Just In
Don't Miss
- Movies
దీప్తి సునయన అలాంటిది కాదు.. నోయల్ సెన్సేషనల్ కామెంట్స్
- News
అమానవీయం : దళిత జంటకు ఆలయ ప్రవేశం నిరాకరణ.. రూ.2.5లక్షలు జరిమానా...
- Lifestyle
ఈ హార్మోన్ల సమస్య ఉన్న మహిళలు బరువు తగ్గడం చాలా కష్టం...!
- Finance
Budget 2021: 10 ఏళ్లలో బడ్జెట్‌కు ముందు సూచీలు ఇలా, ఇన్వెస్టర్లకు హెచ్చరిక!
- Sports
చరిత్ర సృష్టించిన భారత్.. బ్రిస్బేన్ టెస్టులో ఘన విజయం!! టెస్ట్ సిరీస్ టీమిండియాదే!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కరోనా నివారణలో భాగంగా మహీంద్రా అంబులెన్స్
భారతదేశంలో కరోనా వైరస్ అధికంగా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కోవిడ్-19 మహమ్మారిపై పోరాడటానికి మహీంద్రా గ్రూప్ 12 అంబులెన్స్‌లను మహారాష్ట్రలో అందించింది. కొత్త మహీంద్రా అంబులెన్స్‌ను వెంటనే సేవల్లోకి తెచ్చి, రాష్ట్రంలోని కోవిడ్ -19 రోగులకు వైద్య సదుపాయాలు వేగంగా లభించేలా చర్యలు తీసుకుంటున్నారు.

మహీంద్రా అంబులెన్స్‌లను బ్రాండ్ యొక్క సుప్రో వాణిజ్య వాహనంలో నిర్మించడం జరిగింది. ఈ వాహనం చాలా చిన్నగా ఉండటం వల్ల అంబులెన్స్ ముంబైలోనే కాకుండా, రాష్ట్రంలోని ఇతర చిన్న పట్టణాలు మరియు నగరాల్లో కూడా ఇరుకైన వీధులలో ప్రయాణియించడానికి అనుకూలంగా ఉంటుంది. మహీంద్రా 8 సీట్ల వ్యాన్‌ను ఇప్పుడు ఇతర ప్రాథమిక వైద్య పరికరాలతో పాటు రోగులను తీసుకెళ్లడానికి అనుకూలంగా ఉండే విధంగా మార్చింది.

12 అంబులెన్స్‌లతో కూడిన మొదటి బ్యాచ్‌ను ముంబై పౌర సంస్థకు మహారాష్ట్ర ప్రభుత్వ పర్యాటక, పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే అందజేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సమక్షంలో ఈ వాహనాలను అందించడం జరిగింది.
MOST READ:బిఎస్ 4 వాహన అమ్మకాల రిపోర్ట్ సబ్మిట్ చేయాలన్న సుప్రీంకోర్ట్, ఎందుకో తెలుసా ?

నగరంలో ఈ అంబులెన్స్ అందజేస్తున్నట్లు ప్రకటించడానికి ఆదిత్య ఠాక్రే సోషల్ మీడియా (ట్విట్టర్) లో పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి అంబులెన్స్‌ల కోసం మహీంద్రా గ్రూప్‌ను అభ్యర్థించిందని, ఉత్పత్తి సంఖ్యను మరింత పెంచాలని ప్రభుత్వం కోరినట్లు సమాచారం.

మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా కూడా ట్విట్టర్‌లో మహీంద్రా యొక్క మొదటి బ్యాచ్ వాహనాల సేవలను ప్రారంభించినట్లు కూడా ప్రకటించారు. మహీంద్రా అంబులెన్స్‌లకు జీ గ్రూప్ సహకారం ఉన్నట్లు కూడా పేర్కొన్నారు.
MOST READ:కరోనా ఎఫెక్ట్ : పెట్రోల్ బంక్ లో కొత్త సిస్టం

కరోనా మహమ్మారి నేపథ్యంలో మహీంద్రాతో పాటు అనేక ఇతర వాహన తయారీదారులు కూడా అంబులెన్సులతో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఇటీవలే ఎంజి మోటార్ ఇండియా, వారి హెక్టర్ ఎస్‌యూవీని అన్ని అవసరమైన వైద్య పరికరాలతో అంబులెన్స్‌గా మార్చింది.

ఎంజీ హెక్టర్ అంబులెన్స్‌ను గత నెల ప్రారంభంలో వడోదరలోని ఆరోగ్య సంరక్షణ అధికారులకు విరాళంగా ఇచ్చారు. హెక్టర్ అంబులెన్స్ 10 రోజుల స్వల్ప వ్యవధిలో నిర్మించబడింది మరియు అవసరమైన అన్ని వైద్య పరికరాలను కలిగి ఉంది. ఎంజి హెక్టర్ అంబులెన్స్‌ను అహ్మదాబాద్‌కు చెందిన ఒక సంస్థ సహకారంతో తయారుచేయబడింది.
MOST READ:జూన్ 19న సరికొత్త ట్రయంప్ టైగర్ 900 బైక్ విడుదల

మహీంద్రా అంబులెన్స్ గురించి డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం :
భారతదేశంలో ప్రస్తుతం మహారాష్ట్రలో ఎక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి. రోజు రోజుకి ఈ కరోనా కేసులు ఎక్కువవుతున్న కారణంగా మహారాష్ట్ర రాజధాని ముంబైలో కూడా తీవ్రంగా ప్రభావితమైంది. కరోనా నివారణలో భాగంగా చాలా వాహన కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వాలకు తమవంతు మద్దతుని ప్రకటిస్తున్నాయి. ఈ సమయంలో కరోనా నివారణకు మహీంద్రా అంబులెన్స్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.