గ్లోబల్ ఎన్‌సిఎపి సేఫ్టీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన మహీంద్రా ఎక్స్‌యువి 300

దేశీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన వాహన తయారీదారు మహీంద్రా & మహీంద్రా తమ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎక్స్‌యువి 300 గ్లోబల్ ఎన్‌సిఎపి యొక్క సేఫ్టీ ర్యాంకింగ్స్‌లో ఆరు సంవత్సరాలుగా అగ్ర స్థానంలో నిలిచిందని సగర్వంగా ప్రకటించింది. 2014 మరియు 2020 మధ్య గ్లోబల్ ఎన్‌సిఎపి పరీక్షించిన అన్ని వాహనాల్లో మహీంద్రా ఎక్స్‌యువి 300 సురక్షితమైన 'మేడ్-ఇన్-ఇండియా' కారుగా కీర్తి పొందింది.

గ్లోబల్ ఎన్‌సిఎపి సేఫ్టీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన మహీంద్రా ఎక్స్‌యువి 300

గ్లోబల్ ఎన్‌సిఎపి యొక్క టెస్టింగ్ ప్రకారం గత ఆరు సంవత్సరాల్లో పరీక్షించిన మొత్తం 38 వాహనాల మధ్య మహీంద్రా ఎక్స్‌యువి 300 అత్యధిక కంబైన్డ్ ఆక్యుపెంట్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. మహీంద్రా ఎక్స్‌యువి 300 వయోజన (అడల్ట్) ఆక్యుపెన్సీకి ఫైవ్ స్టార్ రేటింగ్ మరియు చైల్డ్ ఆక్యుపెన్సీకి ఫోర్-స్టార్ రేటింగ్‌ను పొందింది.

గ్లోబల్ ఎన్‌సిఎపి సేఫ్టీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన మహీంద్రా ఎక్స్‌యువి 300

మహీంద్రా ఎక్స్‌యువి 300 కాంపాక్ట్-ఎస్‌యూవీ యొక్క అన్ని వేరియంట్లలో ప్రామాణికమైన సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటాయి. ఇందులో 7-ఎయిర్‌బ్యాగులు, 4-చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, హీటెడ్ ORVM లు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు వంటివి ఇందులో ఉన్నాయి.

MOST READ:లాక్‌డౌన్‌లో తండ్రికి కారు గిఫ్ట్ గా ఇచ్చిన కొడుకు [వీడియో]

గ్లోబల్ ఎన్‌సిఎపి సేఫ్టీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన మహీంద్రా ఎక్స్‌యువి 300

మహీంద్రా ఎక్స్‌యువి 300 ను ఈ ఏడాది ప్రారంభంలో జర్మనీలో గ్లోబల్ ఎన్‌సిఎపి అధికారికంగా పరీక్షించింది. భారతదేశంలో జిఎన్‌సిఎపి చేత ‘సేఫ్ ఛాయిస్ అవార్డు' అందుకున్న ఏకైక తయారీదారు ఈ మహీంద్రా.

గ్లోబల్ ఎన్‌సిఎపి సేఫ్టీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన మహీంద్రా ఎక్స్‌యువి 300

మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఆటోమోటివ్ డివిజన్ సిఇఒ వీజయ్ నక్రా మాట్లాడుతూ,

ఇది మహీంద్రా సంస్థ గర్వించదగ్గ విషయం, ఈ సంవత్సరం ప్రారంభంలో ఎక్స్‌యువి 300 ను భారతదేశంలో అత్యంత సురక్షితమైన వాహనంగా జిఎన్‌సిఎపి రేట్ చేసింది. అది మాత్రమే కాకుండా ఇప్పుడు ఇది గత 6 సంవత్సరాలుగా సురక్షితమైన వాహనంగా గుర్తించబడింది. ఈ విధమైన ర్యాంకింగ్ వల్ల స్వదేశీ బ్రాండ్ మరింత ముందడుగు వేస్తుంది.

MOST READ:ఒకే ఫ్యామిలీ నాలుగు తరాలుగా ఉపయోగిస్తున్న సైకిల్

గ్లోబల్ ఎన్‌సిఎపి సేఫ్టీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన మహీంద్రా ఎక్స్‌యువి 300

భారత మార్కెట్లో మహీంద్రా ఎక్స్‌యూవీ 300 అత్యంత పోటీతత్వ సబ్-4 మీటర్ల కాంపాక్ట్-ఎస్‌యూవీ విభాగంలో ఉంది. ఎక్స్‌యూవీ 300, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, టాటా నెక్సాన్ మరియు త్వరలో ప్రారంభించబోయే కియా సోనెట్ వంటి వాటిని ప్రత్యర్థిగా ఉంటుంది.

గ్లోబల్ ఎన్‌సిఎపి సేఫ్టీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన మహీంద్రా ఎక్స్‌యువి 300

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం :

చైల్డ్ ఆక్యుపెన్సీలో ఫోర్ స్టార్ రేటింగ్ పొందిన మొట్టమొదటి ‘మేడ్-ఇన్-ఇండియా' వాహనం మహీంద్రా ఎక్స్‌యూవీ 300. ఇది పెట్రోల్ మరియు డీజిల్ రెండు వేరియంట్లలోనూ అందించే ఎక్స్‌యూవీ 300 గొప్ప సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 300 భారత మార్కెట్లో అత్యంత ఆకర్షణీయమైన వాహనంగా నిలిచింది. ఇది చాలా సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

MOST READ:స్క్రాప్ మెటీరియల్‌తో‌ లైట్ వెయిట్ బైక్ తయారు చేసిన 9 ఏళ్ల బాలుడు

Most Read Articles

English summary
Mahindra XUV300 Tops Global NCAP Safety Rankings. Read in Telugu.
Story first published: Wednesday, July 15, 2020, 13:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X