Just In
Don't Miss
- Finance
క్యాండిడ్ న్యూస్ ... రుచిని ఆస్వాదిస్తూ క్యాండీలు తినే ఉద్యోగాలు .. దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్ర
- Movies
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- News
యూపీలో దారుణం : 24 గంటల్లో సోదరి పెళ్లి.. ఆ విషయం తెలిసి కాల్చి చంపిన సోదరుడు..
- Sports
శుభ్‌మన్ గిల్ తల దించుకొని ఆడితే బాగుంటుంది: గంభీర్
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మతిపోగుడుతున్న మాడిఫైడ్ మహీంద్రా ఇన్వాడర్
దేశీయ మార్కెట్లో మహీంద్రా & మహీంద్రా గతంలో అనేక ప్రముఖ ఎస్‌యూవీలను విడుదల చేసింది. ఇందులో ఒకటి మహీంద్రా ఇన్వాడర్.మహీంద్రా ఇన్వాడర్ మూడు-డోర్ల ఎస్యూవీ. ఇది తక్కువ డిమాండ్ కారణంగా నిలిపివేయబడింది. అయితే ఒక అభిమాని ఇప్పటికే దానిని కొనుగోలు చేసి అద్భుతంగా మాడిఫై చేసాడు.

ఇటీవల మహీంద్రా ఇన్వాడర్ యొక్క మాడిఫైడ్ వీడియో బయటకు వచ్చింది. దీనిని ఆఫ్ రోడ్ దృష్టిలో ఉంచుకుని మాడిఫైడ్ చేయబడింది. ఈ ఎస్యూవీ బయటి భాగం మస్టర్డ్ ఎల్లో కలర్ లో చాలా ఆకర్షణీయంగా ఉంది.

దీని ముందు భాగంలో కస్టమ్ ఆఫ్-రోడ్ బంపర్ ఉంది. వీటితో పాటు, మధ్యలో రెండు అడిషినల్ లాంప్స్ మరియు ఎల్ఈడీ ఫాగ్ లాంప్స్ ఏర్పాటు చేశారు. దాని పాత బంపర్ తొలగించబడింది. సైడ్ పార్ట్ నుండి చూస్తే ఈ ఎస్‌యూవీని 8-9 అంగుళాలకు పెంచారు.
MOST READ:ట్రాక్టర్ వెనుకవైపు పెద్ద టైర్లు ఉండటానికి కారణం ఏంటో తెలుసా ?

వీటితో పాటు మహీంద్రా ఇన్వాడర్లో 35 అంగుళాల టైర్లను ఏర్పాటు చేశారు. దీనికి ఐరన్‌మ్యాన్ సస్పెన్షన్లు ఉన్నాయి. దీని పైకప్పులో ఎల్ఈడీ బార్ ఉంది. దీని చక్రాల ఆర్చెస్ కూడా మాడిఫైడ్ చేయబడ్డాయి. ఈ ఎస్‌యూవీలో డోర్ తెరిచినప్పుడు మాత్రమే పవర్ సైడ్ స్టెప్ అందించబడుతుంది. ఈ ఎస్యూవీ లోపలి భాగంలో కూడా చాలా మార్పులు చేశారు.

ఈ కారులోని ఇంటీరియర్ గమనించినట్లయితే మహీంద్రా ఇన్వాడర్కు ఆల్-బ్లాక్ కలర్ ఇవ్వబడింది, దాని డాష్‌బోర్డ్ మామూలుగా ఉంచబడింది. ఇది సులభమైన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వెనుక భాగంలో స్పీకర్ మరియు వూఫర్ మరియు వెనుక ప్రయాణీకులకు ఫ్రంట్ ఫేసింగ్ సీట్లు ఉన్నాయి.
MOST READ:ఇది బుల్లెట్ బైక్ నుంచి తయారైన పాప్‌కార్న్ [వీడియో]
మహీంద్రా ఇన్వాడర్ యొక్క ఇంజిన్ స్థానంలో స్కార్పియో డిఐ టర్బో డీజిల్ ఇంజన్ అమర్చబడింది. అంతే కాకుండా ఎయిర్ ఫిల్టర్ కూడా మార్చబడింది. మొత్తంమీద మహీంద్రా ఇన్వాడర్ సరళంగా ఉన్నప్పటికీ ఇది చాలా అద్భుతమైనదిగా కనిపిస్తుంది.

మహీంద్రా ఇన్వాడర్ మాడిఫైడ్ చేయడానికి ఎంత ఖర్చు అయిందో అనే దాని గురించి ఖచ్చితమైన సమాచారం వెల్లడించలేదు. మహీంద్రా కంపెనీ యొక్క మరో ఎస్యూవీ థార్ కూడా దేశవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందింది. త్వరలో తన ప్రముఖ ఎస్యూవీ థార్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేయనుంది.
Image Courtesy: Weekend On Wheels #Wow
MOST READ:45 నిముషాల్లో ఢిల్లీ నుంచి మీరట్ చేర్చే ఎక్స్‌ప్రెస్‌వే.. చూసారా !