బొలెరో బ్యాడ్జింగ్‌తో మహీంద్రా టియువి300 టెస్టింగ్; అసలేం జరుగుతోంది..?

మహీంద్రా అందిస్తున్న టియువి300లో కంపెనీ ఓ కొత్త రిఫ్రెష్డ్ వెర్షన్ మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మనం ఇదివరకటి కథనాల్లో తెలుసుకున్నాం. తాజాగా, కొత్త 2021 మహీంద్రా టియువి300 భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తుండగా ఓ నెటిజెన్ తన కెమెరాలో బంధించారు.

బొలెరో బ్యాడ్జింగ్‌తో మహీంద్రా టియువి300 టెస్టింగ్; అసలేం జరుగుతోంది..?

ఈసారి కొత్త టియువి300 సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి. కొత్త సంవత్సరంలో (2021లో) మహీంద్రా భారత మార్కెట్లో అనేక కొత్త మోడళ్లను మరియు ప్రస్తుతం ఉన్న వాహనాల్లో రిఫ్రెష్డ్ వెర్షన్లను మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ కొత్త వాహనాల్లో ఒకటి 2021 మహీంద్రా టియువి300.

బొలెరో బ్యాడ్జింగ్‌తో మహీంద్రా టియువి300 టెస్టింగ్; అసలేం జరుగుతోంది..?

ఇప్పటికే మహీంద్రా ఈ ఎస్‌యూవీని భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. తాజాగా లీకైన స్పై చిత్రాలు ఈ కొత్త టియువి300కి సంబంధించిన అనేక వివరాలను వెల్లడి చేస్తున్నాయి. ఈ చిత్రాల ప్రకారం, కొత్త టియువి300లో స్పేర్ వీల్‌ను బూట్ డోరుపై అమర్చారు. అయితే, ఆశ్చర్యకరంగా ఈ స్పేర్ వీల్ కవర్‌పై బొలెరో బ్యాడ్జింగ్ కనిపిస్తోంది.

MOST READ:భారత్‌లో విడుదలకు సిద్దమవుతున్న ఆడి ఎ 4 సెడాన్, ఇదే

బొలెరో బ్యాడ్జింగ్‌తో మహీంద్రా టియువి300 టెస్టింగ్; అసలేం జరుగుతోంది..?

ఇది యూదృచ్చికంగా జరిగిందా లేక కంపెనీ మార్కెట్ కోసం ఏదైనా కొత్తగా ప్లాన్ చేస్తోందా అనేది తెలియాల్సి ఉంది. ఈ స్పై చిత్రాల ప్రకారం, మహీంద్రా తమ టియువి300 టెస్టింగ్ వాహనాన్ని తమిళనాడు రోడ్లపై పరీక్షిస్తుండటాన్ని మనం గమనించవచ్చు.

బొలెరో బ్యాడ్జింగ్‌తో మహీంద్రా టియువి300 టెస్టింగ్; అసలేం జరుగుతోంది..?

తాజాగా లీకైన ఈ స్పై చిత్రాల్లో కొత్త టియువి300లోని సరికొత్త ఫ్రంట్ అండ్ రియర్ డిజైన్‌ను చూడొచ్చు. వీటి ప్రకారం, కంపెనీ తమ టియువి300 యొక్క ఓవరాల్ సిల్హౌట్‌ను యాధాతథంగా ఉంచినట్లు తెలుస్తోంది. అయితే, ఇందులో మునుపటి కన్నా మరింత బోల్డ్‌గా కనిపించే ఫ్రంట్ గ్రిల్ మరియు మధ్యలో ఉంచిన మహీంద్రా లోగోతో ఇది కొత్త ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంది.

MOST READ:నిర్మానుష్య రోడ్డుపై వెళ్తున్నారా.. అయితే టేక్ కేర్.. ఎందుకో వీడియో చూడండి

బొలెరో బ్యాడ్జింగ్‌తో మహీంద్రా టియువి300 టెస్టింగ్; అసలేం జరుగుతోంది..?

ఇంకా ఇందులో వెర్టికల్ స్లాట్ గ్రిల్ క్రింది భాగంలో పెద్ద హనీకోంబ్ ప్యాటర్న్‌లో ఉన్న విశాలమైన ఎయిర్-ఇన్‌టేక్‌ను కూడా మనం గమనించవచ్చు. ఇతర డిజైన్ మార్పులలో ఇంటిగ్రేటెడ్ డిఆర్‌ఎల్‌ల పైభాగంలో అమర్చిన కొత్త హెడ్‌ల్యాంప్‌లు, రీడిజైన్ చేసిన బంపర్ మరియు ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ ఉన్నాయి.

