భారీ డిస్కౌంట్ ప్రకటించిన మహీంద్రా, ఏ కారుపై ఎంతెంతో చూడండి

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ తన ప్రసిద్ధ బిఎస్-6 మోడళ్లపై గ్రాండ్ ఆఫర్ ప్రకటించింది. మహీంద్రా తన పాపులర్ మోడళ్లకు మే నెల మొత్తం దాదాపు రూ. 3.05 లక్షల వరకు భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.

భారీ డిస్కౌంట్ ప్రకటించిన మహీంద్రా, ఏ కారుపై ఎంతెంతో చూడండి

మహీంద్రా తమ వినియోగదారులను ఆకర్షించడానికి ఈ రకమైన భారీ తగ్గింపును ప్రకటించింది. మహీంద్రా ప్రకటించిన ఈ డిస్కౌంట్‌లో మారజో, టియువి 300 మరియు టియువి 300 ప్లస్ ఎస్‌యూవీలు లేవు.

ఆల్తురాస్ జి 4, కెయువి 100 ఎన్‌ఎక్స్‌టి, ఎక్స్‌యువి 300, మహీంద్రా ఎక్స్‌యువి 500, స్కార్పియో, బొలెరో మోడళ్ల బిఎస్ -6 వెర్షన్‌కు మహీంద్రా డిస్కౌంట్ ఆఫర్ ఇస్తుంది. మహీంద్రా యొక్క ఈ మోడళ్లలో ఎంత డిస్కౌంట్ ప్రకటించారన్నది మనం ఇక్కడ చూడవచ్చు.

భారీ డిస్కౌంట్ ప్రకటించిన మహీంద్రా, ఏ కారుపై ఎంతెంతో చూడండి

మహీంద్రా అల్టురాస్ జి 4 :

మహీంద్రా ఇటీవల తన బిఎస్ 6 అల్టురాస్ జి 4 ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త మహీంద్రా అల్టురాస్ జి 4 ఎస్‌యూవీ భారతదేశం యొక్క ఎక్స్ షోరూమ్ ప్రకారం, దీని ధర రూ .28.69 లక్షలు.ఇది మునుపటి మోడల్ కంటే కొంత ఎక్కువ ధరను కలిగి ఉంటుంది.

MOST READ:సినిమా స్టైల్ లో సింగం స్టంట్‌ చేసిన పోలీసుకు రూ. 5000 జరిమానా

భారీ డిస్కౌంట్ ప్రకటించిన మహీంద్రా, ఏ కారుపై ఎంతెంతో చూడండి

బిఎస్ -6 మహీంద్రా అల్టురాస్ జి 4 పై మొత్తం రూ. 3.05 లక్షల వరకు డిస్కౌంట్ ప్రకటించబడింది. ఇందులో రూ .2.40 లక్షల నుంచి రూ. 50 వేల వరకు నగదు తగ్గింపు ఉంటుంది. ఈ మహీంద్రా అల్టురాస్ 2.2-లీటర్ ఇ-ఎక్స్‌డి 220 టర్బోచార్జ్డ్ నాలుగు సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను ఈ ఎస్‌యూవీలో అమర్చారు.

భారీ డిస్కౌంట్ ప్రకటించిన మహీంద్రా, ఏ కారుపై ఎంతెంతో చూడండి

మహీంద్రా కెయువి 100 ఎన్‌ఎక్స్‌టి :

మహీంద్రా ఇటీవల తన బిఎస్ -6 కెయువి 100 ఎన్‌ఎక్స్‌టి మైక్రో ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇండియన్ ఎక్స్ షోరూమ్ ప్రకారం కొత్త మహీంద్రా కెయువి 100 ఎన్‌ఎక్స్‌టి ప్రారంభ ధర రూ. 5.54 లక్షలు.

MOST READ:కరోనా ఎఫెక్ట్ : ఆంధ్రప్రదేశ్ లో రోడ్డెక్కనున్న కొత్త APSRTC బస్సులు

భారీ డిస్కౌంట్ ప్రకటించిన మహీంద్రా, ఏ కారుపై ఎంతెంతో చూడండి

బిఎస్-6 కెయువి 100 ఎన్‌ఎక్స్‌టి మోడల్‌పై దాదాపు రూ. 70,800 వరకు డిస్కౌంట్ ప్రకటించబడింది. ఈ కొత్త కారులో ఆరు సీట్ల వ్యవస్థ ఉంటుంది. ఈ కొత్త కెయువి 100 ఎన్‌ఎక్స్‌టి మైక్రో ఎస్‌యూవీలో అందించారు. ఇటీవల కాలంలో ఈ కెయువి 100 కారు డీజిల్ ఇంజిన్‌ను కంపెనీ నిలిపివేసింది.

