మహీంద్రా మరాజో బిఎస్6 వస్తోంది; ధరెంతో తెలుసా?

భారతదేశపు అగ్రగామి యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అందిస్తున్న మరాజో ఎమ్‌పివి త్వరలోనే బిఎస్6 అప్‌డేట్‌తో మార్కెట్లోకి రానుంది. ఈ నేపథ్యంలో, మహీంద్రా మరాజో బిఎస్6 భారత మార్కెట్లో విడుదల కావటానికి ముందే ధరలు, వేరియంట్ల వివరాలు లీక్ అయ్యాయి.

మహీంద్రా మరాజో బిఎస్6 వస్తోంది; ధరెంతో తెలుసా?

మహీంద్రా మరాజో బిఎస్‌6 ఎమ్‌పివి ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్ కేంద్రాలను చేరుకుంటున్నట్లు సమాచారం. తాజాగా జిగ్‌వీల్స్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం, మరాజో బిఎస్6 మోడళ్ల ధరలు వెల్లడయ్యాయి. బిఎస్6కి అప్‌డేట్ చేసిన ఈ ఎమ్‌పివి మొత్తం ఆరు వేరియంట్లలో లభ్యం కానుంది. మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.11.01 లక్షలు, ఎక్స్-షోరూమ్ (కోయంబత్తూర్)గా ఉంది.

మహీంద్రా మరాజో బిఎస్6 వస్తోంది; ధరెంతో తెలుసా?

జూలై నెలలో మహీంద్రా వెల్లడించిన కార్ సేల్స్ రిపోర్ట్ ప్రకారం బిఎస్6 మరాజో ఇప్పటికే డీలర్‌షిప్‌ల వద్దకు చేరిపోయినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే, అతి త్వరలోన్ మహీంద్రా మరాజో బిఎస్6 డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

MOST READ:రాజ్‌కోట్‌లోని మహిళా పోలీసుతో గొడవపడిన రవీంద్ర జడేజా ; ఎందుకో తెలుసా ?

మహీంద్రా మరాజో బిఎస్6 వస్తోంది; ధరెంతో తెలుసా?

ఆరు వేరియంట్లలో లభ్యం కానున్న మహీంద్రా మరాజో బిఎస్6 వెర్షన్‌లో కేవలం బేస్ వేరియంట్ మాత్రమే మునుపటి మోడల్ కంటే రూ.1.01 లక్షల అధిక ధరను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మిగిలిన అన్ని వేరియంట్ల ధరలు మునుపటి బిఎస్4 మోడళ్ల మాదిరిగానే ఉన్నాయి.

Variant BS4 Price BS6 Price Difference
M2 7/8 Seater Rs10 Lakh ₹11.01 Lakh ₹1,01 Lakh
M4 7/8 Seater ₹11.56 Lakh / ₹11.64 Lakh - -
M4+ 7/8/ Seater - ₹12.37 Lakh / ₹12.45 Lakh -
M6 7/8 Seater ₹13.09 Lakh / ₹13.17 Lakh - -
M6+ 7/8 Seater - ₹13.51 Lakh / ₹13.59 Lakh -
M8 7/8 Seater ₹14.68 Lakh / ₹14.77 Lakh - -
మహీంద్రా మరాజో బిఎస్6 వస్తోంది; ధరెంతో తెలుసా?

మహీంద్రా మరాజో బిఎస్6లో మునుపటి బిఎస్4 మోడల్‌తో పోలిస్తే కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉండనున్నాయి. మరాజో ఎమ్4+ వేరియంట్‌లో బ్లూటూత్ ఎనేబుల్డ్ మ్యూజిక్ సిస్టమ్ మరియు అల్లాయ్ వీల్స్ ఉండొచ్చని అంచనా. ఈ మోడల్ విడుదల సమయంలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

MOST READ:జూలై నెలలో కొత్త రికార్డు సృష్టించిన ఫాస్ట్ ట్యాగ్ ట్రాన్సక్షన్స్ , ఎంతో తెలుసా ?

మహీంద్రా మరాజో బిఎస్6 వస్తోంది; ధరెంతో తెలుసా?

