మారుతి సుజుకి కస్టమర్ల కోసం అద్భుతమైన ఆన్‌లైన్ ఫీచర్

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా తమ ఆన్‌లైన్ కార్ ఫైనాన్సింగ్ ప్లాట్‌ఫామ్ అయిన 'స్మార్ట్ ఫైనాన్స్'ను ప్రారంభించినట్లు ప్రకటించింది. కంపెనీ ఈ సేవలను ముందుగా దేశంలోని 30 ప్రధాన నగరాల్లో తమ ప్రీమియం కార్ రిటైల్ ప్లాట్‌ఫామ్ నెక్సా ద్వారా ప్రారంభించింది.

మారుతి సుజుకి కస్టమర్ల కోసం అద్భుతమైన ఆన్‌లైన్ ఫీచర్

తదుపరి దశలో ఈ ఆన్‌లైన్ ఆర్థిక సేవలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి-మార్చ్) నాటికి జీతం సంపాధించే ప్రతి కస్టమర్‌ను దృష్టిలో ఉంచుకొని తమ మాస్ మార్కెట్ ప్లాట్‌ఫామ్ అయిన మారుతి సుజుకి అరేనా రిటైల్ ప్లాట్‌ఫామ్‌కు కూడా వర్తింపచేయనున్నట్లు తెలిపింది.

మారుతి సుజుకి కస్టమర్ల కోసం అద్భుతమైన ఆన్‌లైన్ ఫీచర్

ఈ ఫైనాన్స్ సదుపాయానికి సంబంధించి మారుతి సుజుకి ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం, ఈ ఆన్‌లైన్ స్మార్ట్ ఫైనాన్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా, కస్టమర్లు షోరూమ్‌లను సందర్శించాల్సిన అసరం లేకుండానే రుణం తీసుకోవటానికి సంబంధించిన పూర్తి ప్రక్రియను ఆన్‌లైన్ ద్వారానే చేయవచ్చు.

MOST READ:భారత నావీలో మరో బ్రహ్మాస్త్రం.. శత్రువుల గుండెల్లో గుబేల్..

మారుతి సుజుకి కస్టమర్ల కోసం అద్భుతమైన ఆన్‌లైన్ ఫీచర్

ఉపయోగించడం చాలా సులభం

మారుతి సుజుకి స్మార్ట్ ఫైనాన్స్‌ను ఉపయోగించడానికి చాలా సులభమైన ఇంటర్‌ఫేస్ ఉంటుంది. ఈఎమ్ఐని లెక్కించడం మరియు దానిని కస్టమర్లకు నచ్చినట్లుగా మార్పులు చేసుకోవటం, ప్రత్యేకమైన ఆఫర్ల గురించి తెలుసుకోవటం, ఆన్‌లైన్‌లో డాక్యుమెంట్ అప్‌లోడ్ చేయటం మరియు ధ్రువీకరణ పొందటం అలాగే ఆన్‌లైన్ ద్వారా రుణాన్ని పొందటం వంటి వాటిని కేవలం కొన్ని క్లిక్‌లలోనే పొందవచ్చు.

మారుతి సుజుకి కస్టమర్ల కోసం అద్భుతమైన ఆన్‌లైన్ ఫీచర్

అన్ని ఆఫర్లు ఒక్క చోటే

ఇకపై కస్టమర్లు వివిధ ఫైనాన్స్ కంపెనీలు ఆఫర్ చేసే రుణ ఆఫర్ల గురించి వ్యక్తిగత వెబ్‌సైట్‌లు లేదా ఫైనాన్స్ కంపెనీలను సందర్శించాల్సిన అవసరం లేదు. మారుతి సుజుకి స్మార్ట్ ఫైనాన్స్ మీ ప్రొఫైల్, అవసరాలు మరియు లొకేషన్ ఆధారంగా వివిధ ఫైనాన్స్ భాగస్వాములు మరియు రుణదాతలు అందిస్తున్న అన్ని ఆఫర్లను ఒకే ప్లాట్‌ఫామ్‌పై పొందవచ్చు.

