మాకొక కొత్త పార్ట్‌నర్ కావాలి: మహీంద్రా అండ్ మహీంద్రా

భారత ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్)కి చెందిన కొరియన్ ఆటోమొబైల్ బ్రాండ్ శాంగ్‌యాంగ్‌ (Ssangyong) కోసం కంపెనీ ఇప్పుడు కొత్త భాగస్వాముల వేటలో పడింది. దాదాపు పదేళ్ల క్రితం మహీంద్రా ఈ కొరియన్ బ్రాండ్ కంపెనీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. ఆ తర్వాత క్రమక్రమంగా తన వాటాను పెంచుకుంటూ వచ్చింది.

మాకొక కొత్త పార్ట్‌నర్ కావాలి: మహీంద్రా అండ్ మహీంద్రా

గడచిన పదేళ్ల కాలంలో మహీంద్రా తీసుకువచ్చిన ఈ లగ్జరీ కార్ బ్రాండ్ శాంగ్‌యాంగ్ భారత మార్కెట్లో ఆశించిన పురోగతిని సాధించలేకపోయింది. గడచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కూడా శాంగ్‌యాంగ్ భారీస్థాయిలో నష్టాలను నమోదు చేసింది. ఈ నేపథ్యలో, శాంగ్‌యాంగ్ బ్రాండ్‌ను పూర్తిగా వదులుకునేందుకు మహీంద్రా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.

మాకొక కొత్త పార్ట్‌నర్ కావాలి: మహీంద్రా అండ్ మహీంద్రా

కొరియాకి చెందిన శాంగ్‌యాంగ్ సంస్థలో మహీంద్రాకు 75 శాతం వాటాలున్నాయి. శాంగ్‌యాంగ్ బ్రాండ్ వలన మహీంద్రా ఇప్పటికే నష్టాలను చవిచూస్తుంటే, తాజాగా వచ్చిన కోవిడ్-19 పరిస్థితులు ఈ నష్టాలను మరింత పెంచాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో, ఇప్పటికే అనేక కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. మహీంద్రా కూడా అదే బాటలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది.

MOST READ: ఎప్పుడైనా ఇలాంటి 8 చక్రాల ఫియట్ యునో చూసారా ?

మాకొక కొత్త పార్ట్‌నర్ కావాలి: మహీంద్రా అండ్ మహీంద్రా

ఒక సందర్భంలో మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా మాట్లాడుతూ.. శాంగ్‌యాంగ్ కంపెనీని సపోర్ట్ చేయటానికి ప్రస్తుతం ఓ పెట్టుబడిదారుడు అవసరమని వ్యాఖ్యానించారు. ఇందు కోసం కంపెనీ ఇప్పటికే పనులు కూడా ప్రారంభించిందని అన్నారు.

మాకొక కొత్త పార్ట్‌నర్ కావాలి: మహీంద్రా అండ్ మహీంద్రా

పవన్ గోయెంకా వ్యాఖ్యలను సమర్ధిస్తూ మహీంద్రా అండ్ మహీంద్రా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అనీష్ షా మాట్లాడుతూ.. శాంగ్‌యాంగ్ కోసం కొత్త భాగస్వామిని ఎంచుకున్న తర్వాత అందులో కొత్త వాటాలను కొనుగోలు చేయటమే కాకుండా, తమకున్న వాటాల్లో కూడా కొనుగోళ్లు చేసేందుకు అవకాశం ఉందని అన్నారు. వీరి వ్యాఖ్యలను చూస్తుంటే వీలైనంత త్వరగా శాంగ్‌యాంగ్‌ను వదిలించుకోవాలని మహీంద్రా చూస్తున్నట్లు తెలుస్తోంది.

MOST READ: ముంబై పోలీసులకి సెగ్వే ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎందుకో తెలుసా ?

