ఒక్క రోజులో 34 మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ అవుట్‌లెట్‌లు ప్రారంభం - వివరాలు

మహీంద్రా గ్రూపుకి చెందిన సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపార విభాగం మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ వీల్స్ లిమిటెడ్ ఒకే రోజులో దేశవ్యాప్తంగా 34 కొత్త అవుట్‌లెట్లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ డీలర్‌షిప్‌ల ప్రారంభాన్ని డిజిటల్ మీడియా ఛానల్స్ స్ట్రీమ్ చేసినట్లు కంపెనీ తెలిపింది.

ఒక్క రోజులో 34 మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ అవుట్‌లెట్‌లు ప్రారంభం - వివరాలు

రూర్కీ, నాసిక్, పాండిచ్ఛేరి, తిరుచ్చి, డెహ్రాడూన్, మావ్, ఆగ్రా, అజంఘడ్, జువాన్‌పూర్, ఔరంగాబాద్, ఘజియాబాద్ మరియు అహ్మదాబాద్ నగరాల్లో మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ వీల్స్ దుకాణాలను ప్రారంభించింది. ప్రీ-ఓన్డ్ కార్ల వ్యాపారం కోసం మహీంద్రా ఇప్పుడు టైర్ 2 మరియు టైర్ 3 నగరాలపై దృష్టి సారించింది.

ఒక్క రోజులో 34 మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ అవుట్‌లెట్‌లు ప్రారంభం - వివరాలు

యూజ్డ్ కార్ల వ్యాపారం ఇప్పటికీ క్రమబద్దీకరణలో లేకపోయినప్పటికీ, ఈ పరిశ్రమ మంచి వృద్ధి సంకేతాలను చూపిస్తోందని, ఈ నేపథ్యంలో త్వరలోనే అదనంగా ఎనిమిది కొత్త డీలర్‌షిప్ కేంద్రాలను ప్రారంభించనున్నామని మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ వీల్స్ ప్రకటించింది.

MOST READ: దయనీయ స్థితిలో ఉన్న రాష్ట్రపతి అంబులెన్స్

ఒక్క రోజులో 34 మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ అవుట్‌లెట్‌లు ప్రారంభం - వివరాలు

ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న కరోనా మహమ్మారి, కొత్త సామాజిక దూర నిబంధనల కారణంగా వాడిన కార్లకు డిమాండ్ పెరుగుతుందని, ప్రజలు కూడా ఇప్పుడు వ్యక్తిగత వాహనం అవసరమని భావిస్తున్నారని కంపెనీ పేర్కొంది. వాడిన కార్ల విభాగం పరిశ్రమలో తదుపరి పెద్ద విషయం అని మహీంద్రా పరిశోధనలో కూడా వెల్లడైంది.

ఒక్క రోజులో 34 మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ అవుట్‌లెట్‌లు ప్రారంభం - వివరాలు

కొత్త మరియు వాడిన కార్ల డీలర్‌షిప్‌లను కలిగి ఉన్న మరియు నిర్వహిస్తున్న లాలీ మోటార్స్ డైరెక్టర్ మిస్టర్ జస్విందర్ సింగ్ మాట్లాడుతూ, "మేము 30 సంవత్సరాలుగా మహీంద్రా బ్రాండ్‌తో సత్సంబంధాలను కలిగి ఉన్నాము, ఇప్పుడు వాడిన కార్ల వ్యాపారం ఖచ్చితంగా పుంజుకుందని మాత్రం చెప్పగలమని" అన్నారు.

