Just In
- 59 min ago చీరకట్టులో బైక్ రైడ్ చేసిన ప్రముఖ నటి.. మండిపడుతున్న నెటిజన్లు - ఎందుకంటే?
- 1 hr ago కదులుతున్న ఆడి కారు పైకెక్కి యువకుల హల్చల్.. పోలీసులు ఏం చేశారంటే.??
- 15 hrs ago సుజుకి V-Strom 800DE అడ్వెంచర్ బైక్ ఉపకరణాలు ఇవే.. ధరలు ఎంతంటే.?
- 18 hrs ago అత్యంత చౌకగా ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు.!!
Don't Miss
- Finance Market Opening: నష్టాల్లో ట్రేడింగ్ మెుదలెట్టిన మార్కెట్లు.. సపోర్ట్ జోన్ కింద నిఫ్టీ..
- Sports RCB vs SRH: పక్కనపెట్టలేదు.. నేనే ఆడనని చెప్పా: గ్లేన్ మ్యాక్స్‌వెల్
- News AP Election Survey: వైసీపీ వర్సెస్ కూటమి పోరులో మొగ్గు వారికే -తేల్చేసిన మరో జాతీయ సర్వే..!
- Technology ఏప్రిల్ 23 న షియోమీ లాంచ్ ఈవెంట్! 4 కొత్త పరికరాలు లాంచ్ కాబోతున్నాయి!
- Movies Tillu Square 150 కోట్లపై కన్నేసిన టిల్లు.. బాక్సాఫీస్‌పై డీజే కలెక్షన్ల మోత..ఎన్ని కోట్ల లాభమంటే?
- Lifestyle ఫెయిర్‌నెస్ క్రీమ్ లు కిడ్నీ సమస్యలను పెంచుతున్నాయి జాగ్రత్త..!
- Travel శ్రీరామనవమి రోజున అయోధ్య రామాలయంలో అద్భుత ఘట్టం...
ఢిల్లీలో నామినేషన్ దాఖలు చేయడానికి మహీంద్రా థార్ ని ఉపయోగించిన అరవింద్ కేజ్రీవాల్!
భారతదేశంలో చాల మంది రాజకీయ నాయకులు వారియొక్క నిత్యావసారాలకు మరియు రోడ్ షో లకు, మీటింగులకు కొన్ని ప్రత్యేకమైన వాహనాలను వినియోగిస్తున్నట్లు మనము ఇది వరకే తెలుసుకున్నాం. ఇదే ధోరణిలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఢిల్లీలో నామినేషన్ దాఖలు చేయడానికి మహీంద్రా థార్ ని ఉపయోగించినట్లు సమాచారం. దీని గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం!
ఢిల్లీలో జనవరి 20 న జరిగిన ఒక రోడ్ షో కి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మహీంద్రా థార్ ని ఉపయోగించుకున్నారు. మహీంద్రా థార్ ఆఫ్-రోడ్ కఠినమైన ఎస్యువి విభాగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన వాహనాలలో కటిగా ఉంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన రోడ్‌షో కోసం అనుకూలించబడిన మహీంద్రా థార్‌ను ఉపయోగించనున్నారు. ఈ జీప్ పసుపు నలుపు రంగులతో ఉంటుంది. ఈ కారులో గ్రిల్ మీద అతని యొక్క ఆమ్ ఆద్మీ పార్టీ చిహ్నం కూడా ఉంటుంది.
ఇంకా కారు యొక్క ముందు భాగంలో అతని పార్టీ యొక్క గుర్తును మనం ఈ వాహనంలో స్పష్టంగా చూడవచ్చు. వాహనానికి ముందు భాగంలో రెండు హెడ్ లైట్స్ కూడా ఉన్నాయి.
భారతదేశంలో ఆఫ్-రోడ్ ఎస్యూవీ విభాగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన కార్లలో మహీంద్రా థార్ ఒకటిగా ఉంది. ఈ సంవత్సరం టెస్ట్ మ్యూల్ రహదారిపై అనేకసార్లు పరీక్షించడం జరిగింది. ఈ కారులో డిజైన్ సంకేతాలలో ఎక్కువ భాగం ప్రామాణికంగా ఉంటాయి.
మహీంద్రా థార్ లో మునుపటి సంస్కరణ నుండి వచ్చే ఇతర అంశాలు గమనించినట్లయితే ఇందులో ఏడు-స్లాట్ గ్రిల్, రౌండ్ హెడ్‌ల్యాంప్‌లు మరియు ఫ్రంట్ బంపర్ లు ఉంటాయి. కొత్త థార్ ఆల్-బ్లాక్ డాష్‌బోర్డ్ మరియు ఎయిర్-కాన్ సిస్టమ్ కోసం కొత్త డయల్స్, కొత్త స్టీరింగ్ వీల్ తో పాటు పునర్నిర్మించిన సెంట్రల్ ఎయిర్-కాన్ వెంట్స్ మరియు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో కూడిన అప్డేటెడ్ క్యాబిన్‌ను కూడా ఇందులో ఉంటుంది.
ఇది డ్రైవర్ మరియు కో-డ్రైవర్ కోసం మెరుగైన కొత్త సీట్లను కలిగి ఉంటుంది. వెనుక సీట్లు బెంచ్ సీట్లను పోలి ఉంటాయి. మహీంద్రా థార్ సరికొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో ఉంటుంది. ఇందులో భద్రత విషయానికొస్తే 2020 మహీంద్రా థార్ ఫ్రంట్, ఎబిఎస్ డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్, పార్కింగ్ సెన్సార్లు మరియు స్పీడ్ అలర్ట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఈ విధంగా మహీంద్రా థార్ ని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ కి అనుకూలంగా తయారు చేయడం జరిగింది.