భారీ డిస్కౌంట్ ప్రకటించిన మహీంద్రా, ఏ కారుపై ఎంతెంతో చూడండి

మహీంద్రా ఎక్స్‌యూవీ 300 :

మహీంద్రా తన కొత్త ఎక్స్‌యూవీ 300 ఎస్‌యూవీపై భారీ తగ్గింపును ప్రకటించింది. ఈ కొత్త ఎక్స్‌యూవీ 300 ఎస్‌యూవీ ఎంపిక చేసిన వేరియంట్‌లపై దాదాపు రూ. 69,500 వరకు తగ్గింపును అందిస్తుంది.

MOST READ:సాధారణ వ్యక్తిని ప్రశంసించిన ఆనంద్ మహీంద్రా, ఎందుకో తెలుసా ?

భారీ డిస్కౌంట్ ప్రకటించిన మహీంద్రా, ఏ కారుపై ఎంతెంతో చూడండి

ఎక్స్‌యూవీ 300 లో 1.2-లీటర్ టర్బో పెట్రోల్ లేదా 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో లభిస్తుంది. అంతే కాకుండా ఇది నాలుగు వేరియంట్ల ఎంపికలతో లభిస్తుంది. ఈ కొత్త ఎక్స్‌యూవీ 300 ధర 8.30 లక్షల నుండి 12.69 లక్షల రూపాయల వరకు ఉన్నాయి.

భారీ డిస్కౌంట్ ప్రకటించిన మహీంద్రా, ఏ కారుపై ఎంతెంతో చూడండి

మహీంద్రా ఎక్స్‌యూవీ 500 :

బిఎస్ 6 కి అప్‌గ్రేడ్ చేయడం వల్ల ఎక్స్‌యూవీ 500 మహీంద్రా ధరలను పెంచడంతో పాటు కొన్ని వేరియంట్‌లను నిలిపివేసింది. ఇప్పుడు రూ. 13.20 లక్షల నుండి 17.20 లక్షల వరకు పెరిగాయి.

MOST READ:లాక్‌డౌన్ ఉల్లంఘించిన ప్రముఖ నటి, ఎవరో తెలుసా ?

భారీ డిస్కౌంట్ ప్రకటించిన మహీంద్రా, ఏ కారుపై ఎంతెంతో చూడండి

అంతే కాకుండా ఇప్పుడు ఈ కారుపై 49,000 రూపాయల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇటీవల కాలంలో ఎంట్రీ లెవల్ డబ్ల్యూ 3 వేరియంట్‌ను కూడా మహీంద్రా నిలిపివేసింది.

భారీ డిస్కౌంట్ ప్రకటించిన మహీంద్రా, ఏ కారుపై ఎంతెంతో చూడండి

బిఎస్ -6 స్కార్పియో :

కొత్త స్కార్పియో ఎస్‌యూవీని ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేశారు. కొత్త మహీంద్రా స్కార్పియో ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 12.40 లక్షలు. ఇప్పుడు మీరు ఈ కొత్త స్కార్పియో ఎస్‌యూవీపై రూ. 35,000 వరకు తగ్గింపు పొందవచ్చు.

భారీ డిస్కౌంట్ ప్రకటించిన మహీంద్రా, ఏ కారుపై ఎంతెంతో చూడండి

బిఎస్ -6 బొలెరో :

మహీంద్రా ఇటీవల బిఎస్ -6 బొలెరో ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. మహీంద్రా కొత్త బొలెరో ఎస్‌యూవీ కోసం బుకింగ్ కూడా ప్రారంభించింది. కొత్త బొలెరో ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 7.98 లక్షలు. ఇప్పుడు ఈ ఎస్‌యూవీలో రూ. 14 వేల వరకు డిస్కౌంట్ ప్రకటించబడింది.

Most Read Articles

English summary
Benefits up to Rs 3.05 lakh on BS6 Mahindra Alturas, XUV500, XUV300, Scorpio. Read in Telugu.
Story first published: Wednesday, May 13, 2020, 15:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X