కరోనా ఎఫెక్ట్ : మే 3 వరకు రద్దు చేయబడిన ట్రైన్ సర్వీసులు

భారతదేశంలో అధికంగా ఉన్న కరోనా వైరస్ వ్యాప్తి వల్ల భారత ప్రభుత్వం లాక్ డౌన్ 2020 మే 03 వరకు పొడిగించింది. భారత ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కూడా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కరోనా ఎఫెక్ట్ : మే 3 వరకు రద్దు చేయబడిన ట్రైన్ సర్వీసులు

భారతదేశంలో లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో భారత రైల్వే సంస్థ అన్ని ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అన్ని ప్రీమియం రైళ్లు, మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లతో సహా దేశంలోని అన్ని ప్యాసింజర్ రైళ్లను మే 3 వరకు రద్దు చేసినట్లు భారత రైల్వే అధికారికంగా ప్రకటించింది.

కరోనా ఎఫెక్ట్ : మే 3 వరకు రద్దు చేయబడిన ట్రైన్ సర్వీసులు

కొంకణ్ రైల్వే, కోల్‌కతా మెట్రో, సబర్బన్ రైల్ సర్వీసులు కూడా ఇదే నిర్ణయం తీసుకున్నాయి. ఈ రోజు అధికారిక ప్రకటన చేశారు, మరియు కొత్త తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

MOST READ: కరోనా బాధితుల కోసం బైక్ అంబులెన్సులు విరాళంగా ఇచ్చిన హీరో మోటోకార్ప్

కరోనా ఎఫెక్ట్ : మే 3 వరకు రద్దు చేయబడిన ట్రైన్ సర్వీసులు

ఏప్రిల్ 14 తర్వాత ప్యాసింజర్ రైలు సర్వీసును ప్రకటించనున్నట్లు భారత రైల్వే గతంలో ప్రకటించింది. ఇప్పుడు బుకింగ్ గురించి గందరగోళం తొలగిపోయింది. కొన్ని ప్రత్యేక ప్రీమియం రైళ్లను ఏప్రిల్ 15 న బుక్ చేశారు. ఇది రైలు సర్వీసును ప్రారంభించడం గందరగోళానికి కారణమైంది.

కరోనా ఎఫెక్ట్ : మే 3 వరకు రద్దు చేయబడిన ట్రైన్ సర్వీసులు

ఇప్పుడు అన్ని గందరగోళాలకు తొలగించి భారత రైల్వే మే 3 వరకు ఎటువంటి ప్యాసింజర్ రైళ్లను నడపబోమని స్పష్టం చేసింది. అవసరమైన వస్తువులను రవాణా చేసే ఉద్దేశ్యంతో సరుకు రవాణా రైళ్లు మాత్రమే నడపబడతాయి.

MOST READ: అధికారిక వెబ్ సైట్ నుంచి తొలగించబడిన హోండా మోటార్ సైకిల్స్, ఎందుకంటే..?

కరోనా ఎఫెక్ట్ : మే 3 వరకు రద్దు చేయబడిన ట్రైన్ సర్వీసులు

కరోనా వైరస్ నివారణలో భాగంగా భారతీయ రైల్వే ప్రభుత్వంతో చేతులు కలిపింది. రైల్వే శాఖ కూడా ట్రైన్లను ఐసోలేషన్ వార్డులుగా మార్చింది. ఈ బోగీలను దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉపయోగిస్తున్నారు.

కరోనా ఎఫెక్ట్ : మే 3 వరకు రద్దు చేయబడిన ట్రైన్ సర్వీసులు

అనుమానాస్పద కరోనా వైరస్ భాదితులను వేరుచేయడానికి 20 వేలకు పైగా బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చారు. ఈ రైలు బోగీలలో అనేక మార్పులు చేయబడ్డాయి.

MOST READ: అంబానీ యొక్క రోల్స్ రాయిస్ కార్స్ చూసారా..!

కరోనా ఎఫెక్ట్ : మే 3 వరకు రద్దు చేయబడిన ట్రైన్ సర్వీసులు

దేశవ్యాప్తంగా అన్ని రకాల ప్రయాణాలు నిషేధించబడ్డాయి. ఈ కారణంగా రైల్వే శాఖ ప్యాసింజర్ రైళ్లను కరోనా బాధితుల కోసం ఉపయోగించింది. ఆసుపత్రుల కొరత ఉంటే ఈ బోగీలను ఉపయోగించుకునే అవకాశాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.

కరోనా ఎఫెక్ట్ : మే 3 వరకు రద్దు చేయబడిన ట్రైన్ సర్వీసులు

రైల్వే కర్మాగారాలలో వైద్య పరికరాలను కూడా తయారు చేస్తున్నారు. రైల్వే క్యాంటీన్లలో అవసరమైన వారికి ఆహార ప్యాకెట్లను పంపిణీ చేయడం కూడా మొదలుపెట్టింది. ఏది ఏమైనా కరోనా నివారణలో భారత రైల్వే కూడా తన వంతు మద్దతుని ప్రకటించింది.

MOST READ:భారతదేశంలో అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 10 కార్లు ఇవే

Most Read Articles

English summary
Passenger Train services remains cancel till 3rd May. Read in Telugu.
Story first published: Wednesday, April 15, 2020, 10:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X