మాకొక కొత్త పార్ట్‌నర్ కావాలి: మహీంద్రా అండ్ మహీంద్రా

పదేళ్ల క్రితం మహీంద్రా టేకోవర్ చేసిన శాంగ్‌యాంగ్ బ్రాండ్ నుంచి 'రెక్స్టన్' (Rexton) అనే ప్రీమియం ఎస్‌యూవీని మహీంద్రా మార్కెట్లో విడుదల చేసింది. ఆ సెగ్మెంట్లో ఫోర్డ్ ఎండీవర్, టొయోటా ఫార్చ్యూనర్ వంటి మోడళ్లకు పోటీగా వచ్చిన రెక్స్టన్ ఎస్‌యూవీ మార్కెట్లో ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. ఫలితంగా మహీంద్రా ఈ మోడల్‌ను భారత మార్కెట్ నుంచి తొలగించి వేసింది.

మాకొక కొత్త పార్ట్‌నర్ కావాలి: మహీంద్రా అండ్ మహీంద్రా

ప్రస్తుతం శాంగ్‌యాంగ్ నుంచి మనం ఇండియన్ మార్కెట్లో ఎలాంటి మోడళ్లను చూడకపోయినప్పటికీ, మహీంద్రా అందిస్తున్న ఆల్ట్యురాస్ జి4 మోడల్ మాత్రం చాలా వరకూ శాంగ్‌యాంగ్ రెక్స్టన్ కారు నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేసినదే.

MOST READ: మద్యం మత్తులో బైక్‌తో రైడింగ్ చేయడానికి సవాల్ విసిరిన స్కూటర్ డ్రైవర్ [వీడియో]

మాకొక కొత్త పార్ట్‌నర్ కావాలి: మహీంద్రా అండ్ మహీంద్రా

శాంగ్‌యాంగ్ కోసం కొత్త భాగస్వామిని వెతకటంతో పాటుగా రానున్న ఏడాది లోపుగా ఈ కొరియన్ కంపెనీలో తమ వ్యాపార లావాదేవీలను మహీంద్రా అద్యయనం చేయనుంది. ఈ నష్టాల పరంపర ఇలానే కొనసాగితే శాంగ్‌యాంగ్ నుంచి మహీంద్రా పూర్తిగా తప్పుకునే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఖర్చులు తగ్గించుకోవాలంటే మహీంద్రాకు ఇదొక్కటే మార్గంగా తెలుస్తోంది.

మాకొక కొత్త పార్ట్‌నర్ కావాలి: మహీంద్రా అండ్ మహీంద్రా

ఇదిలా ఉంటే.. మహీంద్రా అమెరికాకు చెందిన ఫోర్డ్ మోటార్ కంపెనీతో 2019లో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఇరు కంపెనీలు ఓ జాయింట్ వెంచర్‌ను ప్రారంభించి, వ్యాపారం చేయదలచాయి. కాకపోతే, ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితుల కారణంగా ఈ రెండు కంపెనీల విలీనానికి సంబంధించిన ప్రక్రియ వాయిగా పడింది. ఈ కొత్త అలయన్స్‌తో సరికొత్త ఎస్‌యూవీలు ఇటు దేశీయ అటు అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలయ్యే అవకాశాలున్నాయి.

MOST READ: దొంగలించిన 6 సంవత్సరాల తర్వాత కనుగొనబడిన మాజీ ముఖ్యమంత్రి కారు

మాకొక కొత్త పార్ట్‌నర్ కావాలి: మహీంద్రా అండ్ మహీంద్రా

శాంగ్‌యాంగ్ కొత్త భాగస్వామి అన్వేషణపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కొరియన్ బ్రాండ్ శాంగ్‌యాంగ్‌లో మెజారిటీ వాటాలను దక్కించుకున్న మహీంద్రా అండ్ మహీంద్రా భారత మార్కెట్లో ఆ బ్రాండ్‌తో సక్సెస్‌ను సాధించడంలో పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. ఇందుకు అనేక కారణాలే ఉన్నప్పటికీ, ఇకపై ఆ సంస్థ ద్వారా వచ్చే నష్టాలను తగ్గించుకోవాలని మహీంద్రా గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే కొత్త భాగస్వామిని వెతికి, తమ చేతులు దులుపుకోవాలని చూస్తోంది.

Most Read Articles

English summary
Mahindra Group is seeking new partners for its partnership with the South Korean automaker Ssangyong. The company has incurred massive losses during quarter four of the financial and is looking to cut down the budgets. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X