MOST READ:మత్తులో చేసిన పనికి మత్తు దిగేలా గుణపాఠం చెప్పిన పోలీసులు.. ఎక్కడో తెలుసా ?

మారుతి సుజుకి కస్టమర్ల కోసం అద్భుతమైన ఆన్‌లైన్ ఫీచర్

మీ కారు ఈఎమ్‌ని లెక్కించడానికి సులభమైన మార్గం

మీ కార్ లోన్‌కి కావల్సిన బడ్జెట్ గురించి మీకు తెలిస్తే చాలు, ఈ స్మార్ట్ ఫైనాన్స్ ద్వారా మీరు చెల్లించే డౌన్ పేమెంట్, ఈఎమ్ఐ, పదవీకాలం మరియు వడ్డీ రేటు మొదలైన అంశాలను కస్టమైజ్ చేసుకుని ఈఎమ్ఐకి సంబంధించి ఒక అంచనాకు వచ్చే వెసలుబాటులో ఇందులో ఉంటుంది.

మారుతి సుజుకి కస్టమర్ల కోసం అద్భుతమైన ఆన్‌లైన్ ఫీచర్

ఎండ్-టు-ఎండ్ ప్రాసెస్

మీ బడ్జెట్ మరియు ప్రాధాన్యతల ఆధారంగా మీకు కావల్సిన కార్ లోన్ మొత్తాన్ని ఎంచుకున్న తర్వాత స్మార్ట్ ఫైనాన్స్ సిస్టమ్‌లోని లోన్ అప్లికేషన్‌ను పూర్తి చేయటం మరియు అవసరమైన అన్ని డాక్యుమెంటేషన్లను అప్‌లోడ్ చేయటం ద్వారా మీరు రుణానికి అర్హత పొందింది లేనిది తెలుసుకోవచ్చు. ఇందు కోసం మీ లోన్ అప్లికేషన్‌ను ట్రాక్ చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది.

MOST READ:మీకు తెలుసా.. లంబోర్ఘిని ఉరుస్ డ్రైవింగ్ చేస్తూ కనిపించిన తమిళ్ తలైవా రజినీకాంత్

మారుతి సుజుకి కస్టమర్ల కోసం అద్భుతమైన ఆన్‌లైన్ ఫీచర్

ప్రస్తుతం మారుతి సుజుకి ఈ స్మార్ట్ ఫైనాన్స్ సేవల కోసం మొత్తం ఎనిమిది ఫైనాన్షియర్లతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ ఫైనాన్షియర్లలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, చోళమండలం ఫైనాన్స్, ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, మహీంద్రా ఫైనాన్స్, కోటక్ మహీంద్రా ప్రైమ్ వంటి సంస్థలు ఉన్నాయి.

మారుతి సుజుకి కస్టమర్ల కోసం అద్భుతమైన ఆన్‌లైన్ ఫీచర్

మారుతి సుజుకి స్మార్ట్ ఫైనాన్స్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మారుతి సుజుకి తమ కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరిచే ప్రయత్నంలో భాగంగా, వారికి ఎండ్-టు-ఎండ్ కార్ ఫైనాన్స్ అవసరాలను తీర్చడంలో సహాయపడేందుకు గాను ఈ స్మార్ట్ ఫైనాన్స్ డిజిటల్ వన్-స్టాప్ షాప్‌ను పరిచయం చేసింది. ఇది మారుతి సుజుకి కారు కొనుగోలు అనుభవాన్ని మరింత పెంచుతుందని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది.

MOST READ:డ్రీమ్ కార్‌లో కనిపించిన రిషబ్ శెట్టి.. అతని డ్రీమ్ నిజం చేసినది ఎవరో తెలుసా ?

Most Read Articles

English summary
Maruti Suzuki India launches Smart Finance, a digital one-stop shop to help fulfil end-to-end car finance needs of its customers. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X