'స్కార్పియో స్టింగ్' పేరును ట్రేడ్‌మార్క్ చేసిన మహీంద్రా, కొత్త మోడల్ రానుందా?

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా 2002లో తొలిసారిగా తమ పాపులర్ స్కార్పియో మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. అప్పటి నుండి ఈ మోడల్‌లో అప్పడప్పుడూ కొత్త అప్‌గ్రేడ్స్ రావటాన్ని మనం గమనించాయి. అయితే, ఈసారి ఏకంగా సరికొత్త డిజైన్, ఫీచర్స్ మరియు టెక్నాలజీతో కంపెనీ ఇందులో ఓ నెక్స్ట్ జనరేషన్ మోడల్‌ను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

'స్కార్పియో స్టింగ్' పేరును ట్రేడ్‌మార్క్ చేసిన మహీంద్రా, కొత్త మోడల్ రానుందా?

భారత రోడ్లపై ఇప్పటికే మహీంద్రా తమ కొత్త తరం స్కార్పియో ఎస్‌యూవీని విస్తృతంగా పరీక్షిస్తోంది. తాజాగా నెక్స్ట్ జనరేషన్ మహీంద్రా స్కార్పియోకి సంబంధించిన మరో కొత్త సమాచారం ఆన్‌లైన్‌లో లీక్ అయ్యింది. 'స్కార్పియో స్టింగ్' పేరును కంపెనీ ట్రేడ్‌మార్క్ కోసం ధరఖాస్తు చేసుకుంది. దీన్నిబట్టి చూస్తుంటే, బహుశా ఇది వచ్చే ఏడాది మార్కెట్లో విడుదల కాబోయే కొత్త తరం స్కార్పియో పేరుగా తెలుస్తోంది.

'స్కార్పియో స్టింగ్' పేరును ట్రేడ్‌మార్క్ చేసిన మహీంద్రా, కొత్త మోడల్ రానుందా?

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న స్కార్పియోని ల్యాడర్-ఫ్రేమ్ ఛాస్సిస్‌పై తయారు చేస్తున్నారు. కాగా, వచ్చే ఏడాది మార్కెట్లోకి రాబోయే కొత్త తరం మహీంద్రా స్కార్పియోను పూర్తిగా సరికొత్త ప్లాట్‌ఫామ్‌పై తయారు చేయనున్నారు. ఈ మోడల్‌ను కంపెనీ పూర్తిగా రీడిజైన్ చేయనుంది. ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ ఫీచర్లకు కూడా పూర్తి మేకోవర్ ఇవ్వనున్నారు.

MOST READ:మాగ్నైట్ ఎస్‌యూవీని ఆవిష్కరించిన నిస్సాన్ ; ఇది కియా సొనేట్‌కి ప్రత్యర్థిగా నిలుస్తుందా..

'స్కార్పియో స్టింగ్' పేరును ట్రేడ్‌మార్క్ చేసిన మహీంద్రా, కొత్త మోడల్ రానుందా?

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, నెక్స్ట్-జెన్ మహీంద్రా స్కార్పియోలో ఇంజన్ పరంగా కూడా మార్పులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో పాటుగా 2.0-లీటర్ డీజిల్ ఇంజన్‌ను కూడా కంపెనీ ఆఫర్ చేయవచ్చని సమాచారం. ఈ రెండు ఇంజన్లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభించే అవకాశం ఉంది.

'స్కార్పియో స్టింగ్' పేరును ట్రేడ్‌మార్క్ చేసిన మహీంద్రా, కొత్త మోడల్ రానుందా?

