మహీంద్రా ఎక్స్‌యూవీ300లో టర్బో వేరియంట్ వస్తుందా? - టెస్టింగ్ చిత్రాలు, వివరాలు

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఈ ఏడాది ఆరంభంలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో ఎక్స్‌యువీ300 స్పోర్ట్జ్ వేరియంట్‌ను సరికొత్త బిఎస్6 కంప్లైంట్ 1.2 లీటర్, త్రీ-సిలిండర్, టర్బో-పెట్రోల్ జిడిఐ ఇంజన్‌తో ప్రదర్శించిన సంగతి తెవిసినదే. కాకపోతే, ఈ మోడల్ ఇంకా మార్కెట్లో విడుదల కాలేదు.

మహీంద్రా ఎక్స్‌యూవీ300లో టర్బో వేరియంట్ వస్తుందా? - టెస్టింగ్ చిత్రాలు, వివరాలు

ఈ నేపథ్యంలో, మహీంద్రా ఈ కొత్త వేరియంట్‌ను వీలైనంత త్వరగా మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే, కొత్త ఎక్స్‌యువీ300 టి-జిడిఐ టర్బో పెట్రోల్ వేరియంట్‌ను మహీంద్రా బెంగుళూరు శివార్లలో వ్రాప్ లేకుండా టెస్ట్ చేస్తుండగా డ్రైవ్‌స్పార్క్ బృందం తమ కెమెరాలో బంధించింది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300లో టర్బో వేరియంట్ వస్తుందా? - టెస్టింగ్ చిత్రాలు, వివరాలు

ఇదే సమయంలో మహీంద్రా తమ కొత్త ఎక్స్‌యూవీ500 మోడల్‌ను కూడా టెస్ట్ చేస్తున్నట్లు మా రిపోర్టర్ గుర్తించాడు, కానీ దురదృష్టవశాత్తు, అతను దాని ఫోటోను తీయలేకపోయాడు. ఇక ఎక్స్‌యువీ300లో ఉపయోగించిన ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో 1.2-లీటర్ ఎమ్‌స్టాలియన్ టర్బో యూనిట్‌ను అమర్చారు. ఈ ఇంజన్ గరిష్టంగా 128 బిహెచ్‌పి శక్తిని మరియు 230 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని సమాచారం.

MOST READ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త టూరిస్ట్ పర్మిట్ రూల్స్, ఏంటో తెలుసా ?

మహీంద్రా ఎక్స్‌యూవీ300లో టర్బో వేరియంట్ వస్తుందా? - టెస్టింగ్ చిత్రాలు, వివరాలు

ఈ కొత్త టర్బో ఇంజన్ పవర్, ప్రస్తుతం ఎక్స్‌యువీ300 బిఎస్6 కంప్లైంట్ పెట్రోల్ ఇంజన్ ఉత్పత్తి చేసే శక్తి కంటే అధికం. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కొత్త టర్బో ఇంజన్‌తో ఎక్స్‌యువీ300 ఈ సెగ్మెంట్లో కెల్లా అత్యంత శక్తివంతమైన మోడల్‌గా నిలుస్తుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300లో టర్బో వేరియంట్ వస్తుందా? - టెస్టింగ్ చిత్రాలు, వివరాలు

ఎక్స్‌టీరియర్ డిజైన్‌ను గమనిస్తే, ఇది స్పోర్టీ వేరియంట్ కాబట్టి, ఇందులో కొద్దిపాటి కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ ఉండే అవకాశం ఉంది. ఇందులో కొత్త బంపర్స్, విభిన్న డిజైన్ కలిగిన అల్లాయ్ వీల్స్, సీట్లపై కాంట్రాస్ట్ స్టిచింగ్ మరియు స్పోర్టీ గ్రాఫిక్స్ ఉండొచ్చని అంచనా.

