Just In
- 1 hr ago
సూపర్‌బైక్ రైడర్ని వేధించిన స్థానికులు మరియు పోలీసులు - వీడియో
- 2 hrs ago
ఇద్దరు కానిస్టేబుళ్లను పొట్టన పెట్టుకున్న బిఎండబ్ల్యు.. ఎలాగో మీరే చూడండి
- 3 hrs ago
కొత్త 2021 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌సైకిల్ వస్తోందోచ్..
- 4 hrs ago
కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు రెనో ఇండియా 'మాస్టర్' ప్లాన్స్..
Don't Miss
- Finance
బడ్జెట్ కంటే ముందు ఏ స్టాక్స్ కొంటే లాభాలు వస్తాయి..?
- News
షాకింగ్: క్షీణించిన శశికళ ఆరోగ్యం -విషమంగా వెంటిలేటర్‌పై చికిత్స -మణిపాల్‌కు తరలింపు
- Sports
టీమిండియా సాధించిన చరిత్రాత్మక విజయాన్ని స్ఫూర్తిగా పొందండి: మోదీ
- Movies
‘పుష్ప’ విషయంలో అల్లు అర్జున్ నిర్ణయం మార్పు: సినిమా విడుదల అయ్యేది ఐదు భాషల్లో కాదు!
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ల్యాండ్ రోవర్ డిఫెండర్ హార్డ్‌టాప్ కమర్షియల్ మోడల్ ఖరారు - వివరాలు
టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ ఎస్యూవీ బ్రాండ్ ల్యాండ్ రోవర్ అందిస్తున్న 'డిఫెండర్' మోడల్లో కంపెనీ ఓ సరికొత్త వేరియంట్‌ను పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆల్-న్యూ డిఫెండర్ లైనప్‌లో కొత్తగా రెండు మోడళ్లను ప్రవేశపెట్టనున్నట్లు ల్యాండ్ రోవర్ ధృవీకరించింది. ఇది 'హార్డ్ టాప్' మోడళ్ల రూపంలో రానుంది, ఇది ఎస్యూవీ యొక్క 90 మరియు 110 వెర్షన్లలో లభ్యం కానుంది. ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90 హార్డ్ టాప్ మరియు 110 హార్డ్ టాప్ ఇవి రెండూ కూడా ఈ ఏడాది చివరి నాటికి అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల కానున్నాయి.

సరికొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ హార్డ్ టాప్‌ను బ్రాండ్ యొక్క రగ్గడ్ 4x4 సిరీస్‌లో భాగంగా తయారు చేయనున్నారు మరియు ఇది వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది. డిఫెండర్ 90 మరియు 110 హార్డ్ టాప్ మోడల్స్‌ను కొనుగోలు చేయబోయే కస్టమర్లు 21వ టెక్నాలజీ కనెక్టివిటీ కలయికను పొందనున్నారు. ఇది బ్రాండ్ యొక్క అత్యుత్తమ ఆఫ్-రోడ్ సామర్థ్యాలతో పాటు, విశాలమైన కార్గో స్థలాన్ని కలిగి ఉండి ప్రాక్టికాలిటీ దగ్గరా ఉంటుంది మరియు ప్రీమియం సౌకర్యాన్ని అందిస్తుంది.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ హార్డ్ టాప్ మోడళ్లను బ్రాండ్ యొక్క స్పెషల్ వెహికల్ ఆపరేషన్స్ (ఎస్‌విఓ) అభివృద్ధి చేస్తోంది. ఫలితంగా ఈ హార్డ్ టాప్ మోడళ్లు అత్యుతత్తమ ధృడత్వాన్ని, మన్నికను మరియు ప్రాక్టికాలిటీని ఆఫర్ చేయనున్నాయి. అల్యూమినియం D7x బాడీ ఆర్కిటెక్చర్‌తో రూపుదిద్దుకున్న ఈ డిఫెండర్ వాహనాలు ఇతర బాడీ-ఆన్-ఫ్రేమ్ డిజైన్ కంటే మూడు రెట్లు గట్టిగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.
MOST READ: భారత్ & చైనా వివాదం : ఆలస్యమైన హైమా బర్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ లాంచ్

ఈ విషయంపై ల్యాండ్ రోవర్ స్పెషల్ వెహికల్ ఆపరేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ మైఖేల్ వాన్ డెర్ సాండే మాట్లాడుతూ: "కొత్త డిఫెండర్ కార్గో ఏరియాను గరిష్ట ఫంక్షనాలిటీ, యూజబిలిటీతో అభివృద్ధి చేశాము. కఠినమైన పదార్థాలు మరియు తెలివైన స్టోరేజ్ పరిష్కారాలతో ఇది మునుపటి డిఫెండర్ హార్డ్ టాప్ మోడళ్ల కన్నా మరింత మెరుగైన సామర్థ్యాన్ని అందిస్తుంద"ని అన్నారు.

