డ్యూయెల్ టోన్‌లో మహీంద్రా కెయువి100 ఎన్ఎక్స్‌టి విడుదల: ధర, ఫీచర్లు

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా, భారత మార్కెట్లో విక్రయిస్తున్న తం ఎంట్రీ లెవల్ మోడల్ "కెయువి100 ఎన్‌ఎక్స్‌టి"లో కంపెనీ సైలెంట్‌గా ఓ డ్యూయెల్ టోన్ మోడల్‌ను విడుదల చేసింది. మార్కెట్లో మహీంద్రా కెయువి100 ఎన్‌ఎక్స్‌టి డ్యూయల్ టోన్ మోడల్ ప్రారంభ ధర రూ.7.35 లక్షలు, ఎక్స్‌షోరూమ్, ఢిల్లీగా ఉంది.

డ్యూయెల్ టోన్‌లో మహీంద్రా కెయువి100 ఎన్ఎక్స్‌టి విడుదల: ధర, ఫీచర్లు

మహీంద్రా ఇప్పటికే తమ అధికారిక వెబ్‌సైట్‌లో కెయువి100 ఎన్ఎక్స్‌టి పెయింట్ స్కీమ్‌లను అప్‌డేట్ చేసింది. మహీంద్రా కెయువి100 ఎన్‌ఎక్స్‌టి ఎస్‌యూవీ ఇప్పుడు మోనో-టోన్ కలర్ ఆప్షన్స్‌తో పాటు సిల్వర్ / బ్లాక్ మరియు రెడ్ / బ్లాక్ అనే డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్‌లలో కూడా లభిస్తుంది. అయితే, డ్యూయెల్-టోన్ ఆప్షన్లు టాప్-ఎండ్ కె8 వేరియంట్‌లో మాత్రమే ప్రత్యేకంగా లభిస్తాయి.

డ్యూయెల్ టోన్‌లో మహీంద్రా కెయువి100 ఎన్ఎక్స్‌టి విడుదల: ధర, ఫీచర్లు

కెయువి100 ఎన్ఎక్స్‌టిలోని డ్యూయెల్-టోన్ కలర్ ఆప్షన్స్ కోసం కస్టమర్లు అదనంగా రూ.7,500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మోడల్‌లో లభించే మోనో-టోన్ కలర్ ఆప్షన్లలో పెరల్ వైట్, డాజ్లింగ్ సిల్వర్, ఫ్లేమ్‌బాయ్‌యాంట్ రెడ్, ఫైరీ ఆరెంజ్, డిజైనర్ గ్రే మరియు మిడ్‌నైట్ బ్లాక్‌లు ఉన్నాయి.

MOST READ:20 సంవత్సరాల తర్వాత కూడా కొత్తగా ఉన్న పాత కారు.. ఇది ఒక పొలిటికల్ లీడర్ ఇష్టమైన కార్ కూడా

డ్యూయెల్ టోన్‌లో మహీంద్రా కెయువి100 ఎన్ఎక్స్‌టి విడుదల: ధర, ఫీచర్లు

ఈ మోనో-టోన్ పెయింట్ స్కీమ్స్ అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా లభిస్తాయి. ఇందులో కె2+, కె4+, కె6+ మరియు కె8 మోడళ్లు ఉన్నాయి. ఈ నాలుగు వేరియంట్‌లలో సింగిల్ 1.2-లీటర్ ఎమ్‌ఫాల్కాన్ జి80 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 5500 ఆర్‌పిఎమ్ వద్ద 82 బిహెచ్‌పి పవర్‌ను మరియు 3500 ఆర్‌పిఎమ్ వద్ద 115 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ ఫైవ్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

డ్యూయెల్ టోన్‌లో మహీంద్రా కెయువి100 ఎన్ఎక్స్‌టి విడుదల: ధర, ఫీచర్లు

మహీంద్రా కెయువి100 ఎన్ఎక్స్‌టిలో కొత్త డ్యూయెల్-టోన్ పెయింట్ స్కీమ్ మినహా వేరే ఇతర మార్పులు ఏవీ లేవు. మార్కెట్లో బిఎస్6 కంప్లైంట్ బేస్ వేరియంట్ (కె2+) ధర రూ.5.54 లక్షలు, ఎక్స్-షోరూమ్, ఢిల్లీగా ఉంది.

MOST READ:హోండా హైనెస్ సిబి 350 బైక్ డెలివరీస్ స్టార్ట్

డ్యూయెల్ టోన్‌లో మహీంద్రా కెయువి100 ఎన్ఎక్స్‌టి విడుదల: ధర, ఫీచర్లు

మహీంద్రా కెయువి100 ఎన్‌ఎక్స్‌టి డ్యూయెల్ టోన్ మోడల్‌లో ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల సైడ్ మిర్రర్స్, 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్, పడల్ ల్యాంప్స్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఇంటీరియర్ మూడ్ లైటింగ్ , ఫాగ్ లాంప్స్, కూల్డ్ గ్లౌవ్‌బాక్స్ మొదలైన ఫీచర్లను పొందవచ్చు.

డ్యూయెల్ టోన్‌లో మహీంద్రా కెయువి100 ఎన్ఎక్స్‌టి విడుదల: ధర, ఫీచర్లు

మహీంద్రా కెయువి100 ఎన్‌ఎక్స్‌టి బ్రాండ్ యొక్క ఎంట్రీ లెవల్ సబ్-4 మీటర్ కాంపాక్ట్-ఎస్‌యూవీ. ఇది ఈ విభాగంలో మంచి ప్రజాదరణ పొందిన ఎక్స్‌యువి300 మోడల్‌తో పాటు విక్రయించబడుతుంది. అయితే, ధర పరంగా చూస్తే కెయువి100 ఎన్‌ఎక్స్‌టి మారుతి సుజుకి స్విఫ్ట్ మరియు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

MOST READ:గోల్డ్ కలర్ రోల్స్ రాయిస్ కారులో ప్రయాణించాలనుకుంటున్నారా.. అయితే ఇది చూడండి

డ్యూయెల్ టోన్‌లో మహీంద్రా కెయువి100 ఎన్ఎక్స్‌టి విడుదల: ధర, ఫీచర్లు

మహీంద్రా కెయువి100 ఎన్‌ఎక్స్‌టి డ్యూయెల్ టోన్ వేరియంట్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మహీంద్రా కెయువి100 ఎన్‌ఎక్స్‌టి ఇప్పటి వరకూ సింగిల్ టోన్ కలర్‌లో మాత్రమే లభ్యమయ్యేది. ఇప్పుడు ఇది డ్యూయెల్ టోన్ కలర్‌తో మరింత స్పోర్టీ లుక్‌ని కలిగి ఉంది. ఇందులో ఈ కొత్త కలర్ ఆప్షన్లను విడుదల చేయటం ద్వారా, ప్రస్తుత పండుగ సీజన్‌లో ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.

Most Read Articles

English summary
Mahindra has silently updated its KUV100 NXT model in India, by introducing two new dual-tone paint schemes. The updated Mahindra KUV100 NXT dual-tone models are offered with a starting price of Rs 7.35 lakh, ex-showroom (Delhi). Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X