మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ కారు 'ప్రవైగ్ ఎక్స్‌టింక్షన్' ఆవిష్కరణ

ఇటీవలి కాలంలో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు గిరాకీ గణనీయంగా పెరుగుతోంది. దేశంలో వాహన కాలుష్యం ప్రమాదస్థాయికి చేరుతున్న నేపథ్యంలో, వినియోగదారులు కూడా గ్రీన్ వాహనాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో, కొత్తగా దేశీయ కంపెనీలు కూడా పుట్టుకొస్తున్నాయి.

మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ కారు 'ప్రవైగ్ ఎక్స్‌టింక్షన్' ఆవిష్కరణ

తాజాగా, బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కంపెనీ ప్రవైగ్ డైనమిక్స్ ఓ సరికొత్త ఎలక్ట్రిక్ కారును తయారు చేసింది. 'ప్రవైగ్ ఎక్స్‌టింక్షన్ ఎమ్‌కె1' పేరుతో విడుదలైన ఈ ఎలక్ట్రిక్ కారును పూర్తిగా భారతదేశంలోనే తయారు చేశారు. మరికొద్ది రోజుల్లోనే ఈ కారు ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ కారు 'ప్రవైగ్ ఎక్స్‌టింక్షన్' ఆవిష్కరణ

ప్రవైగ్ ఎక్స్‌టింక్షన్ ఎమ్‌కె1 ఎలక్ట్రిక్ కారును పూర్తిగా ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో అంతర్జాతీయ మార్కెట్లలో లభించే ఆల్ట్రా లగ్జరీ కార్ల మాదిరిగా డిజైన్ చేశారు. భారత మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ కారు చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే లభ్యం కానుంది. ప్రవైగ్ డైనమిక్స్ ఏటా 250 యూనిట్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ కారు 'ప్రవైగ్ ఎక్స్‌టింక్షన్' ఆవిష్కరణ

కొత్త ప్రవైగ్ ఎక్స్‌టింక్షన్ ఎలక్ట్రిక్ కారును ముందుగా ఢిల్లీ, బెంగుళూరు నగరాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ తర్వాతి కాలంలో చెన్నై, ముంబై మరియు హైదరాబాద్ నగరాల్లో విడుదల చేసే అవకాశం ఉంది.

మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ కారు 'ప్రవైగ్ ఎక్స్‌టింక్షన్' ఆవిష్కరణ

ప్రవైగ్ డైనమిక్స్ తమ ఎక్స్‌టింక్షన్ ఎమ్‌కె1 కారుని కేవలం విక్రయానికే కాకుండా లీజింగ్/రెంటింగ్ విధానం ద్వారా కూడా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఇలా చేయటం వలన కస్టమర్లు ఈ ఖరీదైన కారుని సొంతం చేసుకోలేకపోయినప్పటికీ, కొంత కాలం పాటు వినియోగించుకునే అవకాశం మాత్రం కలుగుతుంది.

మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ కారు 'ప్రవైగ్ ఎక్స్‌టింక్షన్' ఆవిష్కరణ

ప్రవైగ్ ఎక్స్‌టింక్షన్ ఎలక్ట్రిక్ కారు సన్నని ఎల్‌ఈడి స్ట్రిప్‌తో అనుసంధానించబడిన ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారులో స్టైలిష్ ఎల్ఈడి టెయిల్ లైట్లతో పాటు స్టైలిష్ వీల్స్ కూడా ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారు ఎక్స్‌టీరియర్ పెద్ద హంగు ఆర్భాటాలేమీ లేకుండా మినిమాలిక్ స్టైలింగ్‌ను కలిగి ఉంది.

మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ కారు 'ప్రవైగ్ ఎక్స్‌టింక్షన్' ఆవిష్కరణ

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ప్రవైగ్ ఎక్స్‌టింక్షన్ 96 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 201 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి మరియు 2400 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని తెలుస్తోంది.

మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ కారు 'ప్రవైగ్ ఎక్స్‌టింక్షన్' ఆవిష్కరణ

పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే, ప్రవైగ్ ఎక్స్‌టింక్షన్ ఎమ్‌కె1 ఎలక్ట్రిక్ కారు కేవలం 5.4 సెకన్లలోనే గంటకు గరిష్టంగా 0 - 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 196 కిలోమీటర్లుగా ఉంటుందని కంపెనీ తెలిపింది.

మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ కారు 'ప్రవైగ్ ఎక్స్‌టింక్షన్' ఆవిష్కరణ

ప్రవైగ్ ఎక్స్‌టింక్షన్ ఎమ్‌కె1 పూర్తి ఛార్జీపై గరిష్టంగా 504 కిలోమీటర్ల రేంజ్‌ను కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఫాస్ట్ ఛార్జింగ్ సామర్ధ్యాలతో కూడా లభ్యం కానుంది. ఫాస్ట్ చార్జర్ సాయంతో దీనిని కేవలం 30 నిమిషాల్లోనే 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ కారు 'ప్రవైగ్ ఎక్స్‌టింక్షన్' ఆవిష్కరణ

ప్రవైగ్ ఎక్స్‌టింక్షన్ ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఎమ్‌కె1 ఎలక్ట్రిక్ కారు చూడటానికి చాలా స్టైలిష్‌గా, మంచి ఫ్యూచరిస్టిక్ లుక్‌లో కనిపిస్తుంది. ప్రవైగ్ ఎక్స్‌టింక్షన్ కారు విషయంలో కంపెనీ క్లెయిమ్ చేసిన ఫీచర్లు మరియు గణాంకాలు నిజమైతే, ఇది భారత మార్కెట్లో గేమ్-ఛేంజర్ మోడల్‌గా మారి, ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఇది కొత్త శకానికి నాంది పలికే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Bengaluru based electric vehicle startup Pravaig Dynamics has unveiled its first made in India electric car Pravaig Extinction. Read in Telugu.
Story first published: Saturday, December 5, 2020, 16:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X