బొలెరో బ్యాడ్జింగ్‌తో మహీంద్రా టియువి300 టెస్టింగ్; అసలేం జరుగుతోంది..?

అంతేకాకుండా, ఇందులోని రియర్ డిజైన్‌ను కూడా స్వల్పంగా రీడిజైన్ చేశారు. ఇందులో రీడిజైన్ చేయబడిన టెయిల్-ల్యాంప్స్, రియర్ బంపర్స్ మరియు బూట్ లిడ్ వంటి మార్పులను కూడా మనం గమనించవచ్చు. అయితే, దీని సైడ్ ప్రొఫైల్‌లో పెద్దగా మార్పులు ఏవీ లేవని తెలుస్తోంది.

MOST READ:అలెర్ట్.. 2021 జనవరి 1 నుంచి ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి

బొలెరో బ్యాడ్జింగ్‌తో మహీంద్రా టియువి300 టెస్టింగ్; అసలేం జరుగుతోంది..?

ఇందులో ఆల్‌రౌండ్ బాడీ క్లాడింగ్‌తో పాటు ఇదివరకటి అల్లాయ్-వీల్ డిజైన్‌నే కలిగి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ కారులోని ఇంటీరియర్స్‌కి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. అయితే, మహీంద్రా ఇందులో కూడా కొన్ని కీలకమైన అప్‌డేట్స్ చేసే అవకాశం ఉంది.

బొలెరో బ్యాడ్జింగ్‌తో మహీంద్రా టియువి300 టెస్టింగ్; అసలేం జరుగుతోంది..?

ఇంటీరియర్స్‌లో ఆశించే ఫీచర్లలో ప్రధానంగా, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే అధునాతన టచ్-స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సాఫ్ట్-టచ్ మెటీరియల్స్‌తో కూడిన కొత్త ఇంటీరియర్స్, కీలెస్ ఎంట్రీ, ఎత్తు-సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్ వంటి ఫీచర్లు ఉండొచ్చని సమాచారం.

MOST READ:ఒకటి, రెండు కాదు ఏకంగా 80 పోర్స్చే కార్లను కలిగి ఉన్న 80 ఏళ్ళ వ్యక్తి ; పూర్తి వివరాలు

బొలెరో బ్యాడ్జింగ్‌తో మహీంద్రా టియువి300 టెస్టింగ్; అసలేం జరుగుతోంది..?

ఇంజన్ పరంగా ఇందులో బిఎస్6 అప్‌గ్రేడ్ మినహా వేరే ఏ ఇతర మార్పు ఉండబోవని తెలుస్తోంది. బిఎస్4 టియువి300 మోడళ్లలో ఉపయోగించిన 1.5-లీటర్ త్రీ సిలిండర్ ఇంజన్‌నే కొత్తగా అప్‌గ్రేడ్ చేసి ఇందులో ఉపయోగించనున్నారు. ఈ బిఎస్4 ఇంజన్ 100 బిహెచ్‌పి పవర్‌ను మరియు 240 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

బొలెరో బ్యాడ్జింగ్‌తో మహీంద్రా టియువి300 టెస్టింగ్; అసలేం జరుగుతోంది..?

ఇది ఫైవ్-స్పీడ్ మాన్యువల్ లేదా ఫైవ్-స్పీడ్ ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. మహీంద్రా బిఎస్6 ఎస్‌యూవీలో కూడా ఇదే ఇంజన్ కొనసాగుతుందని తెలుస్తోంది. అయితే, ఇందులో కొత్త పెట్రోల్‌తో నడిచే ఆప్షన్‌ను కూడా అందించవచ్చని సమాచారం.

బొలెరో బ్యాడ్జింగ్‌తో మహీంద్రా టియువి300 టెస్టింగ్; అసలేం జరుగుతోంది..?

మహీంద్రా టియూవి300 భారత మార్కెట్లో ఫోర్డ్ ఎకోస్పోర్ట్, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్ హోండా డబ్ల్యుఆర్-వి, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా మరియు రాబోయే నిస్సాన్ మాగ్నైట్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. ఇది దాని ఏడు సీట్ల లేఅవుట్ కారణంగా మెరుగైన ప్రాక్టికాలిటీని ఆఫర్ చేస్తుంది.

Image Courtesy: Sridhar Sri/4x4 India

Most Read Articles

English summary
Mahindra TUV300 Spied Testing With Bolero Badge On The Boot Door Mounted Spare Wheel Cover. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X