Just In
- 11 hrs ago
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- 13 hrs ago
హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్యూవీ వస్తోంది, టీజర్ విడుదల
- 14 hrs ago
పూర్తి చార్జ్‌పై 500 కి.మీ ప్రయాణించే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఎలక్ట్రిక్!
- 14 hrs ago
మాట నిలబెట్టుకున్న జగన్మోహన్రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : జాబ్ కోసం నిరుద్యోగులు అకస్మాత్తుగా జర్నీ చేయొచ్చు...!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Movies
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రాపిడ్ రెస్పాన్స్ మొబైల్ లాబొరేటరీ ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ?
భారతదేశంలో కరోనా వైరస్ రోజు రోజుకి ఎక్కువవుతున్న కారణంగా ప్రతిరోజూ నిర్వహించే పరీక్షల సంఖ్యను మరింత పెంచే ప్రయత్నంలో మరియు దేశంలోని ప్రతి మూలన పరీక్షలు జరిగేలా చూసేందుకు, కేంద్ర ప్రభుత్వం దేశం యొక్క మొట్టమొదటి మొబైల్ టెస్టింగ్ ల్యాబరేటరీ ప్రారంభించింది.

మొబైల్ టెస్టింగ్ లాబొరేటరీ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ఢిల్లీ నుండి ప్రారంభం చేసారు. రాపిడ్ రెస్పాన్స్ మొబైల్ లాబొరేటరీ బయోటెక్నాలజీ విభాగం, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, వైజాగ్ ఆధారిత ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ - వైద్య పరికరాల దేశీయ తయారీని ప్రోత్సహించే సంస్థల మధ్య సహకారం యొక్క ఫలితంగా ఇది ప్రారంభమయింది.

ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ లాబొరేటరీ కేవలం ఎనిమిది రోజులలో నిర్మించబడింది. ఈ లాబొరేటరీ ఒక్క కోవిడ్ -19 వైరస్ టెస్ట్ మాత్రమే కాకుండా టిబి మరియు హెచ్ఐవి పరీక్షలు చేయటానికి ఇది అమర్చబడింది. కోవిడ్-19 పరిస్థితి పూర్తిగా రూపు మాపిన తరువాత ఇతర వ్యాధులు మరియు వైరస్ టెస్ట్ కోసం పరీక్షించడానికి మొబైల్ యూనిట్‌ను ఉపయోగించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
MOST READ:ఇండియాలో కార్ కేర్ ప్రొడక్ట్ లాంచ్ చేసిన టర్టల్ వాక్స్

ఈ మొబైల్ లాబొరేటరీ 200 ఇతర పరీక్షలతో పాటు, ఒకేసారి 60 కోవిడ్ -19 పరీక్షలను నిర్వహించగలదు. ఎనిమిది గంటల వ్యవధిలో దాని ఉత్పత్తి సామర్థ్యాన్ని 500 పరీక్షలకు రెట్టింపు చేసే రెండు సెట్ల యంత్రాలు కూడా ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి.

నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ (ఎన్ఎబిఎల్) ధ్రువీకరణ ప్రకారం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం రాపిడ్ రెస్పాన్స్ మొబైల్ లాబొరేటరీని ఉత్పత్తి చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
MOST READ:RTO వాహన రిజిస్ట్రేషన్లను రీస్టార్ట్, ఎక్కడో తెలుసా !

డాక్టర్ హర్ష్ వర్ధన్ దీని గురించి మాట్లాడుతూ మొత్తం 50 మొబైల్ లాబొరేటరీ సదుపాయాలు తయారు చేయబడతాయి మరియు కోవిడ్-19 పరీక్ష మరియు చికిత్సలను వేగవంతం చేయడానికి దేశంలోని మారుమూల ప్రాంతాలలో ఈ వెహికల్స్ ఉపయోగించబడతాయి.

ఈ వాహనాలు ఒక్క వైద్య పరీక్షలకు మాత్రమే కాకుండా వస్తువుల రైళ్లలో ఎక్కించటానికి బలంగా కూడా నిర్మించబడింది. తద్వారా ఇది దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఉపయోగించబడుతుంది. ఈ విధంగా ఉపయోగించడానికి ఈ వాహనం దృఢంగా తయారుచేయబడింది.
MOST READ:కొత్తగా కనిపిస్తున్న మూడు కార్లు కలయికతో తయారయిన కొత్త కారు

రాపిడ్ రెస్పాన్స్ మొబైల్ లాబొరేటరీ గురించి డ్రైవ్స్పార్క్ ఆలోచనలు :
కరోనా వైరస్ నివారణకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మంచి చొరవ. ఇప్పుడు దేశానికి మెరుగైన, సమర్థవంతమైన టెస్టులు చాలా అవసరం. ఈ పరీక్షలు రాపిడ్ రెస్పాన్స్ మొబైల్ లాబొరేటరీ సహాయపడుతుందని భావిస్తున్నారు.