మహీంద్రా నుంచి 3 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కనీసం మూడు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం భారత మార్కెట్లో విక్రయించే ఎలక్ట్రిక్ త్రీ వీలర్లతో మహీంద్రా ఇప్పటికే గొప్ప విజయాలను తన ఖాతాలో వేసుకుంది.

మహీంద్రా నుంచి 3 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు

గాడివాడి నుండి వచ్చిన తాజా నివేదికల ప్రకారం, సమీప భవిష్యత్తులో మహీంద్రా తమ ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిని విస్తరించాలని యోచిస్తోంది. వాణిజ్య ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో డిమాండ్ పెరుగుతూనే ఉన్నందున మహీంద్రా అటామ్ ఎలక్ట్రిక్ మరియు టెరో జోర్ వాహనాలను విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది.

మహీంద్రా నుంచి 3 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు

మహీంద్రా రెండు వాణిజ్య ఆధారిత ఎలక్ట్రిక్ వాహనాలతో పాటుగా ప్యాసింజక్ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో చాలా కాలంగా అభివృద్ధి దశలో ఉన్న ఉన్న ఇకెయువి100 ఎలక్ట్రిక్ కారును కూడా ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రవేశపెట్టాలని కంపెనీ కృషి చేస్తోంది. ఒకవేళ ఈ ఎలక్ట్రిక్ కారు విడుదలైతే, ఇది భారత మార్కెట్లో విక్రయించే చౌకైన ఎలక్ట్రిక్ కారుగా ఉండొచ్చని సమాచారం.

MOST READ: ఇవే మేడ్ ఇన్ ఇండియా స్కూటర్స్ - ఫుల్ డిటేల్స్

మహీంద్రా నుంచి 3 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు

మహీంద్రా ఎలక్ట్రిక్ గత ఏడాది 14,000 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించినట్లు పేర్కొంది. వీటిలో ఎక్కువగా టెరో ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలు ఉన్నాయి. ఆటో రంగంలో కొనసాగుతున్న సవాళ్, ఉత్పత్తి అంతరాయాలు ఉన్నప్పటికీ, ఎలక్ట్రిక్ వాహనాల విభాగంపై మరింత ఎక్కువ దృష్టి సారించాలని కంపెనీ యోచిస్తోంది. ట్రెయోకు పెరిగిన డిమాండ్ కారణంగా, టెరో జోర్ టెస్టింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని కంపెనీని ప్లాన్ చేస్తోంది.

మహీంద్రా నుంచి 3 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు

వాణిజ్య వాహనాల విడుదలతో పాటుగా ప్యాసింజర్ వాహన విభాగంలో ఇకెయువి100 వంటి మెయిన్‌స్ట్రీమ్ ఎలక్ట్రిక్ వాహనాలను కూడా విడుదల చేయాలనే ప్రణాళికతో ఉన్నట్లు మహీంద్రా ధృవీకరించింది. ఈ నేపథ్యంలో, వాణిజ్య విభాగంపైనే ఎక్కువ దృష్టి సారించడం వల్ల ప్రాథమిక ఎలక్ట్రిక్ వాహనాల కాలపరిమితి ప్రభావితం కాదని కంపెనీ వివరించింది.

MOST READ: బ్రేకింగ్ న్యూస్: భారత్‌లో కొత్త హోండా డబ్ల్యూఆర్-వి విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

మహీంద్రా నుంచి 3 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు

ఈ విషయంపై మహీంద్రా మరియు మహీంద్రా ఎమ్‌డి, సిఈఓ పవన్ గోయెంకా మాట్లాడుతూ "ఎలక్ట్రిక్ వాహనాలకు స్కేల్ చాలా ముఖ్యం, వీటి తయారీలో ప్రతిదాన్ని స్వయంగా మనమే తయారు చేసుకుంటే సబ్‌స్కేల్ అవుతాము. పెద్ద పరిమాణాలను పొందడానికి మరియు ఖర్చులను తగ్గించడానికి మాకు వ్యూహాత్మక పెట్టుబడులు అవసరం. ఐపిఓ గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు, మేము మొదట లాభదాయకతపై పని చేయాలి మరియు మా వాటాను తగ్గించాలి" అని అన్నారు.

మహీంద్రా నుంచి 3 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు

కాగా, మహీంద్రా ఎలక్ట్రిక్ ఎమ్‌డి మరియు సిఈఓ మహేష్ బాబు మాట్లాడుతూ.. కంపెనీ గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో గొప్ప ఫలితాలను నమోదు చేసిందని, ఇబిఐటిడిఎలో సానుకూలంగా ఉందని తెలిపారు. సంస్థ తమ వాటాలను విక్రయించడానికి చూడటం లేదని, ప్రస్తుతం ఇందులో పెట్టుబడిని పెంచాలని చూస్తోందని వివరించారు.

MOST READ: ఒక్కసారిగా 1000 కి పైగా ఫోర్స్ అంబులెన్సులు ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

మహీంద్రా నుంచి 3 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు

మహీంద్రా ఎలక్ట్రిక్ కంపెనీకి భాగస్వామిగా ఉండే పిఇ సహ పెట్టుబడిదారుల కోసం కంపెనీ వెతుకుతోందని, అయితే మహీంద్రా గ్రూప్ కంపెనీలో మెజారిటీ వాటాదారుగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే కొత్త గ్లోబల్ ఆర్‌అండ్‌డి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కంపెనీ చూస్తోందని బాబు తెలిపారు.

మహీంద్రా నుంచి 3 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు

మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా చైనా నుండి కొన్ని భాగాలను దిగుమతి చేసుకోవడంలో ప్రస్తుతం పరిశ్రమ ఎదుర్కుటుంన్న సవాళ్లు తాత్కాలిమేనని మహీంద్రా ఎలక్ట్రిక్ పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతున్నందున భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ త్వరలో పునరుద్ధరించబడుతుందని మా అభిప్రాయం. దీని ఫలితంగా, మహీంద్రా నుంచి రాబోయే ఎలక్ట్రిక్ వాహనాలు త్వరలోనే భారత మార్కెట్లో విడుదల అవుతాయని మేము ఆశిస్తున్నాము.

Source:rushlane

Most Read Articles

English summary
Mahindra is expected to launch at least three electric vehicles by the end of the current fiscal year. The company has had great success with the current crop of electric three-wheelers sold in the Indian market. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X