బెంగళూరులో కొత్త డీలర్‌షిప్‌ను ప్రారంభించిన లంబోర్ఘిని!

ప్రపంచంలో అతి వేగవంతమైన మరియు అతి ఖరీదైన కార్లలో ఒకటిగా ప్రసిద్ధి చెందినది కారు లంబోర్ఘిని. ఇది ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థకి చెందినది కారు. మనదేశంలో కూడా చాలామంది ధనవంతులు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఈ ఖరీదైన లంబోర్ఘిని కారు మన బెంగళూరులో కొత్త డీలర్షిప్ ను ప్రారంభించింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం!

బెంగళూరులో కొత్త డీలర్‌షిప్‌ను ప్రారంభించిన లంబోర్ఘిని!

ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని బెంగళూరులోని లావెల్లె రోడ్‌లో కొత్త షోరూమ్‌ను ప్రారంభించింది. 4,370 చదరపు మీటర్ల పరిమాణంలో కొత్త లంబోర్ఘిని డీలర్‌షిప్‌ను "మిస్టర్ మాటియో ఆర్టెంజి మరియు మిస్టర్ శరద్ అగర్వాల్" ప్రారంభించారు.

బెంగళూరులో కొత్త డీలర్‌షిప్‌ను ప్రారంభించిన లంబోర్ఘిని!

బెంగళూరు నగరం నడిబొడ్డున ఉన్న ఈ కొత్త షోరూమ్‌లో ప్రత్యేకంగా క్యురేటెడ్ ఎక్స్‌పీరియన్స్ జోన్‌లు ఉన్నాయి. ఇవి వినియోగదారు ఖరీదైన లంబోర్ఘిని కారును చూడటానికి మరియు కొనుగోలు చేయడానికి అనుగుణంగా ఉంటుంది.

బెంగళూరులో కొత్త డీలర్‌షిప్‌ను ప్రారంభించిన లంబోర్ఘిని!

ఆటోమొబిలి లంబోర్ఘిని ఆసియా-పసిఫిక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మిస్టర్ ఓర్టెంజి మాట్లాడుతూ, కొత్త లంబోర్ఘిని డీలర్షిప్ కు బెంగుళూరు వాతావరణం అనుకూలంగా ఉంటుందని, లంబోర్ఘిని యొక్క డిజైన్ ఫిలాసఫీ మరియు లగ్జరీ వినియోగదారుని బాగా ఆకట్టుకుంటుంది అన్నారు.

బెంగళూరులో కొత్త డీలర్‌షిప్‌ను ప్రారంభించిన లంబోర్ఘిని!

తాము భారతదేశంలో బ్రాండ్ ఉనికిని విస్తరిస్తున్నప్పుడు, కొంతమంది గౌరవనీయ భాగస్వాములతో సంబంధాలను బలోపేతం చేయడానికి ఎదురుచూస్తున్నామని, మరియు మార్కెట్లో ఈ లంబోర్ఘిని బ్రాండ్ యొక్క మరింత ఉజ్వలమైన భవిష్యత్తు కోసం ఆశాజనకంగా ఎదురు చూస్తున్నాము అని ఆయన చెప్పారు.

బెంగళూరులో కొత్త డీలర్‌షిప్‌ను ప్రారంభించిన లంబోర్ఘిని!

బెంగళూరులో డీలర్షిప్ ని ప్రారంభించి కొత్త సదుపాయం కల్పించడం వల్ల దేశంలోనే సూపర్ కార్ మార్కెట్ కంపెనీ తన నిబద్ధతను చూపిస్తుందని శరత్ అగర్వాల్ అన్నారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సూపర్ కార్ల డిమాండ్ బాగా పెరిగిందని, దీనిలో భాగంగా లంబోర్గిన కార్ల అమ్మకాలు ఇప్పుడు మార్కెట్లో మరింత పెరిగాయని ఆయన పేర్కొన్నారు.

బెంగళూరులో కొత్త డీలర్‌షిప్‌ను ప్రారంభించిన లంబోర్ఘిని!

లంబోర్ఘిని గత సంవత్సరం ముంబై మరియు ఢిల్లీలో కొత్త షోరూమ్‌లను ప్రారంభించింది. ఇప్పుడు బెంగళూరులోని కొత్త డీలర్షిప్ ని ప్రారంభించింది. ఈ విధంగా కొత్త షోరూమ్‌లను ప్రారంభించడం వల్ల ఈ కార్ల విస్తరణ బాగా పెరుగుతుంది. ఇప్పుడు భారతీయ మార్కెట్లలో లంబోర్ఘిని కార్లు బాగా అభివృద్ధి చెందడానికి సిద్ధంగా ఉన్నాయని కంపెనీ యాజమాన్యం తెలిపింది.

బెంగళూరులో కొత్త డీలర్‌షిప్‌ను ప్రారంభించిన లంబోర్ఘిని!

లంబోర్ఘిని బెంగుళూరులోని కొత్త డీలర్‌షిప్‌లో "హురాకాన్ ఎవో స్పైడర్ సూపర్ కారును" ప్రదర్శించింది. ఈ సూపర్ కారు గత ఏడాది అక్టోబర్‌లో భారతదేశంలో లాంచ్ అయ్యింది. ఇది సాఫ్ట్-టాప్ కన్వర్టిబుల్ మోడల్.

బెంగళూరులో కొత్త డీలర్‌షిప్‌ను ప్రారంభించిన లంబోర్ఘిని!

హురాకాన్ ఎవో స్పైడర్ గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 3.10 సెకన్లలో, మరియు గంటకు 0 నుండి 200 కిలోమీటర్ దూరాన్ని 9.3 సెకన్లలో చేరుకోగలదు. ఈ కారు యొక్క టాప్ స్పీడ్ గంటకు 325 కిలోమీటర్లకు పరిమితం చేయబడింది.

బెంగళూరులో కొత్త డీలర్‌షిప్‌ను ప్రారంభించిన లంబోర్ఘిని!

ఈ లంబోర్ఘిని కారులో 5.2-లీటర్ వి10 పెట్రోల్ ఇంజన్ 631 బిహెచ్‌పి శక్తిని మరియు 600 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ ఏడు-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడుతుంది. దీనిని కంపెనీ ‘లంబోర్ఘిని డోపియా ఫ్రిజియోన్' అని పిలుస్తుంది. లంబోర్ఘిని హురాకాన్ ఎవో స్పైడర్ ధర రూ. 4.10 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా).

బెంగళూరులో కొత్త డీలర్‌షిప్‌ను ప్రారంభించిన లంబోర్ఘిని!

భారతదేశంలో సూపర్ కార్ల డిమాండ్ రోజు రోజుకి ఎక్కువవుతుంది. ఈ సమయంలో లంబోర్ఘిని వంటి ప్రముఖ సంస్థ బెంగుళూరులో డీలర్షిప్ ను ప్రారంభించడం చాలా సంతోషించదగ్గ విషయం. సాధారణంగా చాలా మంది లంబోర్ఘిని కార్లను ఎక్కడ నడుపుతున్నారో చూడాటానికి వేచి చూసే వాళ్ళు. ఇప్పుడు లంబోర్ఘిని కార్లను మనం చూసే అవకాశాన్ని సంస్థ బెంగళూరులో కల్పించింది.

Most Read Articles

English summary
Lamborghini Inaugurates New Dealership At Bangalore: Showcases Huracan Evo Spider At Opening. Read in Telugu
Story first published: Saturday, January 11, 2020, 10:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X