మారుతి సుజుకి ఎస్-ప్రెసో సిఎన్‌జి విడుదల - ధరలు, ఫీచర్లు, వివరాలు

'మారుతి సుజుకి' అందిస్తున్న ఎంట్రీ లెవల్ కారు 'ఎస్-ప్రెసో'లో కంపెనీ ఓ సిఎన్‌జి వెర్షన్‌ను సైలెంట్‌గా మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఎస్-సిఎన్‌జి టెక్నాలజీతో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్ అమర్చిన ఎస్-ప్రెసో హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది. ఈ కొత్త మారుతి సుజుకి ఎస్-ప్రెసో సిఎన్‌జి మోడల్ ప్రారంభ ధర రూ .4.84 లక్షలు, ఎక్స్‌షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

మారుతి సుజుకి ఎస్-ప్రెసో సిఎన్‌జి విడుదల - ధరలు, ఫీచర్లు, వివరాలు

మారుతి సుజుకి దేశీయ విపణిలో విక్రయిస్తున్న సిఎన్‌జి కార్లలో ఎస్-ప్రెసో సిఎన్‌జి తాజాగా వచ్చి చేరిన కొత్త మోడల్. కంపెనీ ఇప్పటికే వ్యాగన్ఆర్, ఆల్టో, ఎర్టిగా, మొదలైన మోడళ్లలో కూడా సిఎన్‌జి పవర్డ్ వేరియంట్లను ఆఫర్ చేస్తోంది. మారుతి సుజుకి ఎస్-ప్రెసో సిఎన్‌జి మోడల్ ఎల్ఎక్స్ఐ, ఎల్ఎక్స్ఐ (ఓ), విఎక్స్ఐ మరియు విఎక్స్ఐ (ఓ) అనే నాలుగు వేరియంట్లలో లభ్యం కానుంది.

మారుతి సుజుకి ఎస్-ప్రెసో సిఎన్‌జి విడుదల - ధరలు, ఫీచర్లు, వివరాలు

ఇందులో బేస్ వేరియంట్ ఎస్-ప్రెసో సిఎన్‌జి ఎల్ఎక్స్ఐ ధర రూ.4.84 లక్షలుగా ఉంటే, టాప్-ఎండ్ వేరియంట్ ఎస్-ప్రెసో సిఎన్‌జి విఎక్స్ఐ (ఓ) ధర రూ.5.13 లక్షలుగా ఉంది. మిడ్-స్పెక్ వేరియంట్లయిన ఎల్‌ఎక్స్‌ఐ (ఓ) ధర రూ.4.90 లక్షలు మరియు విఎక్స్ఐ వేరియంట్ ధర రూ.5.07 లక్షలుగా ఉన్నాయి. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ).

MOST READ: వచ్చే నెలలో ప్రారంభం కానున్న హోండా ఆఫ్రికన్ ట్విన్ డెలివరీలు

మారుతి సుజుకి ఎస్-ప్రెసో సిఎన్‌జి విడుదల - ధరలు, ఫీచర్లు, వివరాలు

కొత్త మారుతి ఎస్-ప్రెసో సిఎన్‌జి మోడల్లో 998సీసీ త్రీ-సిలిండర్ ఇంజిన్‌ను ఉపయోగించారు. సిఎన్‌జితో పనిచేసే ఈ ఇంజన్ గరిష్టంగా 5500rpm వద్ద 58bhp శక్తిని మరియు 3500rpm వద్ద 70Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ లేదు.

మారుతి సుజుకి ఎస్-ప్రెసో సిఎన్‌జి విడుదల - ధరలు, ఫీచర్లు, వివరాలు

అదే పెట్రోల్ ఇంజన్‌తో పోల్చినట్లయితే, పెట్రోల్ శక్తితో పనిచేసే మోడల్ 5500rpm వద్ద 67bhp శక్తిని మరియు 3500rpm వద్ద 90Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది సిఎన్‌జి వేరియంట్ కన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ పెట్రోల్ ఇంజన్ కూడా 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కాకపోతే, ఇందులోని టాప్-ఎండ్ వేరియంట్లలో ఆప్షనల్‌గా ఏఎమ్‌టి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను ఎంచుకోవచ్చు.

MOST READ: హ్యుందాయ్ కార్లకు ఐసిఐసిఐ లోన్స్; ఈజీ ఫైనాన్సింగ్ స్కీమ్ - వివరాలు

మారుతి సుజుకి ఎస్-ప్రెసో సిఎన్‌జి విడుదల - ధరలు, ఫీచర్లు, వివరాలు

మారుతి ఎస్-ప్రెసో సిఎన్‌జి మోడల్ బిఎస్ 6-కంప్లైంట్ మరియు 55 లీటర్ ట్యాంక్ సామర్థ్యంతో వస్తుంది. మారుతి సుజుకి పేర్కొన్న సమాచారం ప్రకారం, ఎస్-ప్రెసో సిఎన్‌జి మోడల్ కేజీకి 31.2 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.

మారుతి సుజుకి ఎస్-ప్రెసో సిఎన్‌జి విడుదల - ధరలు, ఫీచర్లు, వివరాలు

ఈ సిఎన్‌జి వెర్షన్ మారుతి సుజుకి ఎస్-ప్రెసో కారులో ఇంజన్ మార్పులు మినహా వేరే ఏ ఇతర మార్పులు లేవు. పెట్రోల్ వెర్షన్లలో లభించే అన్ని ఫీచర్లు, సదుపాయాలు ఇందులో కూడా లభిస్తాయి.

MOST READ: భీమా డబ్బు కోసం తప్పుడు కేసు పెట్టిన ఆడి A4 కార్ ఓనర్

మారుతి సుజుకి ఎస్-ప్రెసో సిఎన్‌జి విడుదల - ధరలు, ఫీచర్లు, వివరాలు

మారుతి సుజుకి ఎస్-ప్రెసో సిఎన్‌జి వెర్షన్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

సిఎన్‌జి విరివిగా లభించే మెట్రో నగరాల్లో ఈ మోడళ్లకు మంచి గిరాకీ ఉంటోంది. సిఎన్‌జి ఇంధనం తక్కువ ధరకు లభించడమే కాకుండా, పెట్రోల్/డీజిల్ కార్ల కన్నా అధిక మైలేజీని ఆఫర్ చేస్తాయి. మారుతి సుజుకి ఇప్పటికే వ్యాగన్ఆర్, ఆల్టో, ఎర్టిగా మోడళ్లలో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌ను ఆఫర్ చేస్తుండగా, ఈ జాబితాలోకి తాజాగా ఎస్-ప్రెసో వచ్చి చేరింది. ఇది ఈ సెగ్మెంట్లోని హ్యుందాయ్ శాంత్రో కారుతో పోటీ పడుతుంది.

Most Read Articles

English summary
Maruti Suzuki has launched the S-Presso hatchback with a factory-fitted S-CNG technology. The new Maruti S-Presso CNG model is offered with a starting price of Rs 4.84 lakh, ex-showroom (Delhi). Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X