భారత్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ హైబ్రిడ్ బుకింగ్స్ స్టార్ట్

భారతదేశంలో ల్యాండ్‌రోవర్ డిఫెండర్ పి 400 ఇ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ యొక్క బుకింగ్స్ మంగళవారం నుంచి ప్రారంభమైంది. డిఫెండర్ హైబ్రిడ్ మునుపటి కంటే సురక్షితమైనది మరియు శక్తివంతమైనదని కంపెనీ పేర్కొంది. ల్యాండ్ రోవర్ డిఫెండర్ యొక్క హైబ్రిడ్ మోడల్ డిఫెండర్ పి 400 ఇను కంపెనీ సెప్టెంబరులో వెల్లడించింది. కంపెనీ దీనిని త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిసింది.

భారత్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ హైబ్రిడ్ బుకింగ్స్ స్టార్ట్

ల్యాండ్‌రోవర్ డిఫెండర్ ని కంపెనీ కొత్త సంవత్సరంలో దీన్ని ప్రారంభించబోతున్నట్లు తెలిపింది. డిఫెండర్ పి 400 ఇ 110 బాడీ డిజైన్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించబడింది. ఇది పెట్రోల్ ఇంజిన్‌తో 40 బిహెచ్‌పి విద్యుత్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటారును కూడా కలిగి ఉంది.

భారత్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ హైబ్రిడ్ బుకింగ్స్ స్టార్ట్

ఎలక్ట్రిక్ మోడ్‌లో మాత్రమే ఈ కారు 43 కిలోమీటర్ల వరకు పరిధిని అందించగలదని కంపెనీ తెలిపింది. హైబ్రిడ్ ఇంజన్లు లార్జర్ వీల్ బేసిస్ వేరియంట్‌లతో మాత్రమే అందుబాటులో ఉంటాయి.

MOST READ:ఒకే కారుని 77 సంవత్సరాలు ఉపయోగించాడు.. ఇంతకీ అతడెవరో తెలుసా ?

భారత్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ హైబ్రిడ్ బుకింగ్స్ స్టార్ట్

ఈ కారుకు 2 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్, 104 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారుతో అమర్చారు. ఎలక్ట్రిక్ మోటారు సహాయంతో, ఈ కారు 400 బిహెచ్‌పి మరియు 640 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తిని అందిస్తుంది.

భారత్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ హైబ్రిడ్ బుకింగ్స్ స్టార్ట్

డిఫెండర్ హైబ్రిడ్ కేవలం 5.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్లు వేగవంతం చేయగలదు. కారు యొక్క గరిష్ట వేగం గంటకు 209 కి.మీ. ఈ కారులోని 19.2 కిలోవాట్ల బ్యాటరీని ఇంట్లో 15 ఆంపియర్ లేదా 7.4 కిలోవాట్ల వాల్ సాకెట్‌తో ఛార్జ్ చేయవచ్చు, ఇది కారుతో అనుబంధంగా ఉంటుంది. ఈ కారుకు డిసి సాకెట్‌తో ఛార్జింగ్ చేసే అవకాశం కూడా ఇవ్వబడింది.

MOST READ:కవాసకి బైక్ ఇంజిన్‌తో నడిచే హెలికాఫ్టర్.. మీరు చూసారా !

భారత్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ హైబ్రిడ్ బుకింగ్స్ స్టార్ట్

7 కిలోవాట్ల డిసి వాల్ బాక్స్ ఛార్జర్ సహాయంతో కేవలం 2 గంటల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. అదే సమయంలో, దాని బ్యాటరీని కేవలం 30 నిమిషాల్లో 80 శాతం వరకు డిసి ఛార్జర్‌తో ఛార్జ్ చేయవచ్చు.

భారత్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ హైబ్రిడ్ బుకింగ్స్ స్టార్ట్

ఈ ల్యాండ్ రోవర్ యొక్క ఫీచర్స్ గమనించినట్లయితే ఈ కారులో 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌తో ఎలక్ట్రిక్ ఎయిర్ సస్పెన్షన్ ఉంది. ఎలక్ట్రిక్ మోడ్‌లో తక్కువ సెట్టింగ్‌లో మాత్రమే కారు నడపబడుతుంది. ఎలక్ట్రిక్ మోడ్‌లో, ఈ కారును ఆఫ్-రోడ్‌తో పాటు సాధారణ రహదారిలో నడపవచ్చు.

MOST READ:మీకు తెలుసా.. అత్యంత ఖరీదైన తెలుగు హీరోల కార్లు, వాటి వివరాలు

భారత్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ హైబ్రిడ్ బుకింగ్స్ స్టార్ట్

కారు ఛార్జింగ్ స్టేటస్ తెలుసుకోవడానికి రిమోట్ మొబైల్ అప్లికేషన్ కూడా ఇవ్వబడుతోంది. ఈ అప్లికేషన్ సహాయంతో వాహనదారుడు, కారు యొక్క బ్యాటరీ స్టేటస్, ఛార్జింగ్ టైమ్ వంటి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

భారత్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ హైబ్రిడ్ బుకింగ్స్ స్టార్ట్

ఇవి మాత్రమే కాకుండా దీనికి స్టాండర్డ్ త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, ప్రైవసీ గ్లాస్, సోలార్ గ్లాస్, రీజెనరేటివ్ బ్రేకింగ్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. డిఫెండర్ హైబ్రిడ్ పి 400 ఇ ఐదు మరియు ఆరు సీట్ల ఎంపికలతో నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ఎస్ఇ, హెచ్ఎస్ఇ, ఎక్స్-డైనమిక్స్ హెచ్ఎస్ఇ మరియు ఎక్స్ వేరియంట్లు.

MOST READ:ఒకే వారంలో రెండుసార్లు జరిమానా చెల్లించిన డిప్యూటీ మేయర్.. ఎవరో తెలుసా ?

భారత్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ హైబ్రిడ్ బుకింగ్స్ స్టార్ట్

డిఫెండర్ హైబ్రిడ్ 2021 మరియు 2022 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారతదేశంలో ప్రారంభించవచ్చు. దీనిని రూ. 75.59 లక్షల (ఎక్స్‌షోరూమ్) ధరకు లాంచ్ చేసే అవకాశం ఉంది.

భారత్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ హైబ్రిడ్ బుకింగ్స్ స్టార్ట్

ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90 మరియు 110 అక్టోబర్‌లో ప్రారంభించబడింది. ఇది 3 డోర్స్ మరియు 5 డోర్స్ వేరియంట్లలో తీసుకురాబడింది. దీని 5 డోర్ మోడల్ ధర రూ. 79.94 లక్షలు. ఇందులో డిఫెండర్ 90 టాప్ వేరియంట్ ధర రూ. 84.63 లక్షలు కాగా, డిఫెండర్ 110 యొక్క టాప్ వేరియంట్ ధర రూ. 89.63 లక్షలు. ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90, మరియు డిఫెండర్ 110 లేదా హైబ్రిడ్ వేరియంట్లు రూ. 2 లక్షల ముందస్తు మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

భారత్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ హైబ్రిడ్ బుకింగ్స్ స్టార్ట్

ల్యాండ్ రోవర్ డిఫెండర్ చూటడానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా వాహనదారునికి చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. ఈ కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ అనేక ఆధునిక ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల ఎక్కువమంది వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Land Rover Defender Plugin Hybrid Booking Starts Price Features Specifications. Read in Telugu.
Story first published: Tuesday, December 15, 2020, 19:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X