నవంబర్ 2020లో లగ్జరీ కార్లకు కలిసిరాని లక్

ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఎఫ్ఏడిఏ) విడుదల చేసిన డేటా ప్రకారం, గడచి ననవంబర్ 2020 నెలలో భారతదేశంలో లగ్జరీ కార్ల అమ్మకాలు మరియు రిజిస్ట్రేషన్లు భారీగా క్షీణించాయి. గతేడాది నవంబర్ (2019)తో పోల్చుకుంటే దేశంలో లగ్జరీ అమ్మకాలు భారీగా తగ్గాయి.

నవంబర్ 2020లో లగ్జరీ కార్లకు కలిసిరాని లక్

ఈ డేటా ప్రకారం, నవంబర్ 2020లో టాప్ 10 లగ్జరీ కార్ల జాబితాలో మెర్సిడెస్ బెంజ్ ఇండియా అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో బిఎమ్‌డబ్ల్యూ, ఆడి, జాగ్వార్ ల్యాండ్ రోవ్, వోల్వో, పోర్ష్, లాంబోర్గినీ, ఫెరారీ, రోల్స్ రాయిస్ మరియు బెంట్లీ బ్రాండ్‌లు ఉన్నాయి. బ్రాండ్ వారీగా అమ్మకాల వివరాలు ఇలా ఉన్నాయి:

నవంబర్ 2020లో లగ్జరీ కార్లకు కలిసిరాని లక్

నవంబర్ 2020లో మెర్సిడెస్ బెంజ్ ఇండియా దేశీయ విపణిలో 897 లగ్జరీ కార్లను విక్రయించింది. కాగా, నవంబర్ 2019లో వీటి సంఖ్య 1,223 యునిట్లుగా ఉంది. అప్పటితో పోల్చుకుంటే కంపెనీ గత నెలలో 27 శాతం క్షీణతను నమోదు చేసింది.

MOST READ:ఇకపై హ్యుందాయ్ కస్టమర్లందరికీ మొబిలిటీ మెంబర్‌షిప్ - వివరాలు

నవంబర్ 2020లో లగ్జరీ కార్లకు కలిసిరాని లక్

మెర్సిడెస్ బెంజ్ తర్వాతి స్థానంలో రెండవ అతిపెద్ద సంస్థగా బిఎమ్‌డబ్ల్యూ ఇండియా కొనసాగుతోంది. గత నెలలో మొత్తం 728 బిఎమ్‌డబ్ల్యూ లగ్జరీ కార్లు అమ్ముడుపోగా, నవంబర్ 2019లో వీటి సంఖ్య 954 యునిట్లుగా ఉంది. అప్పటితో పోల్చుకుంటే కంపెనీ గత నెలలో 24 శాతం క్షీణతను నమోదు చేసింది.

నవంబర్ 2020లో లగ్జరీ కార్లకు కలిసిరాని లక్

ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నది జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి. నవంబర్ 2019లో ఆడి మొత్తం 260 లగ్జరీ కార్లను విక్రయించగా, నవంబర్ 2020లో 236 కార్లను విక్రయించి 9 శాతం తగ్గుదలను నమోదు చేసింది.

MOST READ:నవంబర్ 2020లో ఆ రెండు విభాగాలు మాత్రమే వృద్ధి చెందాయి

నవంబర్ 2020లో లగ్జరీ కార్లకు కలిసిరాని లక్

టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఈ జాబితాలో నాల్గవ స్థానంలో కొనసాగుతోంది. నవంబర్ 2020లో జెఎల్ఆర్ మొత్తం 199 కార్లను విక్రయించింది. అంతకు ముందు ఇదే సమయంలో కంపెనీ అమ్మకాలు 317 యూనిట్లు ఉన్నాయి. ఈ సమయంలో జెఎల్ఆర్ 37 శాతం క్షీణతను నమోదు చేసింది.

నవంబర్ 2020లో లగ్జరీ కార్లకు కలిసిరాని లక్

ఇక ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉన్నది స్వీడన్‌కి చెందిన లగ్జరీ కార్ బ్రాండ్ వోల్వో. వోల్వో ఇండియా గడచిన నవంబర్ 2020లో మొత్తం 169 కార్లను విక్రయించింది. నవంబర్ 2019లో ఇవి 196 యూనిట్లుగా నమోదయ్యాయి. అప్పటితో పోల్చుకుంటే కంపెనీ అమ్మకాలు 14 శాతం క్షీణించాయి.

MOST READ:హ్యుందాయ్ కార్లపై ఇయర్ ఎండ్ ఆఫర్స్; రూ.1 లక్ష వరకూ తగ్గింపు!

నవంబర్ 2020లో లగ్జరీ కార్లకు కలిసిరాని లక్

ఆరవ స్థానంలో ఉన్న పోర్ష్ లగ్జరీ బ్రాండ్ నవంబర్ 2020లో 27 యూనిట్లను విక్రయించి 18 శాతం క్షీణతను నమోదు చేసింది. నవంబర్ 2019లో కంపెనీ మొత్తం 33 కార్లను విక్రయించింది.

నవంబర్ 2020లో లగ్జరీ కార్లకు కలిసిరాని లక్

ఇకపోతే, లాంబోర్గినీ సూపర్ కార్ బ్రాండ్ గడచిన నవంబర్ నెలలో అనూహ్యంగా 300 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత నెలలో కంపెనీ మొత్తం 4 సూపర్ కార్లను విక్రయించింది. అంతుకు ముందుక ఇదే సమయంలో (నవంబర్ 2019లో) కంపెనీ కేవలం 1 కారును మాత్రమే విక్రయించింది.

MOST READ:మరోసారి పెరిగిన కెటిఎమ్, హస్క్వార్నా మోటార్‌సైకిల్ ధరలు

నవంబర్ 2020లో లగ్జరీ కార్లకు కలిసిరాని లక్

ఆ తర్వాతి స్థానాల్లో ఫెరారీ, రోల్స్ రాయిస్ కంపెనీలు నవంబర్ 2020 నెలలో చెరొక కారు చొప్పున విక్రయించి వరుసగా 66 శాతం మరియు 75 శాతం క్షీణతలను నమోదు చేశాయి. ఇకపోతే, ఈ జాబితాలో చివరి బ్రాండ్ అయిన బెంట్లీ గడచిన నెలలో ఒక్క కారును కూడా విక్రయించలేదు.

Most Read Articles

English summary
Luxury car sales went down by 24.45 percent in November 2020. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X