కొత్త మైలురాయిని చేరుకున్న లాంబోర్గినీ ఉరుస్ ఎస్‌యూవీ

ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ లాంబోర్గినీ మొట్టమొదటి సారిగా డిసెంబర్ 2017లో మార్కెట్లో విడుదల చేసిన ఉరుస్ ఎస్‌యూవీ అతి తక్కువ సమయంలో మంచి పాపులారిటీని దక్కించుకుంది. ఉరుస్ విడుదలతో లాంబోర్గినీ తొలిసారిగా ఎస్‌యూవీ విభాగంలోకి ప్రవేశించింది. అప్పటి వరకూ సూపర్ స్పోర్ట్స్ కార్లను మాత్రమే తయారు చేస్తూ వచ్చిన ఈ ప్రీమియం బ్రాండ్ మొట్టమొదటి సారిగా సూపర్ ఎస్‌యూవీని తయారు చేసింది.

కొత్త మైలురాయిని చేరుకున్న లాంబోర్గినీ ఉరుస్ ఎస్‌యూవీ

లాంబోర్గినీ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, శాంట్'అగాటా బోలోగ్నీస్‌లోని లాంబోర్గినీ ప్లాంట్ నుండి 10,000 వ లాంబోర్గినీ ఉరుస్ కారును కంపెనీ విడుదల చేసింది. ఈ కారు అత్యధిక ధరను కలిగి ఉన్నప్పటికీ, ప్రపంచ వ్యాప్తంగా పది వేల మంది యజమానులకు ఇది చేరువయ్యింది.

కొత్త మైలురాయిని చేరుకున్న లాంబోర్గినీ ఉరుస్ ఎస్‌యూవీ

ఈ పెర్ఫార్మెన్స్ లగ్జరీ ఎస్‌యూవీ చివరికి భారత మార్కెట్లో కూడా విడుదలైంది. గడచిన ఒక్క సంవత్సరంలో ఈ బ్రాండ్ మంచి అమ్మకాలను నమోదు చేసుకుంది. కంపెనీ నివేదికల ప్రకారం, లాంబోర్గినీ 2019లో ప్రపంచవ్యాప్తంగా 4,962 యూనిట్ల ఉరుస్ ఎస్‌యూవీలను విక్రయించింది, వీటిలో 50 యూనిట్లు భారతదేశంలోనే అమ్ముడయ్యాయంటే దీనికి ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

MOST READ:హెల్మెట్ సేఫ్టీ రూల్స్ మారాయ్; ఇకపై ఫారిన్ హెల్మెట్స్ కూడా ధరించవచ్చు!

కొత్త మైలురాయిని చేరుకున్న లాంబోర్గినీ ఉరుస్ ఎస్‌యూవీ

లాంబోర్గినీ ఉత్పత్తి చేసిన ఈ 10,000వ ఉరుస్ మోడల్‌ను రష్యాకు చెందిన ఓ యజమాని సొంతం చేసుకున్నాడు. ఈ ఎస్‌యూవీలో కొత్త కలర్ మరియు సరికొత్త స్పెషల్ ఎడిషన్ ఫీచర్లతో 10,000వ యూనిట్ ప్రత్యేకతను తెలియజేసే మార్పులతో లభిస్తుంది.

కొత్త మైలురాయిని చేరుకున్న లాంబోర్గినీ ఉరుస్ ఎస్‌యూవీ

ఇందులో 10,000వ ఛాస్సిస్స్ సంఖ్యను ముద్రించబడి ఉంటుంది. ఇది కొత్త నీరో నోక్టిస్ మ్యాట్ (బ్లాక్) పెయింట్ స్కీమ్, కార్బన్ ఫైబర్ ప్యాకేజ్, బ్లాక్ అండ్ ఆరెంజ్ డ్యూయెల్-టోన్ యాడ్ పర్సనమ్ ఇంటీరియర్‌లతో తయారు చేయబడినది.

MOST READ:80 మీటర్లు దొర్లుకుంటూ వెళ్లినప్పటికీ బయటపడిన టాటా టియాగోలోని ప్రయాణికులు, ఎలానో మీరే చూడండి

కొత్త మైలురాయిని చేరుకున్న లాంబోర్గినీ ఉరుస్ ఎస్‌యూవీ

గడచిన జూన్ 2020లో లాంబోర్గినీ ఉరుస్ కోసం కంపెనీ కొన్ని కొత్త కలర్ ఆప్షన్లను జోడించినట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. లాంబోర్గినీ ఉరుస్ పెర్ల్ క్యాప్సూల్ అని పిలిచే ఈ కొత్త వేరియంట్ డ్యూయెల్ టోన్ ఎక్స్‌టీరియర్, ఫోర్-లేయర్ పెయింట్‌తో అల్ట్రా-బ్రైట్ పెర్ల్సెంట్ షేడ్స్‌తో లభిస్తుంది.

