గుడ్ న్యూస్: ఎక్స్‌యూవీ300 ధరలో రూ.72,000 కోత - వివరాలు

మహీంద్రా అందిస్తున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ300 ధరను కంపెనీ భారీగా తగ్గించింది. ఈ కాంపాక్ట్-ఎస్‌యూవీలో ఎంపిక చేసిన వేరియంట్లపై ధరలు తగ్గించబడ్డాయి. ఇంజన్ ఆప్షన్ మరియు వేరియంట్ లెవల్‌ను బట్టి ధరలు రూ.72,000 వరకు తగ్గాయి.

గుడ్ న్యూస్: ఎక్స్‌యూవీ300 ధరలో రూ.72,000 కోత - వివరాలు

ప్రస్తుతం మార్కెట్లో మహీంద్రా ఎక్స్‌యూవీ300 పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతోంది. తాజాగా పెట్రోల్ వేరియంట్ల ధరలు గరిష్టంగా రూ.72,000 రూపాయల వరకు తగ్గగా, డీజిల్ వేరియంట్ల ధరలు గరిష్టంగా రూ.39,000 రూపాయల వరకు తగ్గాయి. అయితే, వీటిలో కొన్ని డీజిల్ వేరియంట్ల ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి.

గుడ్ న్యూస్: ఎక్స్‌యూవీ300 ధరలో రూ.72,000 కోత - వివరాలు

తగ్గిన ధరలను గురించి వివరంగా చర్చించుకునే ముందు, ఇందులోని ఇంజన్ ఆప్షన్ల గురించి తెలుసుకుందా. మహీంద్రా ఎక్స్‌యూవీ300 ముందు చెప్పినట్లుగానే పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులోని 1.5-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్ 117 బిహెచ్‌పి శక్తిని మరియు 300 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో సిక్స్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మరియు ఆప్షనల్ ఏఎమ్‌టి గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

MOST READ:దుమ్మురేపుతున్న ఎంజి గ్లోస్టర్ ఎస్‌యూవీ ఫస్ట్ టీజర్

గుడ్ న్యూస్: ఎక్స్‌యూవీ300 ధరలో రూ.72,000 కోత - వివరాలు

ఇకపోతే, ఇందులోని 1.2-లీటర్, త్రీ సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 109 బిహెచ్‌పి శక్తిని మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పెట్రోల్ ఇంజన్ స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. ఈ రెండు ఇంజన్లను కూడా వివిధ రకాల వేరియంట్లలో ఆఫర్ చేయబడుతున్నాయి.

గుడ్ న్యూస్: ఎక్స్‌యూవీ300 ధరలో రూ.72,000 కోత - వివరాలు

ముందుగా పెట్రోల్ వేరియంట్స్ విషయానికి వస్తే, ఇవి డబ్ల్యూ4, డబ్ల్యూ6, డబ్ల్యూ8 మరియు డబ్ల్యూ8 (ఓ) లలో లభిస్తుంది. బేస్ వేరియంట్ డబ్ల్యూ4పై రూ.35,000, మిడ్ వేరియంట్ డబ్ల్యూ6పై రూ.17,000 ధరలు తగ్గుతాయి. ఇకపోతే టాప్ ఎండ్ వేరియంట్స్ డబ్ల్యూ8, డబ్ల్యూ8 (ఓ)లపై వరుసగా రూ.70,000, రూ.72,000 మేర ధరలు తగ్గుతాయి. తాజా తగ్గింపు తర్వాత పెట్రోల్ వేరియంట్లు ధరలు ఇప్పుడు రూ.7.95 లక్షల నుండి రూ.11.12 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి.

MOST READ:వర్షంలో ఒకే చోట 8 గంటలు నిలబడిన వృద్ధ మహిళ, ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

గుడ్ న్యూస్: ఎక్స్‌యూవీ300 ధరలో రూ.72,000 కోత - వివరాలు

ఇక డీజిల్ వేరియంట్స్ విషయానికి వస్తే, ఇవి ఏడు వేరియంట్లలో లభిస్తున్నాయి. ఇందులో మూడు ఆటోమేటిక్ వేరియంట్లు ఉన్నాయి. బేస్ వేరియంట్ డబ్ల్యూ4పై రూ.1,000, మిడ్-స్పెక్ డబ్ల్యూ6 మరియు డబ్ల్యూ6 ఏటి వేరియంట్లపై వరుసగా రూ.10,000, రూ.20,000 మేర ధరలు పెరిగాయి. ఈ మూడు వేరియంట్ల మినహా మిగిలిన అన్ని వేరియంట్ల ధరలు తగ్గాయి.

గుడ్ న్యూస్: ఎక్స్‌యూవీ300 ధరలో రూ.72,000 కోత - వివరాలు

డబ్ల్యూ8 డీజిల్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ వేరియంట్‌లపై ఇప్పుడు రూ.20,000 ధర తగ్గింపు లభిస్తుంది. టాప్-స్పెక్ డబ్ల్యూ8 (ఓ) మరియు డబ్ల్యూ8 (ఓ) ఏటి మోడళ్లపై రూ.39,000 తగ్గింపు లభిస్తుంది.

MOST READ:డీజిల్ కార్ అమ్మకాలకు శాపంగా మారిన బిఎస్ 6 రూల్స్, ఎందుకంటే ?

గుడ్ న్యూస్: ఎక్స్‌యూవీ300 ధరలో రూ.72,000 కోత - వివరాలు

తాజా ధరల మార్పు తరువాత, మాన్యువల్ ట్రాన్స్మిషన్ కలిగిన ఎక్స్‌యూవీ300 డీజిల్ వేరియంట్ల ధరలు రూ.8.70 లక్షల నుండి 11.75 లక్షల మధ్యలో ఉన్నాయి. మరోవైపు, డీజిల్ ఆటోమేటిక్ బేస్ వేరియంట్ ధర రూ.9.70 లక్షలుగా ఉండే టాప్-ఎండ్ వేరియంట్ రూ.12.30 లక్షలుగా ఉంది (పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

గుడ్ న్యూస్: ఎక్స్‌యూవీ300 ధరలో రూ.72,000 కోత - వివరాలు

మహీంద్రా ఎక్స్‌యూవీ300కి సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, కంపెనీ ఇందులో ఓ సరికొత్త స్పోర్ట్జ్ వేరియంట్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో బ్రాండ్ ఎమ్‌స్టాలియన్ టిజిడి టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం. దీని ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్లలో కూడా స్వల్ప మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ:జూలై నెలలో కొత్త రికార్డు సృష్టించిన ఫాస్ట్ ట్యాగ్ ట్రాన్సక్షన్స్ , ఎంతో తెలుసా ?

గుడ్ న్యూస్: ఎక్స్‌యూవీ300 ధరలో రూ.72,000 కోత - వివరాలు

మహీంద్రా ఎక్స్‌యూవీ300 ధర తగ్గింపుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మహీంద్రా అభిమానులకు నిజంగా ఇది శుభవార్తనే చెప్పాలి. చూడటానికి ఎంతో క్యూట్‌గా అంతే స్టయిలిష్‌గా కనిపించే ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ300, తాజా ధర తగ్గింపు తర్వాత ఇప్పుడు ఈ సెగ్మెంట్లో అత్యంత సరమైన మోడళ్లలో ఒకటిగా నిలుస్తుంది. మరీ ముఖ్యంగా పెట్రోల్ వేరియంట్‌ను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు దీని ధర అందుబాటులో ఉంటుంది.

Most Read Articles

English summary
Mahindra recently announced a price decrease on the XUV300 in the Indian market. Prices have been reduced across select variants of the compact-SUV. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X