ఆటో ఎక్స్‌పో 2020: ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారును ఆవిష్కరిస్తున్న మహీంద్రా

ఢిల్లీలో జరగబోయే 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పో దేశీయ ఆటోమొబైల్ ఇండస్ట్రీ రోజురోజుకీ అంచనాలు పెంచేస్తోంది. తాజాగా దేశీయ ఎస్‌యూవీ తయారీ దిగ్గజం మహీంద్రా ఫ్యూచర్ కోసం సిద్దం చేసిన ఎలక్ట్రిక్ కార్లను ఇదే వేదికగా ఆవిష్కరించేందుకు సర్వం సిద్దం చేసుకుంది. వీటిలో ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో తీవ్ర అలజడి సృష్టించే సంచలన మోడల్ ఫన్‌స్టర్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కూడా ఉంది.

మహీంద్రా ఫన్‌స్టర్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ మరియు అప్‌కమింగ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ల గురించి పూర్తి వివరాలు...

ఆటో ఎక్స్‌పో 2020: ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారును ఆవిష్కరిస్తున్న మహీంద్రా

క్వాడ్రిసైకిల్, కెయువి100 ఎలక్ట్రిక్, ఎక్స్‌యూవీ300 ఎలక్ట్రిక్ మరియు నెక్ట్స్ జనరేషన్ ఎక్స్‌యూవీ500ను పోలి ఉండే కాన్సెప్ట్ ఎస్‌యూవీ "ఫన్‌స్టర్ ఎలక్ట్రిక్" కార్లను త్వరలో ఆవిష్కరిస్తున్నట్లు మహీంద్రా ఇటీవల విడుదల చేసిన టీజర్ ఇమేజ్‌లో చెప్పింది.

ఆటో ఎక్స్‌పో 2020: ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారును ఆవిష్కరిస్తున్న మహీంద్రా

ఫ్యూచర్ కోసం కంపెనీ ప్లాన్ చేసిన వాటిలో మహీంద్రా ఫన్‌స్టర్ ఎలక్ట్రిక్ ఒకటి, ఇది భారతదేశపు హై-పర్ఫామెన్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా నిలవనుంది. 60kWh సామర్థ్యం ఉన్న బ్యాటరీ ప్యాక్‌తో ఒక్కో చక్రానికి ఒక ఎలక్ట్రిక్ మోటార్ చొప్పున నాలుగు ఎలక్ట్రిక్ మోటార్స్ ఉంటాయి.

ఆటో ఎక్స్‌పో 2020: ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారును ఆవిష్కరిస్తున్న మహీంద్రా

పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పేరుగు తగ్గట్లుగానే 313బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. అంటే టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ కంటే శక్తివంతమైనది. నిజానికి చెప్పాలంటే పవర్ పరంగా మెర్సిడెస్ మరియు బిఎమ్‌డబ్ల్యూ కార్లకే పోటీనిస్తుంది. మహీంద్రా ఫన్‌స్టర్ కేవలం 5 సెకండ్లలోనే 0-100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

ఆటో ఎక్స్‌పో 2020: ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారును ఆవిష్కరిస్తున్న మహీంద్రా

ప్రపంచ మార్కెట్‌ను సైతం షేక్ చేయగల సత్తా ఉన్న మహీంద్రా ఫన్‌స్టర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇండియన్ కస్టమర్లను ఏ మాత్రం ఆకట్టుకుంటుందో ఇప్పుడే చెప్పలేం. అయితే తక్కువ బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కోరుకునే కస్టమర్ల కోసం కెయువి100 ఎస్‌యూవీని ఎలక్ట్రిక్ వెర్షన్‌లో విడుదల చేసేందుకు మహీంద్రా కసరత్తులు చేస్తోంది.

ఆటో ఎక్స్‌పో 2020: ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారును ఆవిష్కరిస్తున్న మహీంద్రా

మహీంద్రా ఎలక్ట్రిక్ కెయువి100 మోడల్‌ను 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించి, ఏప్రిల్-జూన్ 2020 మధ్య కాలంలో పూర్తి స్థాయిలో మార్కెట్లోకి లాంచ్ చేసే అవకాశం ఉంది. భారతదేశపు చీపెస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా రూ. 9 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

ఆటో ఎక్స్‌పో 2020: ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారును ఆవిష్కరిస్తున్న మహీంద్రా

పైన పేర్కొన్న రెండు మోడళ్లకు కొనసాగింపుగా, మహీంద్రా తమ ఎక్స్‌యూవీ300 కాంపాక్ట్ ఎస్‌యూవీని కూడా ఎలక్ట్రిక్ వెర్షన్‌లో సిద్దం చేస్తున్నట్లు సమాచారం. 40kWh బ్యాటరీ సామర్థ్యంతో సింగల్ ఛార్జింగ్‌తో 300కిలోమీటర్ల మైలేజ్‌ ఇచ్చేలా రూపొందిస్తున్నారు.

ఆటో ఎక్స్‌పో 2020: ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారును ఆవిష్కరిస్తున్న మహీంద్రా

మహీంద్రా అండ్ మహీంద్రా 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదికగా 18 కార్లను ఆవిష్కరించడానికి సిద్దమవుతోంది. అయితే, గతంలో పేర్కొన్నట్లుగానే ఈ ఆటో ఎక్స్‌పోలో నెక్ట్స్ జనరేషన్ థార్ ఎస్‌యూవీని తీసుకురావడంలేదు.

Source: Autocar India

Most Read Articles

English summary
According to a media report, Mahindra will showcase a powerful electric car concept called the Funster EV at the 2020 Auto Expo. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X