ట్రాక్టర్ ధరలను పెంచనున్న మహీంద్రా.. ఎప్పటినుంచో తెలుసా !

భారతమార్కెట్లో ప్రముఖ వాహన తయారీ సంస్థగా ప్రసిద్ధి చెందిన మహీంద్రా & మహీంద్రా గత వారంలోనే తమ ప్యాసింజర్ కార్లు మరియు కమర్షియల్ వాహనాల ధరలను పెంచడానికి సన్నాహాలను సిద్ధం చేస్తోన్నట్లు ప్రకటించింది. ఇదే సమయంలో ఇప్పుడు 2021 జనవరి 1 నుండి తన ట్రాక్టర్ల ధరలను కూడా పెంచుతుందని కంపెనీ ధృవీకరించింది.

ట్రాక్టర్ ధరలను పెంచనున్న మహీంద్రా.. ఎప్పటినుంచో తెలుసా !

వస్తువుల ధరల పెరుగుదల కారణంగా వాహనాల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది. ట్రాక్టర్ వ్యాపారంలో కంపెనీ బలమైన వృద్ధిని సాధించింది. కంపెనీ నివేదికల ప్రకారం నవంబర్‌లో 31,619 యూనిట్లను విక్రయించినట్లు తెలిసింది.

ట్రాక్టర్ ధరలను పెంచనున్న మహీంద్రా.. ఎప్పటినుంచో తెలుసా !

2020 నవంబర్ నెలలో మహీంద్రా & మహీంద్రా దేశీయ మార్కెట్లో 20,414 యూనిట్లను విక్రయించింది. కంపెనీ డేటా ప్రకారం, ఈ నవంబర్ 2020 గత ఏడాది నవంబర్‌తో పోలిస్తే 55 శాతం పెరిగింది. ఇది కంపెనీ యొక్క అమ్మకాలలో మంచి పెరుగుదల.

MOST READ:స్పాట్ టెస్ట్‌లో కెమెరాకి చిక్కిన కొత్త మహీంద్రా స్కార్పియో

ట్రాక్టర్ ధరలను పెంచనున్న మహీంద్రా.. ఎప్పటినుంచో తెలుసా !

ఈ ఏడాది పొడవునా కంపెనీ వృద్ధి దాదాపుగా పెరిగింది. జహీరాబాద్‌లో కంపెనీలో మహీంద్రా నెక్స్ట్ జనరేషన్ మహీంద్రా యువో, జివో ట్రాక్టర్లను ఉత్పత్తి చేస్తోంది. ఉత్పత్తి కానున్న ఈ రెండూ కంపెనీ ట్రాక్టర్ వ్యాపారం కోసం పెద్ద ప్రణాళికలు జరుగుతున్నాయి. ఇవి ఒక సారి మార్కెట్లో అడుగుపెట్టిన తరువాత అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని కంపెనీ ఆశిస్తోంది.

ట్రాక్టర్ ధరలను పెంచనున్న మహీంద్రా.. ఎప్పటినుంచో తెలుసా !

వాస్తవానికి మహీంద్రా తన కొత్త కె 2 సిరీస్ ట్రాక్టర్లను తెలంగాణ రాష్ట్రంలోని జహిరాబాద్ లోని తన తయారీ కేంద్రంలో నిర్మించాలని యోచిస్తోంది. కొత్త కె 2 సిరీస్ ట్రాక్టర్ల కోసం కంపెనీ జహీరాబాద్ సదుపాయంలో అదనంగా రూ. 100 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.

MOST READ:మళ్ళీ బయటపడిన లంచం తీసుకుంటూ దొరికిన పోలీస్ వీడియో.. మీరు చూసారా ?

ట్రాక్టర్ ధరలను పెంచనున్న మహీంద్రా.. ఎప్పటినుంచో తెలుసా !

వ్యవసాయ రంగంలో రైతులకు ఎంతగానో ఉపయోగపడే ట్రాక్టర్లకు ఇటీవల కాలంలో మంచి ఆధారం ఉంది. కావున ఈ నేపథ్యంలో మంచి అమ్మకాలు కూడా జరుగుతున్నాయి. ఈ కాలంలో వ్యవసాయంలో ట్రాక్టర్లు ఒక భాగంగా నిలిచిపోయాయి.

ట్రాక్టర్ ధరలను పెంచనున్న మహీంద్రా.. ఎప్పటినుంచో తెలుసా !

ఇది కాకుండా, 2024 నాటికి తన ట్రాక్టర్ ప్లాంట్‌లో ఉపాధిని రెట్టింపు చేయాలని కంపెనీ యోచిస్తోంది. మహీంద్రా ట్రాక్టర్ల ధరల గురించి మాట్లాడుతూ, వాటి ధర ఎంత పెరుగుతుందనే సమాచారం వెల్లడించలేదు. కానీ ధరల పెరుగుదల మాత్రం ఖచ్చితంగా ఉంటుందని మాత్రం తెలుస్తోంది.

MOST READ:మళ్ళీ ప్రారంభం కానున్న సీప్లేన్ సర్వీస్.. ఎప్పటినుండో తెలుసా ?

ట్రాక్టర్ ధరలను పెంచనున్న మహీంద్రా.. ఎప్పటినుంచో తెలుసా !

మహీంద్రా కంపెనీ రాబోతున్న 2021 సంవత్సరంలో కొన్ని కొత్త కొత్త ఉత్పత్తులను విడుదల చేయడానికి కూడా సంసిద్దమవుతోంది. దీనికి సంబంధించిన సమాచారం ప్రకారం, కంపెనీ తన జనరేషన్ మహీంద్రా ఎక్స్‌యువి 500 ఎస్‌యూవీని రాబోయే సంవత్సరంలో లాంచ్ చేయవచ్చు.

ట్రాక్టర్ ధరలను పెంచనున్న మహీంద్రా.. ఎప్పటినుంచో తెలుసా !

దీని తరువాత మహీంద్రా మరో ఎస్‌యూవీ మహీంద్రా స్కార్పియోను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలోనే మహీంద్రా & మహీంద్రా తన ఎక్స్‌యువి 500 మరియు స్కార్పియోలను భారతదేశంలో టెస్ట్ చేస్తోంది. ఇవి కూడా త్వరలో మార్కెట్లో అడుగుపెట్టనున్నాయి.

MOST READ:ఇకపై ఈ వెహికల్ నెంబర్స్ నిషేధం.. ఎందుకో తెలుసా ?

ట్రాక్టర్ ధరలను పెంచనున్న మహీంద్రా.. ఎప్పటినుంచో తెలుసా !

ఇవే కాకుండా, ఈ ఏడాది లాంచ్ చేసిన మహీంద్రా ఆఫ్ రోడర్ ఎస్‌యూవీ కొత్త తరం మహీంద్రా థార్‌కు భారతీయ వినియోగదారుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. కొత్త మహీంద్రా థార్ కోసం యాక్ససరీస్ ప్యాకేజీని కూడా ఇటీవల కంపెనీ వెల్లడించింది. ఏది ఏమైనా కరోనా మహమ్మారి తరువాత మహీంద్రా మంచి జోరుమీద ఉన్నట్లు తెలుస్తోంది.

Most Read Articles

English summary
Mahindra Increased Tractors Rate From January 2021. Read in Telugu.
Story first published: Monday, December 21, 2020, 17:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X