Just In
Don't Miss
- News
అనంత కలెక్టర్‌ను కదిలించిన ఫేస్బుక్ పోస్ట్: 24 గంటల్లోనే బస్సు: స్టూడెంట్స్‌తో కలిసి ప్రయాణం
- Finance
బడ్జెట్ కంటే ముందు ఏ స్టాక్స్ కొంటే లాభాలు వస్తాయి..?
- Sports
టీమిండియా సాధించిన చరిత్రాత్మక విజయాన్ని స్ఫూర్తిగా పొందండి: మోదీ
- Movies
‘పుష్ప’ విషయంలో అల్లు అర్జున్ నిర్ణయం మార్పు: సినిమా విడుదల అయ్యేది ఐదు భాషల్లో కాదు!
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జనవరి 29 న ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించనున్న లంబోర్ఘిని హురాకాన్ ఇవో ఆర్‌డబ్ల్యుడి కారు!
ఇటాలియన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ అయిన లంబోర్గిని, హురాకాన్ ఇవో ఆర్‌డబ్ల్యుడి ని జనవరి 29 న ప్రారంభించనున్నట్లు ధ్రువీకరించింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం!

లంబోర్ఘిని జనవరి 29 న భారతదేశంలో హురాకాన్ ఇవో రియర్-వీల్-డ్రైవ్ (ఆర్‌డబ్ల్యుడి) సూపర్ కార్‌ను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఇటాలియన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో ఈ సూపర్ కార్ ని ఆవిష్కరించింది. త్వరలో భారతదేశంలో కూడా అందుబాటులోకి రానున్నట్లు తెలియజేసింది.

ఇందులోని డిజైన్ ఆల్-వీల్-డ్రైవ్ (ఏడబ్ల్యుడి) వెర్షన్‌కి సమానంగా ఉంటుంది. ఈ కారు మెరుగైన ఏరోడైనమిక్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. వెనుక భాగంలో ఈ సూపర్ కార్ కొత్త డిఫ్యూజర్‌ను పొందుతుంది. ఇది ఆర్డబ్ల్యుడికి ఒక ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు.

లోపలి భాగంలో హురాకాన్ ఇవో ఆర్‌డబ్ల్యుడి 8.4-అంగుళాల టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది కారు యొక్క అన్ని అంశాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో ఫోన్ కనెక్టివిటీ, ఇంటర్నెట్ సదుపాయం మరియు ఆపిల్ కార్ప్లే కూడా ఉన్నాయి.

హురాకాన్ ఇవో ఆర్‌డబ్ల్యుడి అదే ఐకానిక్ ఇంజిన్ నుండి శక్తిని తీసుకుంటుంది. ఇది హురాకాన్ ఏడబ్ల్యుడి కి శక్తినిస్తుంది. ఇది 5.2-లీటర్ వి10, 609bhp శక్తిని మరియు 560Nm పీక్ టార్క్ ని తొలగిస్తుంది. ఈ కారు ఇప్పుడు AWD వేరియంట్ కంటే 33 కిలోల అధిక బరువును కలిగి ఉంటుంది. ఈ కారు 0 నుండి 100 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 3.3 సెకన్లలో చేరుకుంటుంది. దీని యొక్క గరిష్ట వేగం గంటకి 325 కిమీ గా ఉంటుంది.

శక్తిని అదుపులో ఉంచడానికి కారు పెర్ఫార్మెన్స్ ట్రాక్షన్ కంట్రోల్ (పి-టిసిఎస్) ని కలిగి ఉంటుంది. ఇందులో భద్రతా లక్షణాలను గమనించినట్లయితే "యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)", ఎయిర్‌బ్యాగులు, EBD, ESP మరియు మరెన్నో ఉన్నాయి.

లంబోర్ఘిని హురాకాన్ ఇవో ఏడబ్ల్యుడి ధర 3.73 కోట్ల రూపాయలు (ఎక్స్-షోరూమ్) కలిగి ఉంది. దీనిని పరిగణనలోకి తీసుకుంటే సంస్థ ఆర్‌డబ్ల్యుడి వేరియంట్ కొంచెం తక్కువ ధరను కలిగి ఉంటుంది. ఇది సుమారు రూ. 2.90 నుండి 3 కోట్ల మార్క్ (ఎక్స్-షోరూమ్). కానీ లంబోర్ఘిని హురాకాన్ ఎవో స్పైడర్ ధర రూ. 4.1 కోట్లు (ఎక్స్-షోరూమ్) కలిగి ఉంది.

డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం:
ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన కార్లలో లంబోర్గిని ఒకటి. మొన్నటికి మొన్న బెంగుళూరులో లంబోర్గిని ఒక డీలర్షిప్ ని కూడా ఓపెన్ చేసింది. ఇప్పుడు జనవరి 29 న హురాకాన్ ఇవో ఆర్‌డబ్ల్యుడి కారుని ఇండియన్ మార్కెట్లో ప్రారంభించనుంది. దీని ధర లంబోర్ఘిని హురాకాన్ఇవో ఏడబ్ల్యుడి కంటే కొంత తక్కువ ఉంటుంది. కానీ బరువు మాత్రం దీనికంటే 33 కేజీలు ఎక్కువ గా ఉంటుంది.