YouTube

భారత్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీ లాంచ్ ఎప్పుడంటే?

టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ ల్యాండ్ రోవర్ తమ డిఫెండర్ సిరీస్ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీలను అక్టోబర్ 15, 2020న భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు పేర్కొంది. భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా ల్యాండ్ రోవర్ తమ డిఫెండర్ బ్రాండ్‌ను భారత్‌లో విడుదల చేయనుంది. ఇది ల్యాండర్ రోవర్ బ్రాండ్ ముఖ్యమైన మైలురాయిగా మారనుంది.

భారత్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీ లాంచ్ ఎప్పుడంటే?

ల్యాండర్ రోవర్ డిఫెండర్ 90 (త్రీ-డోర్స్) మరియు డిఫెండర్ 110 (ఫైవ్-డోర్స్) అనే రెండు మోడళ్లలో లభ్యం కానుంది. ఈ రెండు మోడళ్లు ఒక్కొక్కటి ఐదు వేరియంట్లలో లభిస్తాయి. ల్యాండ్ రోవర్ ఈ ఏడాది ప్రారంభంలో డిఫెండర్ కోసం ధరలను కూడా ప్రకటించింది మరియు దేశంలో వీటి కోసం ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించింది.

భారత్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీ లాంచ్ ఎప్పుడంటే?

దేశీయ మార్కెట్లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90 ధరలు రూ.69.99 లక్షల నుంచి రూ.81.30 లక్షల మధ్యలో ఉండగా, డిఫెండర్ 110 మోడల్ ధరలు రూ.76.57 లక్షల నుంచి రూ.86.27 లక్షల మధ్యలో ఉన్నాయి. డిఫెండర్ 110 మోడల్ డెలివరీలు లాంచ్ సమయంలో ప్రారంభం కానుండగా, కోవిడ్-19 మహమ్మారి కారణంగా డిఫెండర్ 90 మోడల్ డెలివరీలు ఆలస్యం కానున్నాయి.

MOST READ:పాత స్కూటర్‌తో తల్లిని తీర్థయాత్రలకు తీసుకెళ్లిన కొడుక్కి KUV100 గిఫ్ట్ గా ఇచ్చిన ఆనంద్ మహీంద్రా

భారత్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీ లాంచ్ ఎప్పుడంటే?

కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ మోడళ్లూ రెండూ కూడా ఒకే రకమైన ఇంజన్‌తో లభ్యం కానున్నాయి. ఇందులోని 2.0-లీటర్, ఫోర్-సిలిండర్, టర్బో-పెట్రోల్ ‘పి 300' ఇంజన్ గరిష్టంగా 300 హెచ్‌పి పవర్‌ను మరియు 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఇంజన్ నుంచి వచ్చే శక్తిని నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేస్తుంది.

భారత్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీ లాంచ్ ఎప్పుడంటే?

కఠినమైన భూభాగాన్ని సులభంగా అధిగమించడం కోసం డిఫెండర్ ఎస్‌యూవీలో ల్యాండ్ రోవర్ టెర్రైన్ రెస్పాన్స్ సిస్టమ్ ఉంటుంది. డిఫెండర్ 110 మోడల్‌ను ఎయిర్ సస్పెన్షన్ సిస్టమ్‌తో స్టాండర్డ్‌గా అందిస్తున్నారు.

MOST READ:భారతదేశంలో దయనీయ స్థితిలో ఉన్న రోల్స్ రాయిస్ లగ్జరీ కార్లు, ఇవే

భారత్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీ లాంచ్ ఎప్పుడంటే?

ఆఫ్-రోడర్‌లోని ఇతర డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లలో క్రూయిజ్ కంట్రోల్, 360-డిగ్రీల 3డి సరౌండ్ కెమెరా, స్ట్రీమ్ క్రాసింగ్ మరియు డ్రైవర్ కండిషన్ మోనటరింగ్ కోసం వేడ్ సెన్సింగ్ ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా, ఇందులో బహుళ ఎయిర్‌బ్యాగులు, ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

భారత్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీ లాంచ్ ఎప్పుడంటే?

ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎక్స్‌టీరియర్ ఫీచర్లను గమనిస్తే, ఇందులో యు-ఆకారపు ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లతో కూడిన ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, చదరపు ఆకారంలో ఉన్న ఎల్‌ఈడి టెయిల్ లాంప్స్, డ్యూయెల్-టోన్ కలర్ మరియు సిల్వర్ కలర్‌లో ఫినిష్ చేయబడిన రూఫ్, రెండు చివర్లలో స్కఫ్ ప్లేట్స్ ఉన్నాయి.

MOST READ:ఇది చూసారా..కష్టాలను ఎదుర్కొని పరీక్షలో 87% మార్కులు సాధించి రూ. 25 వేల బహుమతి గెలిచిన విద్యార్ధి కథ

భారత్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీ లాంచ్ ఎప్పుడంటే?

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ల్యాండ్ రోవర్ డిఫెండర్ అనేక ఫీచర్లను కలిగి ఉంటుంది మరియు కఠినమైన డిజైన్ థీమ్‌ను కలిగి ఉంటుంది. మడ్డీ బూట్స్‌తో కూడిన రబ్బర్ ఫ్లోర్ మ్యాట్స్, గరిష్ట మన్నిక కోసం లెథర్ మరియు ఫ్యాబ్రిక్‌తో తయారు చేయబడిన సీట్స్, హెడ్-అప్ డిస్‌ప్లే, 12.3 ఇంచ్ పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

భారత్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీ లాంచ్ ఎప్పుడంటే?

ఈ విషయం గురించి జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా లిమిటెడ్ (జెఎల్‌ఆర్‌ఎల్) ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ సూరి మాట్లాడుతూ, "2009లో మేము దేశంలోకి ప్రవేశించిన తరువాత భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఐకానిక్ న్యూ డిఫెండర్‌ను తీసుకురావడం ల్యాండ్ రోవర్‌కు నిజంగా గర్వకారణం. ప్రపంచవ్యాప్తంగా లెజండ్రీ కల్ట్ హోదాను కలిగి ఉన్న ఒక వాహనాన్ని భారతదేశంలో ప్రారంభించడం మొత్తం ఆటో పరిశ్రమకే ముఖ్యమైన మైలురాయి అవుతుంది. భారతదేశంలో ఈ మోడల్ విడుదల కోసం అత్యంత ఆకర్షణీయమైన డిజిటల్ ప్రయోగ కార్యక్రమం ప్రణాళిక చేయబడిందని" అన్నారు.

MOST READ:బెనెల్లీ ఇంపీరియల్ బైక్‌ను సొంతం చేసుకోవటానికి ఇదే బెస్ట్ ఆఫర్!

భారత్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీ లాంచ్ ఎప్పుడంటే?

భారత్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

వాస్తవానికి ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఈపాటికే భారత మార్కెట్లో విడుదల కావల్సి ఉంది. అయితే, దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ ఎస్‌యూవీ రాక ఆలస్యమైంది. ఈ ఏడాది ప్రారంభంలో డిఫెండర్ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ శ్రేణి ధరలను కంపెనీ ప్రకటించింది. ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎలాంటి భూభాగాలనైనా అధిగమించగలదు. గో-ఎనీవేర్ అనే సిద్ధాంతంతో తయారైన డిఫెండర్ ఈ విభాగంలో జీప్ వ్రాంగ్లర్, మెర్సిడెస్ బెంజ్ జి350 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Land Rover will launch its Defender range of off-road SUVs on October 15, 2020, in the Indian market. The company will be launching the Defender brand for the first time in the country, which will mark a significant milestone for Land Rover in India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X