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మహీంద్రా స్కార్పియో ఆల్‌రౌండ్ బాడీ-కలర్ క్లాడింగ్‌తో రగ్గడ్ లుక్‌ని కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డిఆర్ఎల్‌లు, ఫాగ్ ల్యాంప్స్ మరియు ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు ఉంటాయి. ఇందులోని ఫ్రంట్ అండ్ రియర్ బంపర్ డిజైన్‌లు ఈ ఎస్‌యూవీకి స్టన్నింగ్ లుక్‌నిస్తాయి. అంతేకాకుండా, ఇందులో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఈబిడి, ఇంజన్ ఇమ్మొబిలైజర్, యాంటీ-థెఫ్ట్ అలారం ఆటో డోర్ లాక్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

MOST READ:ట్రాఫిక్ ఉల్లంఘనలపై విరుచుకుపడుతున్న పోలీసులు.. ఇప్పటికే 15000 మంది లిస్ట్ రెడీ

'స్కార్పియో స్టింగ్' పేరును ట్రేడ్‌మార్క్ చేసిన మహీంద్రా, కొత్త మోడల్ రానుందా?

కరెంటే జనరేషన్ మహీంద్రా స్కార్పియోలో 2.2-లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 3750 ఆర్‌పిఎమ్ వద్ద 138 బిహెచ్‌పి శక్తిని మరియు 1500-2800 ఆర్‌పిఎమ్ మధ్యలో 320 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో మహీంద్రా స్కార్పియో ధరలు రూ.11.97 లక్షల నుండి రూ.15.75 లక్షల (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, పూణే)లో ఉన్నాయి.

'స్కార్పియో స్టింగ్' పేరును ట్రేడ్‌మార్క్ చేసిన మహీంద్రా, కొత్త మోడల్ రానుందా?

ఇక మహీంద్రా స్కార్పియో బ్రాండ్‌కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ ఈ ఎస్‌యూవీలో ఓ కొత్త అప్‌డేట్‌ను ప్రవేశపెట్టింది. స్కార్పియో టాప్ఎండ్ వేరియంట్లు ఇప్పుడు ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే టెక్నాలజీలను సపోర్ట్ చేసే కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో అందుబాటులోకి రానున్నాయి.

MOST READ:నిస్సాన్ మాగ్నైట్ ఫస్ట్ లుక్ రివ్యూ ; డిజైన్, ఫీచర్స్ & ఇతరవివరాలు

'స్కార్పియో స్టింగ్' పేరును ట్రేడ్‌మార్క్ చేసిన మహీంద్రా, కొత్త మోడల్ రానుందా?

ఈ కొత్త ఫీచర్ మహీంద్రా స్కార్పియో ఎస్9 మరియు ఎస్11 వేరియంట్‌లలో లభిస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ కొత్త ఫీచర్‌ను జోడించినప్పటికీ, దీని ధర మాత్రం మారదు. కంపెనీ ఈ ఫీచర్‌ను వినియోగదారులకు ఉచితంగా అందిస్తోంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

'స్కార్పియో స్టింగ్' పేరును ట్రేడ్‌మార్క్ చేసిన మహీంద్రా, కొత్త మోడల్ రానుందా?

మహీంద్రా స్కార్పియో స్టింగ్ పేరును ట్రేడ్‌మార్క్ చేయటంపై అభిప్రాయం.

మహీంద్రా స్కార్పియోకి పూర్తి మేకోవర్ ఇచ్చే సమయం ఆసన్నమైందనే చెప్పాలి. మార్కెట్లో గత కొంత కాలంగా ఈ మోడల్ ఎలాంటి మేజర్ అప్‌డేట్ రాలేదు. వాస్తవానికి, ఈ ఎస్‌యూవీలో ఇప్పటికే ఓ కొత్త తరం మోడల్ మార్కెట్లోకి రావల్సి ఉంది. కానీ, దేశంలో కొనసాగుతున్న కరోనా మహమ్మారి కారణంగా దీని విడుదల ఆలస్యమైంది. కంపెనీ తమ కొత్త స్కార్పియోని రూపంతో పాటుగా పేరును కూడా మార్చాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

Most Read Articles

English summary
Mahindra Scorpio Sting name registered for trademark, will it be a special edition or next generation model? Read in Telugu. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X