ల్యాండ్ రోవర్ వెహికల్ లైన్ డైరెక్టర్ నిక్ కాలిన్స్ మాట్లాడుతూ.. "కొత్త డిఫెండర్ 90 మరియు 110 హార్డ్ టాప్ మేము ఇప్పటివరకు ఉత్పత్తి చేసిన కష్టతరమైన, అత్యంత సమర్థవంతమైన మరియు అత్యంత అనుసంధానించబడిన వాణిజ్య 4x4 వాహనాలు. ఇవి ప్రపంచ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా, సుదీర్ఘ ప్రయాణాల్లో సైతం సౌకర్యంగా ఉండేలా, వ్యాపారాలు మరియు నిపుణులకు అన్ని ప్రపంచాలలో ఉత్తమమైన వాటిని అందించేలా ఇంజనీరింగ్ చేయబడ్డాయ"ని అన్నారు.
MOST READ: విధి నిర్వహణలో ఉన్న పోలీసును తన్నిన మాజీ MP, ఎవరో తెలుసా ?

ల్యాండ్ రోవర్ డిఫెండర్ హార్డ్ టాప్ మోడల్స్ కూడా 3,500 కిలోగ్రాముల పేలోడ్‌ను తీసుకొని వెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ హార్డ్ టాప్ మోడళ్లలో రెండవ, మూడవ వరుస సీటింగ్ లేకుండా వస్తాయి. వీటిని ముందు వరుసలో జంప్ సీట్లతో ఆఫర్ చేస్తారు, ఫలితంగా ముందు వరుసలో ముగ్గురు ప్రయాణీకులకు సౌకర్యవంతంగా కూర్చునే అవకాశం ఉంటుంది.

ఈ మార్పులు చేర్పులతో పాటుగా కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ హార్డ్ టాప్ మోడళ్లు పలు అధునాతన సాంకేతిక ఫీచర్లు మరియు డ్రైవింగ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్‌తో రానున్నాయి.
MOST READ: కెజిఎఫ్ స్టార్ యష్ లగ్జరీ కార్లు, ఎలా ఉన్నాయో చూసారా ?

‘హార్డ్ టాప్' మోనికర్ అసలు మోడళ్లను మొదటిసారిగా 1950 కాలంలో ప్రవేశపెట్టారు, వాటి నుండి స్పూర్తి పొంది ఈ మోడళ్లకు ఆ పేరును పెట్టారు. అప్పట్లోని ల్యాండ్ రోవర్ ఎస్‌యూవీలు డీమౌంటబుల్ హార్డ్ టాప్స్‌తో అందుబాటులో ఉండేవి. ఇది ప్రయాణీకులకు అదనపు భద్రత మరియు చుట్టుపక్కల అంశాల నుండి రక్షణ కల్పించేది. కాగా, ఇప్పుడొచ్చిన కొత్త-తరం హార్డ్ టాప్ మోడల్స్ స్థిరమైన మెటల్ పైకప్పుతో వచ్చినప్పటికీ, మునుపటి తరం మోడళ్ల మాదిరిగానే ప్రయాణీకులకు పూర్తి భద్రను అందించనున్నాయి.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ హార్డ్ టాప్ మోడళ్లపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
ల్యాండ్ రోవర్ మొట్టమొదటిసారిగా తమ ఐకానిక్ డిఫెండర్ ఎస్‌యూవీని గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టింది. ఈ శ్రేణిలోని 90 మరియు 110 మోడళ్లకు భారత మార్కెట్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా చాలా మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు, డిఫెండర్ శ్రేణిలో ‘హార్డ్ టాప్' వాణిజ్య నమూనాలను చేర్చడంతో ఈ శ్రేణి త్వరలోనే మరింత విస్తరించనట్లు అవుతుంది.