మహీంద్రా సర్పంచ్ ప్లస్ ట్రాక్టర్ విడుదల - ధరలు, ఫీచర్లు, వివరాలు

మహీంద్రా గ్రూపుకి చెందిన వ్యవసాయ పరికరాల తయారీ విభాగం మహీంద్రా ఫార్మ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్ భారత మార్కెట్లో కొత్త ట్రాక్టర్ శ్రేణిని విడుదల చేసింది. 'మహీంద్రా సర్పంచ్ ప్లస్' పేరుతొ ఈ కొత్త శ్రేణిని ప్రవేశపెట్టారు. ఈ కొత్త ట్రాక్టర్లు ప్రస్తుతానికి మహారాష్ట్రలో మాత్రమే విక్రయించనున్నారు. మార్కెట్లో మహీంద్రా సర్పంచ్ ప్లస్ ట్రాక్టర్ ప్రారంభ ధర రూ.6.6 లక్షలు ఎక్స్-షోరూమ్ (పూణే)గా ఉన్నాయి.

మహీంద్రా సర్పంచ్ ప్లస్ ట్రాక్టర్ విడుదల - ధరలు, ఫీచర్లు, వివరాలు

మహారాష్ట్రలోని అన్ని అధీకృత మహీంద్రా డీలర్‌షిప్‌లలో ఈ కొత్త సర్పంచ్ ప్లస్ ట్రాక్టర్లు లభ్యం కానున్నాయి. కోవిడ్-19 నేపథ్యంలో, మహీంద్రా తమ వాణిజ్య వాహనాల కోసం ప్రవేశపెట్టిన డిజిటల్ రిటైల్ ప్లాట్‌ఫామ్ ద్వారా కూడా కస్టమర్లు ఈ ట్రాక్టర్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సౌకర్యాన్ని కంపెనీ కల్పించింది.

మహీంద్రా సర్పంచ్ ప్లస్ ట్రాక్టర్ విడుదల - ధరలు, ఫీచర్లు, వివరాలు

ఇందు కోసం కస్టమర్లు రూ .5,000 మొత్తాన్ని చెల్లించి ఆన్‌లైన్ బుక్ చేసుకోవచ్చు. ఈ ట్రాక్టర్లను ఒక్క రోజులోనే కస్టమర్లకు డెలివరీ చేస్తామని కంపెనీ పేర్కొంది. ట్రాక్టర్ కొనుగోలు విషయంలో కస్టమర్లు నిర్ణయం తీసుకోవడానికి సహకరించేలా సంస్థ ఆకర్షణీయమైన ఫైనాన్స్ పథకాలను కూడా అందిస్తోంది.

MOST READ: నదిలో పడిపోయిన కొత్తగా పెళ్లి చేసుకున్న జంట ఉన్న హోండా సిటీ, తర్వాత ఏం జరిగిందంటే ?

మహీంద్రా సర్పంచ్ ప్లస్ ట్రాక్టర్ విడుదల - ధరలు, ఫీచర్లు, వివరాలు

ఆకర్షణీయమైన ఫైనాన్స్ ఆఫర్లను అందించడంతో పాటుగా, కస్టమర్లకు ఈ కొత్త ట్రాక్టర్ శ్రేణి యాజమాన్యాన్ని మరింత సులభతరం చేసేందుకు, అలాగే నిర్వహణ ఖర్చులను తగ్గించేందుకు గాను కంపెనీ వీటిని బెస్ట్-ఇన్-క్లాస్ వారంటీతో అందిస్తోంది. కొత్త సర్పంచ్ ప్లస్ 575 కొనుగోలుపై కస్టమర్లు 6 సంవత్సరాల వారంటీని పొందవచ్చు. ఇందులో భాగంగా మొత్తం ట్రాక్టర్‌కి 2 సంవత్సరాల స్టాండర్డ్ వారంటీ లభిస్తుంది మరియు మిగిలిన 4 సంవత్సరాలు ట్రాక్టర్ ఇంజన్, ట్రాన్స్‌మిషన్ వేర్ అండ్ టేర్‌పై వారంటీ లభిస్తుంది.

మహీంద్రా సర్పంచ్ ప్లస్ ట్రాక్టర్ విడుదల - ధరలు, ఫీచర్లు, వివరాలు

సర్పంచ్ ప్లస్ ట్రాక్టర్ సిరీస్‌లో ఉపయోగించిన ఇంజన్ శక్తి లోడ్ కెపాసిటీని బట్టి గరిష్టంగా 30-50 బిహెచ్‌పిల మధ్యలో ఉంటుంది. మహీంద్రా గ్రూప్ ఇది వరకు విడుదల చేసిన సర్పంచ్ 575 ట్రాక్టర్‌తో పోలిస్తే ఇది కొంచెం మెరుగ్గా ఉంటుంది. సర్పంచ్ ప్లస్ ట్రాక్టర్‌లో సరికొత్త ఎక్స్‌ట్రా లాంగ్ స్ట్రోక్ (ELS) డిఐ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు.

