మహీంద్రా ఎక్స్‌యూవీ300 స్పోర్ట్ వేరియంట్: విడుదల ఎప్పుడంటే!

మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త ఎక్స్‌యూవీ300 స్పోర్ట్ వేరియంట్ ఎస్‌యూవీని 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. అతి త్వరలో ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేయనున్న ఎక్స్‌యూవీ300 స్పోర్ట్ వేరియంట్ గురించి పూర్తి వివరాలు..

మహీంద్రా ఎక్స్‌యూవీ300 స్పోర్ట్ వేరియంట్: విడుదల ఎప్పుడంటే!

మహీంద్రా ఎక్స్‌యూవీ300 కాంపాక్ట్ ఎస్‍‌యూవీని ఇది వరకే మార్కెట్లోకి లాంచ్ చేసి మంచి సక్సెస్ అందుకుంది. అయితే, ఇప్పుడు స్పోర్ట్ అనే ప్రత్యేక వేరియంట్ కోసం బీఎస్6 ప్రమాణాలను పాటించే 1.2-లీటర్ మూడు సిలిండర్ల టుర్బో-పెట్రోల్ జీడీఐ ఇంజన్‌ను ప్రవేశపెట్టింది. దీనిని కంపెనీ యొక్క mStallion ఇంజన్ ఫ్యామిలీలో భాగంగా అభివృద్ది చేశారు.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 స్పోర్ట్ వేరియంట్: విడుదల ఎప్పుడంటే!

సరికొత్త 1.2-లీటర్ ఎమ్‌స్టాలియన్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 128బిహెచ్‌పి పవర్ మరియు 230ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రస్తుతం మహీంద్రా ఎక్స్‌యూవీ300లోని బీఎస్-6 పెట్రోల్ ఇంజన్ కంటే ఇది అత్యంత శక్తివంతమైనది, ఈ వేరియంట్‌ను 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 స్పోర్ట్ వేరియంట్: విడుదల ఎప్పుడంటే!

మహీంద్రా 1.2-లీటర్ టీ-జీడీఐ పెట్రోల్ ఇంజన్‌ను మహీంద్రా గత ఏడాదే రివీల్ చేసింది. బీఎస్6 ప్రమాణాలను పాటించే ఇంజన్ ఆప్షన్లను పరిచయం చేసినప్పుడే ఈ సరికొత్త 1.2-లీటర్ టీ-జీడీఐ ఇంజన్‌ను ఆవిష్కరించింది. మహీంద్రా-ఫోర్డ్ భాగస్వామ్యం ద్వారా ఫోర్డ్ ఇకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో కూడా ఈ ఇంజన్‌ను వినియోగించనున్నారు.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 స్పోర్ట్ వేరియంట్: విడుదల ఎప్పుడంటే!

మహీంద్రా ఎక్స్‌యూవీ300 స్పోర్ట్ వేరియంట్ విషయానికి వస్తే, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రెగ్యులర్ ఎక్స్‌యూవీ300తో పోలిస్తే ఎక్ట్సీరియర్‌లో పలు మార్పులు జరిగాయి. స్పోర్ట్ (Sportz) అనే పేరును డోర్లు మరియు బాడీ గ్రాఫిక్స్ మీద అందివ్వడంతో పాటు రెడ్ కలర్ ఫినిషింగ్ గల ఫ్రంట్ బ్రేక్ కాలిపర్లు కూడా వచ్చాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 స్పోర్ట్ వేరియంట్: విడుదల ఎప్పుడంటే!

మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఇంటీరియర్‌లో రెడ్ కలర్ హైలెట్స్ వచ్చాయి. స్టీరింగ్ వీల్, డ్యాష్ బోర్డు మీద రెడ్ కలర్ మేళవింపులతో పాటు ఎరుపు దారంతో కుట్టిన సీట్లు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 స్పోర్ట్ వేరియంట్: విడుదల ఎప్పుడంటే!

సరికొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ3 టీ-జీడీఐ మోడల్‌ ప్రొడక్షన్ అతి త్వరలో ప్రారంభించనున్నారు. 1.2-లీటర్ పెట్రోల్ ఎమ్‌స్టాలియన్ ఇంజన్ వేరియంట్ పూర్తి స్థాయిలో లాంచ్ అయితే, కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఇది అత్యంత శక్తివంతమైన మోడల్‌గా నిలవనుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 స్పోర్ట్ వేరియంట్: విడుదల ఎప్పుడంటే!

మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఎస్‌యూవీ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మారుతి వితారా బ్రిజా మరియు ఫోర్డ్ ఇకోస్పోర్ట్ మోడళ్లతో పోటీపడుతోంది. వీటితో పాటు ఫ్యూచర్‌లో విడుదల కానున్న వోక్స్‌వ్యాగన్ టిగువాన్, కియా సోనెట్ మరియు విజన్ ఇన్ కాన్సెప్ట్ ఆధారంగా వస్తోన్న స్కోడా ఎస్‌యూవీలకు ధీటైన పోటీనివ్వనుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 స్పోర్ట్ వేరియంట్: విడుదల ఎప్పుడంటే!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

లేటెస్ట్ అప్‌డేట్స్ అందివ్వడంలో మహీంద్రా ఎప్పుడూ ముందుంటుంది, దీంతో పాటు ఇతర మోడళ్లతో పోలిస్తే వైవిధ్యాన్ని చాటుకునేందుకు కొత్తకొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది. ఇందుకు నిదర్శనమే ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ300 స్పోర్ట్. ధర కనుక అత్యంత పోటీతత్వంతో నిర్ణయిస్తే, ఈ మోడల్‌కు మార్కెట్లో తిరుగుండదనే చెప్పాలి. మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగు చూస్తూ ఉండండి...

Most Read Articles

English summary
Mahindra XUV300 Sportz Variant To Feature New 1.2-Litre mStallion Petrol Engine. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X