లీక్ అయిన మహీంద్రా ఎక్స్‌యూవీ 500 బిఎస్-6 మోడల్ స్పెసిఫికేషన్స్!

మహీంద్రా బ్రాండ్ లో అప్‌డేట్ చేసిన ఎక్స్‌యూవీ 500 వెర్షన్‌ త్వరలో విడుదల కానుంది. బిఎస్-VI కంప్లైంట్ మహీంద్రా ఎక్స్‌యూవీ 500 యొక్క ఫీచర్స్ మరియు ఇది విక్రయించబడే గ్రేడ్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం!

లీక్ అయిన మహీంద్రా ఎక్స్‌యూవీ 500 బిఎస్-6 మోడల్ స్పెసిఫికేషన్స్

మహీంద్రా సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేయడానికి ముందే రాబోయే ఎక్స్‌యువి 500 బిఎస్ 6 మోడల్ యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. టైప్ అప్రూవల్ సర్టిఫికేట్ ఎక్స్‌యువి 500 యొక్క W5, W7, W9 మరియు W11 ట్రిమ్‌లు నిర్ధారించబడిందని వెల్లడించింది.

లీక్ అయిన మహీంద్రా ఎక్స్‌యూవీ 500 బిఎస్-6 మోడల్ స్పెసిఫికేషన్స్

ఇండియన్ ఆటోస్ బ్లాగ్ ప్రకారం, మహీంద్రా ఎక్స్‌యువి 500 బిఎస్ 6 యొక్క బాహ్య కొలతలు ఈ విధంగా ఉంటాయి. వాహనం పొడవు 4,585 మిమీ, వెడల్పు 1,890 మిమీ, మరియు ఎత్తు 1,785 మిమీ కలిగి ఉంటుంది.

లీక్ అయిన మహీంద్రా ఎక్స్‌యూవీ 500 బిఎస్-6 మోడల్ స్పెసిఫికేషన్స్

మహీంద్రా ఎక్స్‌యువి 500 బిఎస్ 6 మోడల్ యొక్క ఇంటీరియర్‌లకు ఏ చిన్న నవీకరణలు ఉండవని తెలుస్తుంది. కానీ ఇందులోని డాష్‌బోర్డ్‌ లెదర్, బ్రషెడ్ మెటల్ మరియు పియానో బ్లాక్ ఎలిమెంట్స్ కలిగి ఉండటమే కాకుండా, 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ని కూడా కలిగి ఉంటుంది.

లీక్ అయిన మహీంద్రా ఎక్స్‌యూవీ 500 బిఎస్-6 మోడల్ స్పెసిఫికేషన్స్

ఎక్స్‌యూవీ 500 బిఎస్-6 స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీ వంటి ఫీచర్స్ ని కూడా కలిగి ఉంటుంది. భద్రతా లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సరైన నియంత్రణతో పాటు, నాలుగు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, అత్యవసర కాల్ ఫంక్షన్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటాయి.

లీక్ అయిన మహీంద్రా ఎక్స్‌యూవీ 500 బిఎస్-6 మోడల్ స్పెసిఫికేషన్స్

మహీంద్రా ఎక్స్‌యూవీ 500, 2.2 లీటర్ mHawk 155 డీజిల్ ఇంజన్ ద్వారా 153 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. టార్క్ గురించి సరైన వివరాలు తెలియనప్పటికీ ఇంజిన్ 360 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుందని అంచనా.

లీక్ అయిన మహీంద్రా ఎక్స్‌యూవీ 500 బిఎస్-6 మోడల్ స్పెసిఫికేషన్స్

ఇంజిన్ ఆరు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కి జతచేయబడి ఉంటుంది. అయితే, భవిష్యత్తులో మహీంద్రా ఎక్స్‌యూవీ 500 బిఎస్-6 కోసం ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ను అందించే అవకాశం ఉంది. ప్రస్తుత తరం ఎక్స్‌యూవీ 500 ధర రూ.12.31 లక్షల నుంచి రూ. 19.74 లక్షల మధ్య ఉంది. రాబోయే బిఎస్ 6 మోడల్స్ సుమారు రూ. 30,000 నుంచి రూ. 50 వేల ప్రీమియం తీసుకుంటుందని తెలుస్తుంది. పేర్కొన్న ధరలు ఎక్స్-షోరూమ్ ఆధారంగా ప్రకటించినవే.

Read More:ఇప్పుడే చూడండి...స్పాట్ టెస్ట్ లో కనిపించిన ఫోర్స్ ట్రాక్స్ టూఫాన్ బిఎస్ 6 మోడల్

లీక్ అయిన మహీంద్రా ఎక్స్‌యూవీ 500 బిఎస్-6 మోడల్ స్పెసిఫికేషన్స్

సంబంధిత వార్తల ప్రకారం మహీంద్రా మరాజో బిఎస్-6 మోడల్ యొక్క ఫీచర్స్ కూడా లీక్ అయ్యాయి. టైప్ అప్రూవల్ అప్రూవల్ సర్టిఫికేట్ మరాజ్జో దాని ఎమ్ 2, ఎమ్ 4 + మరియు ఎమ్ 6 + ఫార్మాట్లలో మాత్రమే లభిస్తుందని వెల్లడించింది. మరాజో యొక్క ధరలు, ఇంజిన్ వివరాలు మొదలైనవన్నీ విడుదలకి ముందే లీక్ అయ్యాయి.

Read More:ALERT: హ్యుందాయ్ ఆరా మీద బుకింగ్స్ ప్రారంభం.. త్వరపడండి!

లీక్ అయిన మహీంద్రా ఎక్స్‌యూవీ 500 బిఎస్-6 మోడల్ స్పెసిఫికేషన్స్

మహీంద్రా ఎక్స్‌యూవీ 500 స్పెసిఫికేషన్ల గురించి ఆలోచనలు:

మహీంద్రా సంస్థ అధికారిక ప్రకటన ఇవ్వకముందే ఎక్స్‌యువి 500 కి సంబంధించి కొన్ని వివరాలు మనకు లీక్ అయ్యాయి. ఇది ఇండియాలో లాంచ్ చేయడానికి ముందే దాని ధరలు ఎక్స్ షోరూమ్ ఆధారంగా నిర్దారించడం జరిగింది. లీక్ అయిన వివరాలు ప్రకారం దాని ఉత్పత్తికి సంబంధించి, ఇంజిన్ పనితీరు మొదలైనవి మనకు తెలుస్తాయి.

Source: Indianautosblog

Most Read Articles

English summary
Mahindra XUV500 BS6 Model Specifications Leaked Ahead Of Launch-Read in Telugu
Story first published: Monday, January 6, 2020, 11:31 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X