున్నారు. వేలానికి హాజరైన మహ్మద్ రఫీక్ అనే యువకుడు ఆ నెంబర్‌ను సొంతం చేసుకున్నాడు. మహ్మద్ రఫీక్ తన కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎఎమ్‌జి జిఎల్‌ఇ 53 కూపే కోసం ఈ నంబర్‌ను 9,01,000 రూపాయలకు కొనుగోలు చేశాడు. కెఎల్ 840001 ఫ్యాన్సీ నంబర్ కోసం వేలానికి ఇద్దరు మాత్రమే హాజరయ్యారు.
MOST READ:వాహనాలకు HSRP నెంబర్ ప్లేట్ తప్పనిసరి అంటున్న ప్రభుత్వం.. ఎక్కడో తెలుసా ?

రఫీక్ తన కారుకు రోడ్ టాక్స్ గా రూ. 25 లక్షలు చెల్లించినట్లు తెలిపారు. ఈ అంశాలన్నీ మలప్పురం లైఫ్ స్టైల్ ప్రచురించిన సమాచారంలో వెల్లడయ్యాయి. మెర్సిడెస్ బెంజ్ తన కొత్త ఎఎమ్‌జి జిఎల్‌ఇ 53 కూపేని ఈ ఏడాది సెప్టెంబర్‌లో దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ కారు ధర రూ. 1.20 కోట్లు.

కొత్త ఎఎమ్‌జి జిఎల్‌ఇ 53 కూపే మునుపటి మోడల్ కంటే శక్తివంతమైనది. మెర్సిడెస్ బెంజ్ ఈ కారులో తేలికపాటి హైబ్రిడ్ సిస్టం ను అందిస్తుంది. ఈ సిస్టం ఇంజిన్ యొక్క సామర్థ్యాన్ని మరియు పనితీరును పెంచడానికి సహాయపడుతుంది.
MOST READ:ఇండియన్ రైల్వే విడుదల చేసిన వీడియో.. ఇది చూస్తే మీరు తప్పకుండా ట్రైన్‌లోనే వెళ్తారు

ఈ కారుకు 3.0 లీటర్ ట్విన్-టర్బో 6 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ అమర్చారు. ఈ హైబ్రిడ్ ఇంజన్ 435 బిహెచ్‌పి పవర్ మరియు 530 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మిషన్ యూనిట్‌తో జత చేయబడింది.

కొత్త ఎఎమ్‌జి జిఎల్‌ఇ 53 కూపే కారు గంటకు 250 కిమీ వేగంతో ఉంటుంది. 5.3 సెకన్లలో కారు గంటకు 0 - 100 కిమీ నుండి వేగవంతం అవుతుంది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా వాహనదారునికి చాలా అనుకూలంగా కూడా ఉంటుంది.
MOST READ:ఒకే కారుని 14 సార్లు అమ్మిన ఘరానా మోసగాడు.. ఇంతకీ ఇది ఎలా జరిగిందో తెలుసా