కొత్త మైలురాయిని చేరుకున్న లాంబోర్గినీ ఉరుస్ ఎస్‌యూవీ

ఇందులో గ్లాసీ బ్లాక్ రూఫ్, రియర్ డిఫ్యూజర్, స్పాయిలర్ లిప్ మరియు ఇతర వివరాలతో కూడిన డీటేలింగ్ ఉంటుంది. లాంబోర్గినీ ఉరుస్ పెర్ల్ క్యాప్సూల్ మోడల్ ఇయర్ 2021 కోసం ఆప్షనల్‌గా అదనపు కస్టమైజేషన్ ఫీచర్లతో లభిస్తుంది.

MOST READ:పోలీసులు స్వాధీనం చేసుకున్న 4 కోట్ల విలువైన లంబోర్ఘిని సూపర్ కార్, కారణం ఏంటో తెలుసా ?

కొత్త మైలురాయిని చేరుకున్న లాంబోర్గినీ ఉరుస్ ఎస్‌యూవీ

లాంబోర్గినీ ఉరుస్‌లో ఉపయోగించిన ఇంజన్ విషయానికి వస్తే, ఈ సూపర్ ఎస్‌యూవీలో 4.0 లీటర్ ట్విన్-టర్బో వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 641 బిహెచ్‌పి శక్తిని మరియు 2250-4500 ఆర్‌పిఎమ్ మధ్యలో 850 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

కొత్త మైలురాయిని చేరుకున్న లాంబోర్గినీ ఉరుస్ ఎస్‌యూవీ

ఈ ఇంజన్ నుంచి విడుదలయ్యే శక్తిని నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ అవుతుంది, ఇందుకోసం ఇందులో 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంటుంది. లాంబోర్గినీ ఉరుస్ కేవలం 3.6 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు గరిష్ట వేగాన్ని యాంత్రికంగా గంటకు 305 కి.మీకు పరిమితం చేశారు. ఇందులో పలు డ్రైవింగ్ మోడ్స్, ఎలక్ట్రానిక్‌గా సర్దుబాటు చేయగల సస్పెన్షన్ మరియు కార్బన్-సిరామిక్ బ్రేక్ ప్యాకేజీ కూడా ఉంటుంది.

కొత్త మైలురాయిని చేరుకున్న లాంబోర్గినీ ఉరుస్ ఎస్‌యూవీ

లాంబోర్గినీ ఉరుస్ మోడల్‌ను ఉత్పత్తి చేయటం కోసం కంపెనీ తమ ప్లాంట్‌లో స్థలాన్ని అదనంగా 80,000 చదరపు మీటర్ల నుండి 160,000 చదరపు మీటర్లకు విస్తరించింది. ‘మ్యానిఫట్టురా లాంబోర్గినీ' అని పిలువబడే ఈ స్థలాన్ని కేవలం లాంబోర్గినీ ఉరుస్ కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

కొత్త మైలురాయిని చేరుకున్న లాంబోర్గినీ ఉరుస్ ఎస్‌యూవీ

అసెంబ్లీ కార్యకలాపాల్లో కార్మికులకు సహకరించేందుకు ఈ కొత్త ప్లాంట్‌లో అనేక అధునాతన ఉత్పత్తి సాంకేతికతలను ఉపయోగిస్తున్నారు. కాగా, 2019లో, పూర్తిగా కేవలం ఉరుస్ ఎస్‌యూవీ కోసంగా ఓ డెడికేటెడ్ పెయింట్ షాప్‌ను కూడా ప్రారంభించారు. కొత్తగా ప్రారంభించిన ఈ పెయింట్ షాప్‌లో ఏఐ వంటి ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతలను ఉపయోగిస్తున్నారు.

MOST READ:బైక్ కింద నుంచి 20 బాటిల్స్ మద్యం స్వాధీనం, వీడియో చూస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు

కొత్త మైలురాయిని చేరుకున్న లాంబోర్గినీ ఉరుస్ ఎస్‌యూవీ

లాంబోర్గినీ ఉరుస్ మైలురాయిపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

లాంబోర్గినీ అంటే కేవలం అకేషనల్ కార్లను మాత్రమే కాకుండా రోజూవారీ ఉపయోగం కోసం కూడా ఉత్పత్తులను తయారు చేస్తుందని తమ ఉరుస్ బ్రాండ్‌తో కంపెనీ నిరూపించింది. ప్రపంచవ్యాప్తంగా ఎస్‌యూవీలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఉరుస్ ఎస్‌యూవీ అమ్మకాలలో గణనీయమైన పెరుగుదల కనిపించింది.


Most Read Articles

English summary
Italian supercar manufacturer, Lamborghini, decided to foray into the SUV segment with the launch of the Urus back in December 2017. The company recognised the rising demand for SUV across all segments. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X