మారుతి ఇగ్నిస్ బీఎస్6 లాంచ్: ధర, ఫీచర్లు, మైలేజ్ మరియు ప్రత్యేకతలు!

మారుతి సుజుకి మార్కెట్లో సరికొత్త బీఎస్6 వెర్షన్ మారుతి ఇగ్నిస్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారును లాంచ్ చేసింది. సరికొత్త మారుతి సుజుకి ఇగ్నిస్ బీఎస్6 ఫేస్‌లిఫ్ట్ మోడల్ ప్రారంభ ధర రూ. 4.83 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నట్లు ప్రకటించారు.

సరికొత్త మారుతి ఇగ్నిస్‌లో ఎన్నో రకాల అప్‌డేట్స్, నూతన ఫీచర్లు మరియు ఎక్ట్సీరియర్ డిజైన్ పరంగా కూడా పలు మార్పులు చోటు చేసుకున్నాయి.

మారుతి ఇగ్నిస్ బీఎస్6 లాంచ్: ధర, ఫీచర్లు, మైలేజ్ మరియు ప్రత్యేకతలు!

బీఎస్6 వెర్షన్ మారుతి ఇగ్నిస్ ధరలు వివిధ వేరియంట్ ఆధారంగా రూ. 4,000 నుండి రూ. 25,000 వరకూ పెరిగాయి. న్యూ మారుతి ఇగ్నిస్ సిగ్మా, డెల్టా, జెటా మరియు ఆల్ఫా అనే నాలుగు వేరియంట్లలో లభిస్తోంది. ఇగ్నిస్ వేరియంట్ సిగ్మా మీద రూ. 9,000 ధర పెరిగింది.

మారుతి ఇగ్నిస్ బీఎస్6 లాంచ్: ధర, ఫీచర్లు, మైలేజ్ మరియు ప్రత్యేకతలు!

మారుతి ఇగ్నిస్ మిడ్-వేరియంట్ డెల్టా లోని మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ రెండింటి మీద రూ. 25,000 ధర పెరిగింది, జెటా వేరియంట్ మీద రూ. 4,000 అదే విధంగా టాప్ ఎండ్ వేరియంట్ ఆల్ఫా మీద రూ. 4,000 వరకూ ధర పెరిగింది. దీంతో మారుతి ఇగ్నిస్ హైఎండ్ వేరియంట్ గరిష్ట ధర రూ. 7.14 లక్షలుగా ఉంది. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

మారుతి ఇగ్నిస్ బీఎస్6 లాంచ్: ధర, ఫీచర్లు, మైలేజ్ మరియు ప్రత్యేకతలు!

మారుతి ఇగ్నిస్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఇటీవల ఢిల్లీ వేదికగా జరిగిన 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. మునుపటి ఇగ్నిస్‌తో పోల్చుకుంటే ఫీచర్లు, డిజైన్, ఎక్ట్సీరియర్ స్టైలింగ్ ఎలిమెంట్స్ పరంగా ఎన్నో మార్పు జరిగాయి. పలు చోట్ల క్రోమ్ హైలెట్స్, ముందు మరియు వెనుక వైపున అప్‌డేటెడ్ బంపర్లు మరియు స్కఫ్ ప్లేట్ కూడా కలదు.

మారుతి ఇగ్నిస్ బీఎస్6 లాంచ్: ధర, ఫీచర్లు, మైలేజ్ మరియు ప్రత్యేకతలు!

కేవలం మిడ్ అండ్ టాప్ వేరియంట్లకు మాత్రమే పరిమితమైన రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్, రూఫ్ రెయిల్స్ మరియు కారు చుట్టూ బాడీ అంచుల వద్ద వచ్చే క్లాడింగ్ ఇప్పుడు డెల్టా వేరియంట్లో కూడా అందించారు.

మారుతి ఇగ్నిస్ బీఎస్6 లాంచ్: ధర, ఫీచర్లు, మైలేజ్ మరియు ప్రత్యేకతలు!

మారుతి ఇగ్నిస్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేసే అత్యాధునిక స్మార్ట్ ప్లే స్టూడియో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వచ్చింది.

మారుతి ఇగ్నిస్ బీఎస్6 లాంచ్: ధర, ఫీచర్లు, మైలేజ్ మరియు ప్రత్యేకతలు!

అతి ముఖ్యమైన అంశం ఇంజన్, మారుతి ఇగ్నిస్ బీఎస్6 వెర్షన్ కారులో మునుపట బీఎస్4 ఇంజన్ స్థానంలో బీఎస్6 ప్రమాణాలను పాటించే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ అందించారు. 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభించే ఇది గరిష్టంగా 83బిహెచ్‌పి పవర్ మరియు 113ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మారుతి ఇగ్నిస్ బీఎస్6 లాంచ్: ధర, ఫీచర్లు, మైలేజ్ మరియు ప్రత్యేకతలు!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డిజైన్ పరంగా మారుతి ఇగ్నిస్ హ్యాచ్‌బ్యాక్ వర్గానికి చెందిన కారే, అయితే న్యూ స్టైలింగ్ లుక్స్ మరియు అత్యాధునిక ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ ఫీచర్లతో సాధారణ హ్యాచ్‌బ్యాక్ కార్ల కంటే కాస్త పైస్థానంలో నిలిచింది. మారుతి ఇగ్నిస్ ఫేస్‌లిఫ్ట్ మారుతి సుజుకి నెక్సా షోరూముల్లో మాత్రమే లభిస్తోంది. వ్యాగన్ఆర్ మరియు స్విఫ్ట్ తరగహాలో ఆశించిన సేల్స్ సాధించకపోయినా.. సంతృప్తికర ఫలితాన్నిస్తోంది.

Most Read Articles

English summary
New Maruti Ignis BS6 Facelift Launched In India At Rs 4.83 Lakh: Prices Hiked By Up To Rs 25,000. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X