MOST READ: ఖాళీ రోడ్డుపై బైక్ స్టంట్స్ : ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు యువకులు [వీడియో]

మహీంద్రా సర్పంచ్ ప్లస్ ట్రాక్టర్ విడుదల - ధరలు, ఫీచర్లు, వివరాలు

కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ కొత్త ఇంజన్ మెరుగైన ఇంధన సామర్థ్యంతో పాటు మరింత శక్తివంతమైనది. కంపెనీ ఆఫర్ చేసిన ఇదివరకటి ఇంజన్లతో పోల్చుకుంటే ఇది 2 బిహెచ్‌పిల అధనపు శక్తిని అలాగే బ్యాకప్ టార్క్‌ని అందిస్తుంది. సర్పంచ్ ప్లస్ 575 గెట్స్ డిజైన్ కూడా మెరుగుపరచడం జరిగింది. సర్పంచ్ 575 ట్రాక్టర్‌లో చూసినదానితో పోలిస్తే సర్పంచ్ ప్లస్ ట్రాక్టర్ మంచి ఆన్‌బోర్డ్ ఎర్గోనమిక్స్‌ని కలిగి ఉండి డ్రైవర్‌కు మెరుగైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

మహీంద్రా సర్పంచ్ ప్లస్ ట్రాక్టర్ విడుదల - ధరలు, ఫీచర్లు, వివరాలు

సర్పంచ్ ప్లస్ ట్రాక్టర్ విడుదల సందర్భంగా ఎమ్ అండ్ ఎమ్ లిమిటెడ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ సెక్టార్ ప్రెసిడెంట్ హేమంత్ సిక్కా మాట్లాడుతూ, "భారత ట్రాక్టర్ మార్కెట్ లీడర్‌గా, మహీంద్రా వద్ద మేము ఎల్లప్పుడూ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడంలో ముందంజలో ఉన్నాము. ఇందులో భాగంగానే కొత్త సర్పంచ్ ప్లస్ సిరీస్‌ను ప్రవేశపెట్టాము. ఇది అదనపు శక్తిని, అధిక బ్యాకప్ టార్క్‌ను ఆఫర్ చేస్తుంది మరియు ఆధునిక స్టైలింగ్‌ను కలిగి ఉండి బెస్ట్-ఇన్-క్లాస్ ఎర్గోనామిక్స్‌ను ఆఫర్ చేయటం ద్వారా అభివృద్ధి చెందుతున్న ఆధునిక రైతుల డిమాండ్లను తీర్చడానికి ఈ కొత్త సిరీస్ అభివృద్ధి చేయబడింది. అధిక శక్తి మరియు మంచి మైలేజ్‌తో రూపుదిద్దుకున్న సరికొత్త ELS ఇంజన్ టెక్నాలజీ రైతులకు వారి ఉత్పాదకతను మెరుగుపరచుకోవటానికి మరియు వారి ఆదాయాలను పెంచుకోవటానికి వీలు కల్పిస్తుంద"ని అన్నారు.

MOST READ: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బైక్‌లు, కార్లు ఎలా ఉన్నాయో చూసారా ?

మహీంద్రా సర్పంచ్ ప్లస్ ట్రాక్టర్ విడుదల - ధరలు, ఫీచర్లు, వివరాలు

మహీంద్రా సర్పంచ్ ప్లస్ ట్రాక్టర్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మహీంద్రా ప్రస్తుతం వివిధ రకాల ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని విస్తృత శ్రేణిలో ట్రాక్టర్లను ఆఫర్ చేస్తోంది. ఇందులో యువరాజ్, అర్జున్, భూమిపుత్ర, సర్పంచ్ మరియు షాన్ మొదలైన సిరీస్‌లు ఉన్నాయి. వీటికి అదనంగా, మహీంద్రా మరియు స్వరాజ్ బ్రాండ్ల క్రింద రానున్న మూడు సంవత్సరాల్లో ఆరు కొత్త ట్రాక్టర్లను విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఈసారి వర్షాకాలం అనుకూలంగా ఉన్న నేపథ్యంలో, ట్రాక్టర్ అమ్మకాలు పెరుగుతాయని కంపెనీ భావిస్తోంది.

Most Read Articles

English summary
Mahindra Farm Equipment Sector has launched a range of tractor in the Indian market. Called the Sarpanch Plus range is currently being sold only in Maharashtra. Prices for the new tractor range starts at Rs 6.6 lakh, ex-showroom (Pune). Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X