మహీంద్రా మరాజో ఎమ్‌పివి రెండేళ్ల క్రితం భారత మార్కెట్లో విడుదలైంది. అప్పటి నుండి ఇది ఒకే ఒక 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తోంది. బిఎస్6 మోడళ్లలో కూడా ఇదే ఇంజన్ యొక్క అప్‌డేటెడ్ వెర్షన్ కొనసాగుతుందని తెలుస్తోంది.

మహీంద్రా మరాజో బిఎస్6 వస్తోంది; ధరెంతో తెలుసా?

బిఎస్ మోడళ్లలోని 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 121 బిహెచ్‌పి శక్తిని మరియు 300 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది, ఇందులో ఆప్షనల్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందుబాటులో లేదు.

MOST READ:ఆటో అంబులెన్స్ .. కరోనా రోగులకు ఈ అంబులెన్సులు సిద్ధంగా ఉన్నాయి

మహీంద్రా మరాజో బిఎస్6 వస్తోంది; ధరెంతో తెలుసా?

బిఎస్6 డీజిల్ యూనిట్‌తో పాటు మహీంద్రా మరాజోను టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో ఆఫర్ చేయవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మహీంద్రా కొరియన్ భాగస్వామి శాంగ్‌యాంగ్ కొరాండోలో ఉపయోగిస్తున్న 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను మరాజోలో ఉపయోగించవచ్చని అంచనా. ఈ ఇంజన్ 162 బిహెచ్‌పి శక్తిని మరియు 280 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఈ ఇంజన్ అందుబాటులోకి రావటానికి మరికొంత సమయం పట్టే ఆస్కారం ఉంది.

మహీంద్రా మరాజో బిఎస్6 వస్తోంది; ధరెంతో తెలుసా?

ఇకపోతే, మహీంద్రా మరాజో బిఎస్6 ఎమ్‌పివి మునుపటి మాదిరిగానే ఏడు సీట్లు మరియు ఎనిమిది సీట్ల కాన్ఫిగరేషన్‌తో లభ్యం కానుంది. ఏడు సీట్ల వేరియంట్‌లో మధ్య వరుసలో కెప్టెన్ సీట్స్ ఉంటాయి. ఎనిమిది సీట్ల మోడళ్లలో ట్రెడిషనల్ స్ప్లిట్-ఫోర్డబిల్ బెంచ్ సీట్ ఉంటుంది.

MOST READ:క్రికెటర్ రాబిన్ ఉతప్పకు పంపిణీ చేయబడిన ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్

మహీంద్రా మరాజో బిఎస్6 వస్తోంది; ధరెంతో తెలుసా?

ఈ బిఎస్6 ఎమ్‌పివిలో కొత్త మార్పులతో పాటుగా దాని బిఎస్4 మోడల్ నుండి అనేక డిజైన్ ఎలిమెంట్స్ మరియు ఫీచర్లను కొనసాగిస్తుంది. ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మూడు వరుసలకు ఎయిర్ కండిషనింగ్ వెంట్స్, బహుళ ఎయిర్‌బ్యాగులు మరియు ఏబిఎస్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

మహీంద్రా మరాజో బిఎస్6 వస్తోంది; ధరెంతో తెలుసా?

మహీంద్రా మరాజో బిఎస్6 ధరలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మహీంద్రా మరాజో మంచి ప్రాక్టికల్ ఎమ్‌పివి. ఈ విభాగంలో ఇది మంచి క్యాబిన్ స్పేస్‌ను ఆఫర్ చేయటంతో పాటుగా మంచి ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. ఇందులో డ్రైవర్‌తో సహా ఏడుగురు లేదా ఎనిమిది మంది ప్రయాణీకులు సౌకర్యవంతంగా కూర్చోగలరు. మునుపటి మోడళ్లతో పోలిస్తే ధరలు మారవు కాబట్టి, అప్‌డేటెడ్ మోడల్‌లో చేసిన మార్పులు చాలా పరిమితంగా ఉంటాయని తెలుస్తోంది.

Most Read Articles

English summary
The Mahindra Marazzo BS6 prices have been leaked ahead of its launch in the Indian market. The MPV is confirmed to receive the BS6 update from the company and could have arrived at dealerships across the country. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X