ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్.. మహీంద్రా నుండి స్పెషల్ ఆఫర్స్..

ప్రస్తుత పండుగ సీజన్లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం మహీంద్రా ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించింది. దీపావళి సందర్భంగా మహీంద్రా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, పిఎస్‌యు ఉద్యోగుల కోసం ప్రత్యేక నగదు తగ్గింపులు మరియు స్పెషల్ ఫైనాన్స్ ఆఫర్లను పరిచయం చేసింది.

ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్.. మహీంద్రా నుండి స్పెషల్ ఆఫర్స్..

ఈ ఆఫర్లలో భాగంగా, ప్రభుత్వ ఉద్యోగులకు మహీంద్రా తమ వాహనాల కొనుగోలుపై అదనంగా రూ.11,500 వరకు నగదు తగ్గింపును అందిస్తోంది. అంతేకాకుండా, మహీంద్రా వాహనాల కొనుగోలుపై ప్రాసెసింగ్ ఫీజులో 100 శాతం తగ్గింపును కూడా ఆఫర్ చేస్తోంది.

ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్.. మహీంద్రా నుండి స్పెషల్ ఆఫర్స్..

అలాగే, ప్రభుత్వ ఉద్యోగులకు వాహనాల కొనుగోలుపై కనీస వడ్డీ రేటు 7.25 శాతంతో రుణ సదుపాయాన్ని అందిస్తోంది. అంతేకాకుండా, గరిష్టంగా 8 సంవత్సరాల వరకు ఫైనాన్సింగ్ సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది. ఇందుకోసం మహీంద్రా అండ్ మహీంద్రా వివిధ రకాల ఫైనాన్స్ కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకుంది.

MOST READ:భారత్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ మేటోర్ 350 బైక్ లాంచ్ ; ధర & ఇతర వివరాలు

ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్.. మహీంద్రా నుండి స్పెషల్ ఆఫర్స్..

గవర్నమెంట్ ఎంప్లాయిస్ కోసం మహీంద్రా అందిస్తోన్న మరో బంపర్ ఆఫర్‌గా లో ఈఎమ్ఐ స్కీమ్‌ని చెప్పుకోవచ్చు. మహీంద్రా కార్ల కొనుగోలుపై కనిష్టంగా ప్రతి లక్ష రూపాయాలకు కేవలం రూ.799 ఈఎమ్ఐ ఆఫర్‌ను కూడా కంపెనీ ప్రవేశపెట్టింది.

ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్.. మహీంద్రా నుండి స్పెషల్ ఆఫర్స్..

కస్టమర్లు ఇతర ఆఫర్లకు సంబంధించిన మరింత సమాచారం కోసం తమ సమీపంలోని అధీకృత డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చని మహీంద్రా తెలిపింది. ఈ ఆఫర్లే కాకుండా, కంపెనీ వివిధ రకాల ఫైనాన్సింగ్ ఆప్షన్లను కూడా అందిస్తోంది. కోవిడ్-19 నేపథ్యంలో, కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల సౌకర్యాన్ని కంపెనీ ప్రవేశపెట్టింది.

MOST READ:మళ్ళీ పుంజుకున్న జావా పెరాక్ బైక్ అమ్మకాలు.. కారణం ఏంటో తెలుసా ?

ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్.. మహీంద్రా నుండి స్పెషల్ ఆఫర్స్..

మహీంద్రాకు సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ తాజాగా ప్రవేశపెట్టిన కొత్త తరం 2020 మహీంద్రా థార్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతోంది. ఈ మోడల్ కోసం ఇప్పటికే 20,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు నమోదైనట్లు కంపెనీ తెలిపింది.

ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్.. మహీంద్రా నుండి స్పెషల్ ఆఫర్స్..

కాగా, ఇప్పటికే మహీంద్రా థార్ డెలివరీలు కూడా ప్రారంభమయ్యాయి. కస్టమర్లకు ఈ పండుగ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేసేందుకు కంపెనీ థార్ ఫస్ట్ బ్యాచ్ డెలివరీలను ప్రారంభించింది. కొత్త థార్‌కు భారీ డిమాండ్ ఏర్పడటంతో దీని వెయిటింగ్ పీరియడ్ కూడా భారీగానే పెరిగిపోయింది.

MOST READ:లగ్జరీ బైక్ కొన్న సాధారణ యువకుడు.. ఇంతకీ ఎలా కొన్నాడో తెలుసా?

ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్.. మహీంద్రా నుండి స్పెషల్ ఆఫర్స్..

ఇకపై కొత్తగా థార్‌ను బుక్ చేసుకునే కస్టమర్లు డెలివరీ తీసుకోవటం కోసం కనీసం 5 నుండి 7 నెలల వరకు వేచి ఉండాల్సి పరిస్థితి ఏర్పడుతోంది. మహీంద్రా థార్‌లో హార్డ్ టాప్ ఆటోమేటిక్ మరియు మాన్యువల్ వేరియంట్లకు అత్యధికంగా బుకింగ్‌లు వస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్.. మహీంద్రా నుండి స్పెషల్ ఆఫర్స్..

ఈ వారాంతంలో 500 యూనిట్ల థార్ మెగా డెలివరీని ఒకేసారి ప్లాన్ చేసినట్లు కంపెనీ పేర్కొంది. కొత్త కస్టమర్ల కోసం వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించడం కోసం మహీంద్రా తమ నాసిక్ ప్లాంట్‌లో ఉత్పత్తిని వేగవంతం చేస్తోంది. వచ్చే జనవరి నుంచి నెలకు 3000 యూనిట్ల థార్ వాహనాలను ఉత్పత్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

MOST READ:ఎట్టకేలకు భారత మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త హ్యుందాయ్ ఐ 20 : ధర & ఇతర వివరాలు

ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్.. మహీంద్రా నుండి స్పెషల్ ఆఫర్స్..

ప్రభుత్వ ఉద్యోగుల కోసం మహీంద్రా అందిస్తున్న ఆఫర్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ప్రభుత్వ ఉద్యోగులకు నిజంగా ఇది జాక్‌పాట్ అనే చెప్పాలి. లోన్ ద్వారా మహీంద్రా కారును కొనాలనుకునే ప్రభుత్య ఉద్యోగులపై కంపెనీ ఆఫర్ల వర్షం కురిపించింది. తక్కువ ఈఎమ్ఐ, ఎక్కువ కాలం రుణ వ్యవధి, జీరో ప్రాసెసింగ్ ఫీజు, సున్నా ఫోర్‌క్లోజర్ ఛార్జీలు, 7.25 శాతం అతి తక్కువ వడ్డీ రేటు మరియు ప్రత్యేక నగదు తగ్గింపులను కంపెనీ అందిస్తోంది. ఈ సీజన్‌లో మహీంద్రా కారును సొంతం చేసుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇదొక చక్కటి అవకాశంగా చెప్పుకోవచ్చు.

Most Read Articles

English summary
Mahindra and Mahindra introduces festive season offers and special finace schemes for for government officials. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X