Just In
- 11 hrs ago
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- 12 hrs ago
హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్యూవీ వస్తోంది, టీజర్ విడుదల
- 13 hrs ago
పూర్తి చార్జ్‌పై 500 కి.మీ ప్రయాణించే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఎలక్ట్రిక్!
- 14 hrs ago
మాట నిలబెట్టుకున్న జగన్మోహన్రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : జాబ్ కోసం నిరుద్యోగులు అకస్మాత్తుగా జర్నీ చేయొచ్చు...!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Movies
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇండియన్ మార్కెట్లో లంబోర్ఘిని ఇవో ఆర్‌డబ్ల్యుడి రేటెంతో తెలుసా!
ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన కార్లలో లంబోర్గిని ఒకటి. ఇటువంటి విలాసవంతమైన కార్లను చాల మంది వాహనప్రియులు ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లంబోర్ఘిని హురాకాన్ కారు ఇండియన్ మార్కెట్లో విడుదలైనది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

లంబోర్ఘిని హురాకాన్ ఇవో ఆర్‌డబ్ల్యుడి ఇండియన్ మార్కెట్లో విడుదలైంది. కొత్త లంబోర్ఘిని హురాకాన్ ఇవో ఆర్‌డబ్ల్యుడి యొక్క ప్రారంభ ధర రూ. 3.22 కోట్ల రూపాయలతో (ఎక్స్-షోరూమ్, ఇండియా) అందించబడుతుంది.

లంబోర్ఘిని హురాకాన్ ఇవో ఆర్‌డబ్ల్యుడి భారతీయ మార్కెట్లో బ్రాండ్ యొక్క తాజా సూపర్ కార్. స్టాండర్డ్ ఆల్-వీల్-డ్రైవ్ మోడల్‌తో పోలిస్తే దాని ఏరోడైనమిక్స్‌లో చిన్న చిన్న మార్పులను కలిగి ఉంది.

హురాకాన్ ఇవో ఆర్‌డబ్ల్యుడిలో చేసిన కొన్ని చిన్న మార్పులను గమనించినట్లయితే ఇందులో కొత్త ఫ్రంట్ స్ప్లిటర్, ఫ్రంట్ ఎయిర్ ఇంటేక్ వంటివి ఉన్నాయి. ఈ సూక్ష్మ మార్పులన్నీ హురాకాన్ ఇవో యొక్క ఆర్‌డబ్ల్యుడి వెర్షన్‌కు మెరుగైన ఏరోడైనమిక్స్ మరియు స్థిరత్వాన్ని అందిస్తాయి.

లంబోర్ఘిని హురాకాన్ ఇవో ఆర్‌డబ్ల్యుడిలో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఇతర కనెక్టివిటీ ఫీచర్స్ తో కూడిన 8.4-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇందులో ఉంది. ఇది పూర్తి-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు పిరెల్లి పి-జీరో రబ్బరుతో చుట్టబడిన ప్రామాణిక 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉంటాయి.

హురాకాన్ ఇవో ఆర్‌డబ్ల్యుడి క్యాబిన్ చుట్టూ అల్కాంటారా మరియు లెదర్ అప్హోల్స్టరీ ఉంటుంది. లంబోర్ఘిని తన వినియోగదారులకు సూపర్ కార్లను కొనుగోలు చేసే ప్రతి వ్యక్తికి కార్బన్-ఫైబర్ ప్యాక్‌లతో పాటు అనుకూలీకరించదగిన ఎంపికలను కూడా అందిస్తుంది.

హురాకాన్ ఇవో ఆర్‌డబ్ల్యుడి లోని భద్రతా లక్షణాలలో ఎయిర్‌బ్యాగులు, ESP, పెర్ఫార్మెన్స్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ మరియు ఎబిఎన్ విత్ ఇబిడి ఉన్నాయి.

ఇప్పటి వరకు అన్ని హురాకాన్ మోడళ్లలో ఉపయోగించే 5.2-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ వి10 ఇంజిన్ ఇందులో ఉంది. ఇది 610 బిహెచ్పి మరియు 560 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది లంబోర్ఘిని స్టాండర్డ్ ఇవో మోడల్ కంటే 30 బిహెచ్పి మరియు 40 ఎన్ఎమ్ టార్క్ తక్కువగా ఉంటుంది. ఇంజిన్ 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది.

లంబోర్ఘిని హురాకాన్ ఇవో ఆర్‌డబ్ల్యుడి గంటకు 325 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది పేర్కొంది. 0 నుంచి 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి కేవలం 3.3 సెకండ్లు మాత్రమే పడుతుంది. అదే విధంగా 0 నుంచి 200 కిలోమీటర్లు ప్రయాణించడానికి 9.3 సెకన్ల కాలం పడుతుంది.

డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం:
ఇటాలియన్ సూపర్ కార్ తయారీదారు లంబోర్ఘిని హురాకాన్ ఇవో పరిధిని ఇండియన్ మార్కెట్లో విస్తరించారు. కొత్త హురాకాన్ ఇవో ఆర్‌డబ్ల్యుడి ను హురాకాన్ ఇవో ఎడబ్ల్యుడి మరియు ఇవో స్పైడర్‌తో పాటు విక్రయిస్తారు. ఇప్పటికే ఈ కారు భారత మార్కెట్లో అమ్మకానికి ఉంది. ఇతర మోడళ్ల మాదిరిగానే, లంబోర్ఘిని హురాకాన్ ఇవో ఆర్‌డబ్ల్యుడి, మెర్సిడెస్-ఎఎమ్‌జి జిటి-ఆర్ మరియు రాబోయే ఫెరారీ ఎఫ్ 8 ట్రిబ్యూటో వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.