Just In
Don't Miss
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కరోనా ఎఫెక్ట్ : భారీ నష్టాల్లో మహీంద్రా
దేశీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన వాహన తయారీ సంస్థ మహీంద్రా వెహికల్ మానుఫ్యాక్చరర్స్ లిమిటెడ్ ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో దాదాపు 3,255 కోట్ల రూపాయల ఆర్థిక నష్టాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయంలో బ్రాండ్ యొక్క ఆర్ధికవ్యవస్థ రూ. 969 కోట్ల లాభాలను నమోదు చేసింది.

2020 ఆర్థిక సంవత్సరం కంపెనీ మొత్తం ఆదాయం కూడా 35 శాతం వరకు క్షీణించింది. ఇది 2019 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలోని 13,808 కోట్ల రూపాయల నుండి 9,005 కోట్లకు పడిపోయింది.

2020 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో మహీంద్రా & మహీంద్రా యొక్క నష్టాలు రూ. 2,502.42 కోట్లు. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ 849 కోట్ల రూపాయల లాభాలను నమోదు చేసినట్లు కూడా కంపెనీ ప్రస్తావించింది.
MOST READ:కరోనా ఎఫెక్ట్ : విమానాశ్రయాలతో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఉబర్, ఎందుకంటే ?

మహీంద్రా కార్ల తయారీ కార్యకలాపాల వల్ల 2020 జనవరి మరియు మార్చి మధ్య మొత్తం ఆదాయం 9,458.43 కోట్ల రూపాయలుగా నమోదు చేశాయి. అంతే కాకుండా మహీంద్రా 2020 జనవరి మరియు మార్చి మధ్య కార్ల అమ్మకాలలో 47 శాతం క్షీణించింది. ఈ సమయంలో కార్ల అమ్మకాలు 86,351 యూనిట్లుగా ఉన్నాయి.

మహీంద్రా యొక్క ఎగుమతులు కూడా ఈ సమయంలో 57 శాతం తగ్గాయి. 2020 జనవరి, మార్చి మధ్య మహీంద్రా వాహనాల ఎగుమతులు 13,541 యూనిట్ల నుంచి 5,700 కు తగ్గాయి. కానీ ట్రాక్టర్ అమ్మకాలు మాత్రం ఇదే కాలంలో 0.45 శాతం స్వల్ప వృద్ధిని నమోదు చేయగలిగాయి.
MOST READ:దొంగలించిన 6 సంవత్సరాల తర్వాత కనుగొనబడిన మాజీ ముఖ్యమంత్రి కారు

మహీంద్రా మరియు మహీంద్రా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా మాట్లాడుతూ పరిశ్రమలో నా 41 సంవత్సరాలలో, గత 3 నెలల్లో జరిగిన తగ్గుదల మునుపెన్నడూ చూడలేదని తెలిపాడు. కరోనా వైరస్ ప్రభావం వల్ల సంస్థ యొక్క పనితీరును బాగా తగ్గిపోయింది. ఈ తగ్గుదలకు కరోనా లాక్ డౌన్ కూడా ప్రధాన కారణం అయిందన్నారు.

మహీంద్రా ఆర్థిక ఫలితాల గురించి డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం :
కరోనా వైరస్ మరియు భారత్ లాక్ డౌన్ మహీంద్రా & మహీంద్రా కంపెనీపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఇది 2020 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కంపెనీకి భారీ నష్టాన్ని కలిగించింది. మహీంద్రా కంపెనీ పొందిన ఆర్ధిక నష్టాన్ని తిరిగి పొందటానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది.
MOST READ:భారీగా పెరిగిన పెట్రోల్ & డీజిల్ ధరలు : ఎంతో తెలుసా