MOST READ: ల్యాండ్ రోవర్ డిఫెండర్ హార్డ్‌టాప్ కమర్షియల్ మోడల్ ఖరారు - వివరాలు

ఒక్క రోజులో 34 మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ అవుట్‌లెట్‌లు ప్రారంభం - వివరాలు

"సెకండ్ హ్యాండ్ కార్ల కోసం కస్టమర్లు ఇప్పుడు స్థానిక డీలర్ల వద్దకు కాకుండా అధీకృత సర్టిఫైడ్ దుకాణాలకు వెళ్లేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు, అలాంటి వారికి మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ నిజంగానే ఫస్ట్ ఛాయిస్‌గా ఉంటుంది. ఈ కంపెనీలో వాడిన కార్లకు వారంటీ కూడా అందించబడుతుంది, అదొక పెద్ద ప్లస్ పాయింట్. కస్టమర్లు మా వద్దకు తిరిగి రావడానికి ఇదీ ఒక కారణం కూడా" అని తెలిపారు.

ఒక్క రోజులో 34 మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ అవుట్‌లెట్‌లు ప్రారంభం - వివరాలు

మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ వీల్స్‌లో వాహనం కొనుగోలు చేసిన వారికి అదనంగా శానిటైజేషన్ కిట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కిట్‌లో భాగంగా రెండు ఫేస్ మాస్క్‌లు, ఒక జత గ్లౌవ్స్, వెహికల్ క్రిమిసంహారక స్ప్రే, హ్యాండ్ శానిటైజర్ మరియు వాహనాన్ని శుభ్రపరచడానికి దశల వారీ గైడ్స్ ఉంటాయి.

MOST READ: భారత్ & చైనా వివాదం : ఆలస్యమైన హైమా బర్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ లాంచ్

ఒక్క రోజులో 34 మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ అవుట్‌లెట్‌లు ప్రారంభం - వివరాలు

మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ దుకాణాలు కస్టమర్లకు ధరలను కోట్ చేయడానికి ముందు వాడిన కార్లకు 118 పాయింట్ వెహికల్ చెక్ చేస్తారు. ఇందులో వాహనం పాస్ అయితే మహీంద్రా వాటిని కస్టమర్ల నుండి కొనుగోలు చేస్తుంది, ఆ తర్వాత వాటిని మరోసారి పూర్తిగా తనిఖీ చేసి, అవసరమైన మరమ్మత్తులు చేసి అమ్మకానికి ఉంచుంతుంది.

ఒక్క రోజులో 34 మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ అవుట్‌లెట్‌లు ప్రారంభం - వివరాలు

ఈ బ్రాండ్ మహీంద్రా సర్టిఫైడ్ వాడిన కార్లపై వారంటీని కూడా ఆఫర్ చేస్తుంది. ఇంకా ఈజీ ఫైనాన్స్ మరియు ఇబ్బంది లేని ఆర్టీఓ బదిలీలను కూడా ఆఫర్ చేస్తుంది.

MOST READ: విధి నిర్వహణలో ఉన్న పోలీసును తన్నిన మాజీ MP, ఎవరో తెలుసా ?

ఒక్క రోజులో 34 మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ అవుట్‌లెట్‌లు ప్రారంభం - వివరాలు

మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ వీల్స్ కొత్త షోరూమ్‌ల ప్రారంభంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఇప్పటి వరకూ అస్థవ్యస్థంగా ఉన్న సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్ ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి వస్తున్నట్లు అనిపిస్తోంది. నిజానికి ఆటోమొబైల్ పరిశ్రమలో తదుపరి పెద్ద విషయం యూజ్డ్ కార్ మార్కెట్ అని పరిశ్రమకు తెలుసు, మరింత ఎక్కువ మంది తయారీదారులు వాడిన కార్ల పరిశ్రమలో చేరాలని మేము కూడా ఆశిస్తున్నాము. ఒక రోజులో 34 దుకాణాలను తెరవడానికి అధ్భుతమైన ప్రణాళిక మరియు ఆర్థిక నిబద్ధత అవసరం. దీనిని సాధించినందుకు మహీంద్రాకు అభినందనలు.

Most Read Articles

English summary
Mahindra First Choice Wheels Limited had announced a launch of 34 new outlets across the country in a single day. The launch was streamed via digital media channels. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X