MOST READ: త్వరపడండి, ఈ కార్ ఆక్సెసరీస్ కేవలం రూ. 1000 మాత్రమే

మహీంద్రా ఎక్స్‌యూవీ300లో టర్బో వేరియంట్ వస్తుందా? - టెస్టింగ్ చిత్రాలు, వివరాలు

మరోవైపు, మహీంద్రా అభివృద్ధి చేస్తున్న రెండవ తరం మహీంద్రా ఎక్స్‌యూవీ500 సరికొత్త మోనోకోక్ ప్లాట్‌ఫామ్‌తో వస్తుంది మరియు దాని డిజైన్, స్టైలింగ్‌లో గణనీయమైన మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. ఇంజన్ అప్‌గ్రేడ్స్‌తో పాటుగా మరిన్ని అధునాత ఫీచర్లతో ఇది లభ్యమయ్యే అవకాశం ఉంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300లో టర్బో వేరియంట్ వస్తుందా? - టెస్టింగ్ చిత్రాలు, వివరాలు

ఇందులోని ఇంజన్ విషయానికి వస్తే, కొత్త 2021 ఎక్స్‌యూవీ500 కారులో మహీంద్రా కొత్త 2.0-లీటర్ ఎమ్‌స్టాలియన్ టర్బో-పెట్రోల్ ఇంజన్ మరియు 2.2-లీటర్ డీజిల్ యూనిట్‌ను ఉపయోగించవచ్చని తెలుస్తోంది. ఈ రెండు ఇంజన్లు మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభించే అవకాశం ఉంది.

MOST READ: మారుతి వితారా బ్రెజ్జాలో మరో కొత్త ఫీచర్, ఏంటో తెలుసా ?

మహీంద్రా ఎక్స్‌యూవీ300లో టర్బో వేరియంట్ వస్తుందా? - టెస్టింగ్ చిత్రాలు, వివరాలు

ఇక మహీంద్రాకు సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, మహీంద్రా నుంచి ఈ ఏడాది మార్కెట్లో రానున్న మరో సరికొత్త ఉత్పత్తి కొత్త 2020 మహీంద్రా థార్. అధునాత డిజైన్, ఫీచర్లతో రానున్న ఈ మోడల్ ఆప్షనల్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడా లభించవచ్చని సమాచారం. వచ్చే సెప్టెంబర్ నెలలో కొత్త తరం మహీంద్రా థార్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి ఇదివరకే మార్కెట్లో విడుదల కావల్సిన ఈ మోడల్, ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న కరోనా మహమ్మారి కారణంగా మరింత ఆలస్యమైంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300లో టర్బో వేరియంట్ వస్తుందా? - టెస్టింగ్ చిత్రాలు, వివరాలు

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త 2020 మహీంద్రా థార్‌లో 2.2 లీటర్ టర్బో డీజిల్ యూనిట్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ పవర్ వివరాలు తెలియాల్సి ఉంది. మహీంద్రా తొలిసారిగా ఈ మోడల్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శినకు ఉంచింది. ఇందులో కొత్త 2.0-లీటర్ ‘టిజిడి ఎమ్‌స్టాలియన్' టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను కూడా ఆఫర్ చేయవచ్చని తెలుస్తోంది. ఈ రెండు ఇంజన్లు స్టాండర్డ్ సిక్స్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభ్యం కానున్నట్లు సమాచారం.

MOST READ: కోవిడ్ - 19 నిబంధనలు ఉల్లంఘించినందుకు నోయిడాలో ఏంజరిగిందో తెలుసా ?

మహీంద్రా ఎక్స్‌యూవీ300లో టర్బో వేరియంట్ వస్తుందా? - టెస్టింగ్ చిత్రాలు, వివరాలు

మహీంద్రా ఎక్స్‌యూవీ300 టి-జిడిఐ టర్బో వేరియంట్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మేము పైన చెప్పినట్లుగానే, ఎక్స్‌యూవీ300 టి-జిడిఐ టర్బో పెట్రోల్ ఇంజన్ ఈ విభాగంలోనే అత్యంత శక్తివంతమైన కాంపాక్ట్ ఎస్‌యూవీగా ఉంటుంది. మార్కెట్లో విడుదలైన తర్వాత, కొత్త ఎక్స్‌యూవీ300 టి-జిడిఐ ఈ సెగ్మెంట్లోని హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మారుతి విటారా బ్రెజ్జా మరియు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Mahindra had showcased the XUV300 Sportz variant at the 2020 Auto Expo with an all-new BS6-compliant 1.2-litre, three-cylinder, turbo-petrol GDI engine. However, we spotted the XUV300 T-GDI testing without wraps on the outskirts of Bangalore. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X