ఇండియాలో లాంచ్ అయిన లెక్సస్ ఎల్‌సి 500 హెచ్, దీని ధర తెలిస్తే షాక్ అవుతారు

లగ్జరీ కార్ల తయారీ సంస్థ లెక్సస్ ఎల్‌సి 500 హెచ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ వాహనం యొక్క ధర ఇండియన్ మార్కెట్లో రూ. 1.96 కోట్లు (ఎక్స్-షోరూమ్ ఇండియా).

ఇండియాలో లాంచ్ అయిన లెక్సస్ ఎల్‌సి 500 హెచ్, దీని ధర తెలిస్తే షాక్ అవుతారు

లెక్సస్ బ్రాండ్ నుంచి రెండు మోడళ్లను విడుదల చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అవి లెక్సస్ ఇఎస్ 300 హెచ్, మరియు ఎన్ఎక్స్ 300 హెచ్ ఎక్స్‌క్విజిట్. వీటి ధరలు రూ. 51.90 లక్షల నుంచి రూ. 60.60 లక్షల మధ్య ఉంటుంది(ఎక్స్‌షోరూమ్- ఇండియా).

ఇండియాలో లాంచ్ అయిన లెక్సస్ ఎల్‌సి 500 హెచ్, దీని ధర తెలిస్తే షాక్ అవుతారు

ఎల్‌సి 500 హెచ్ కూపే హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాల యొక్క పనితీరులోని పురోగతి మరియు వాహనం అద్భుతమైన డిజైన్ వినియోగదారులను బాగా ఆకర్షిస్తుంది. ఈ వాహనంలో షార్ప్ గ్రిల్ మరియు 3 - ఎలిమెంట్ ఎల్ఇడి హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి.

ఇండియాలో లాంచ్ అయిన లెక్సస్ ఎల్‌సి 500 హెచ్, దీని ధర తెలిస్తే షాక్ అవుతారు

లెక్సస్ ఎల్‌సి 500 హెచ్‌ లో షోల్డర్ లైన్, పొడవైన క్యాబిన్, 21 అంగుళాల ఫోర్జ్డ్ అల్యూమినియం అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. దీనిలో ఎల్ఇడి టెయిల్ లాంప్స్, డ్యూయల్ ఎగ్జాస్ట్స్ మరియు రియర్ డిఫ్యూజర్ వంటివి ఉన్నాయి.

ఇండియాలో లాంచ్ అయిన లెక్సస్ ఎల్‌సి 500 హెచ్, దీని ధర తెలిస్తే షాక్ అవుతారు

లెక్సస్ ఎల్‌సి 500 హెచ్ లో ఇంటీరియర్స్ తో పాటు, 10.3 అంగుళాల టచ్ స్క్రీన్ అడ్వాన్స్‌డ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు 10-వే అడ్జస్టబుల్ డ్రైవ్ సీట్ ఉన్నాయి.

ఇండియాలో లాంచ్ అయిన లెక్సస్ ఎల్‌సి 500 హెచ్, దీని ధర తెలిస్తే షాక్ అవుతారు

ఎల్‌సి 500 హెచ్ లో ఉన్న వి 6 పెట్రోల్ ఇంజన్ 295 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ వాహనంలో రెండు 110 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్లు కూడా ఉన్నాయి. ఇవి పవర్ ఫిగర్‌లను 355 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ మూడు-దశల సివిటి మరియు నాలుగు-స్పీడ్ టార్క్ కన్వర్టర్‌ను కలిగి ఉన్న 10 స్పీడ్ యూనిట్‌తో జతచేయబడుతుంది.

ఇండియాలో లాంచ్ అయిన లెక్సస్ ఎల్‌సి 500 హెచ్, దీని ధర తెలిస్తే షాక్ అవుతారు

లెక్సస్ ఎల్‌సి 500 హెచ్ లోని భద్రతా లక్షణాలను గమనించినట్లయితే ఇందులో ప్రీ-కొలిక్షన్ బ్రేకింగ్, పేడిస్ట్రియన్ డిటెక్షన్, అడాప్టివ్ హెడ్ లైట్స్, లేన్ అసిస్ట్ వంటివి ఇందులో ఉన్నాయి. ఇవే కాకుండా అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్‌, బ్లైండ్ స్పాట్ మానిటర్, క్రాస్ ట్రాఫిక్ అలెర్ట్ సిస్టమ్ తో పాటు 10 ఎయిర్ బ్యాగ్ లు ఉంటాయి. ఇది హైవే డ్రైవింగ్ మరియు స్టాప్ అండ్ గో ట్రాఫిక్ తో సహా ఎటువంటి వేగంలో అయినా ప్రయాణించగలదు.

ఇండియాలో లాంచ్ అయిన లెక్సస్ ఎల్‌సి 500 హెచ్, దీని ధర తెలిస్తే షాక్ అవుతారు

లెక్సస్ వాహనం గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది. ఇందులో ఉక్కు, అల్యూమినియం, కార్బన్ ఫైబర్ వంటివి ఉపయోగించారు. ఇవన్నీ వాహనానికి దృఢత్వాన్ని కల్పించడంతో పాటు భద్రతను కూడా పెంచుతుంది.

ఇండియాలో లాంచ్ అయిన లెక్సస్ ఎల్‌సి 500 హెచ్, దీని ధర తెలిస్తే షాక్ అవుతారు

లెక్సస్ ఇండియా ఛైర్మన్ మసకాజు యోషిమురా మాట్లాడుతూ, ఇప్పుడు లాంచ్ చేసిన లెక్సస్ కారు ఇండియాలో పారిశ్రామిక రబీగంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. భారతదేశంలో ఆర్ధిక వ్యవస్థను బాగా మెరుగు పరచడానికి ఈ ఉత్పత్తులు బాగా తోడ్పడుతాయి. లెక్సస్ లాంటి అసాధారణ ఉత్పత్తి వినియోగదారులకు ఎంతో నమ్మికయినదిగా ఉంటుంది అన్నారు.

ఇండియాలో లాంచ్ అయిన లెక్సస్ ఎల్‌సి 500 హెచ్, దీని ధర తెలిస్తే షాక్ అవుతారు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియాలో లెక్సస్ ఎల్‌సి 500 హెచ్ రూ. 1.96 కోట్లు. ఈ వాహనం అద్భుతమైన ఫీచర్స్ మరియు భద్రతలను కలిగి ఉంది. లెక్సస్ ఎల్‌సి 500 హెచ్‌ కి, జాగ్వార్ ఎఫ్-టైప్ మరియు మెర్సిడెస్-ఎఎమ్‌జి ఎస్ 63 కూపే వంటివి మార్కెట్లో కొంత పోటీని కలిగి ఉంటాయి.

Most Read Articles

English summary
Lexus LC500h Launched In India At Rs 1.96 Crore: Details And Features. Read in Telugu.
Story first published: Friday, January 31, 2020, 16:35 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X