విదేశీ మార్కెట్లోకి అడుగుపెట్టనున్న మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో

భారతదేశంలో అతిపెద్ద వాహనతయారీదారుగా పేరుపొందిన సంస్థ మారుతి సుజుకి. ఈ సంస్థ చాలా వాహనాలను ఇండియన్ మార్కెట్లోకి విడుదలచేయడం జరిగింది. మారుతి నుంచి వచ్చిన వాహనాలు మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. మారుతి బ్రాండ్ యొక్క వాహనాలు ఇప్పుడు ఒక్క ఇండియాలో మాత్రమే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేయడానికి సిద్దమైనది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

విదేశీ మార్కెట్లోకి అడుగుపెట్టనున్న మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో

మారుతి సుజుకి ఇప్పుడు ఆసియా, లాటిన్ అమెరికన్ మరియు ఆఫ్రికన్ దేశాల మార్కెట్లకు తన ఎస్-ప్రెస్సో కారుని ఎగుమతి చేయడం ప్రారంభించింది. ఈ మారుతి ఎస్-ప్రెస్సో మార్కెట్లోకి విడుదల చేసిన అతి తక్కువ కాలంలోనే భారతదేశంలో ఎక్కువగా అమ్ముడయ్యాయని కంపెనీ తెలియజేసింది.

విదేశీ మార్కెట్లోకి అడుగుపెట్టనున్న మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో

మార్కెట్లో ఎస్-ప్రెస్సోకి ఉన్న ఆదరణ కారణంగా ఒక్క మనదేశంలో మాత్రమే కాకుండా ఇతర దేశాలలో కూడా వీటి డిమాండ్ బాగా పెరిగింది, కాబట్టి మారుతి ఇతర దేశాలైన లాటిన్ అమెరికా ఆసియా మరియు ఆఫ్రికా వంటి దేశాలలో వీటి అమ్మకాలను ప్రారంభించనుంది.

విదేశీ మార్కెట్లోకి అడుగుపెట్టనున్న మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో

సాధారణంగా మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో 2019 సెప్టెంబర్ లో ప్రారంభించడం జరిగింది. డిజైన్ పరంగా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో ఉన్న స్టైలింగ్ మరిన్ని ఫీచర్స్ అన్ని వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

విదేశీ మార్కెట్లోకి అడుగుపెట్టనున్న మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో

ఇది విశాలమైన ఇంటీరియర్స్ మరియు ఫంకీ స్టైలింగ్‌ను కలిగి ఉంటుంది. అందువల్ల మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో వినియోగించడానికి చాలా బాగా అమ్ముడైంది. భారతీయ ఆటో పరిశ్రమ తగ్గుముఖం పట్టినప్పుడు కూడా ఎస్-ప్రెస్సో మాత్రం ఊహించని విధంగా అమ్మకాలు రెట్టింపు అయ్యాయి. 2019 సెప్టెంబర్ లో ఎస్-ప్రెస్సో 5000 యూనిట్లు అదేవిధంగా అక్టోబర్ లో 10,634 యూనిట్ల రెట్టింపు అమ్మకాలను చేపట్టింది.

విదేశీ మార్కెట్లోకి అడుగుపెట్టనున్న మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో యొక్క మొత్తం అమ్మకాలు 35,000 యూనిట్లకు పైగా విక్రయించింది. ఇదే కాకుండా ప్రతి నెలలో అమ్మకాలు రెట్టింపవుతున్నాయి. ఇండియాలో ఎక్కువ అమ్మకాలను చేపట్టిని మారుతి ఇప్పుడు విదేశాలకు ఎగుమతి చేయడానికి సన్నాహాలను సిద్ధం చేసింది. ఈ విధమైన ఎగుమతులను ప్రారంభించడం వల్ల హ్యాచ్‌బ్యాక్ గతంలో కంటే ఎక్కువ అమ్మకాల సంఖ్యను క్లాక్ చేస్తుందని మేము ఆశించవచ్చు.

విదేశీ మార్కెట్లోకి అడుగుపెట్టనున్న మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & సిఇఒ కెనిచి ఆయుకావా మాట్లాడుతూ ఎస్-ప్రెస్సో కార్లు మేక్ ఇన్ ఇండియాకు నిజమైన చిహ్నం. ఇది భారతదేశంలోని వినియోగదారులచే విస్తృతంగా ప్రశంసించబడింది మరియు అంతర్జాతీయ మార్కెట్లలో ఇది బాగా అమ్ముడవుతుందని మేము విశ్వసిస్తున్నాము అన్నారు.

విదేశీ మార్కెట్లోకి అడుగుపెట్టనున్న మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో మనేసర్ ప్లాంట్లో నిర్మించబడి, తరువాత ఎగుమతుల కోసం గుజరాత్ లోని ముంద్రా నౌకాశ్రయానికి రవాణా చేయబడుతుంది. పెద్ద కార్-ఫెర్రింగ్ నౌకలచే ఆసియా, లాటిన్ అమెరికా మరియు ఆఫ్రికాలోని ఇతర దేశాలకు రవాణా చేయడం జరుగుతుంది.

విదేశీ మార్కెట్లోకి అడుగుపెట్టనున్న మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం:

మారుతి సుజుకి ఎగుమతుల పరంగా మరియు అమ్మకాల పరంగా భారతదేశంలో అతిపెద్ద తయారీదారు. కొన్ని సంవత్సరాల నుండి, సంస్థ తన పరిధులను విస్తరిస్తోంది మరియు అనేక మోడళ్లను ఇతర దేశాలు మరియు ఖండాలకు ఎగుమతి చేస్తోంది. మారుతి సుజుకి కార్లు భారతదేశంలో ఇప్పటివరకు చాలా ఎక్కువగా అమ్ముడయ్యాయి. అందువల్ల విదేశాలలో ఎస్-ప్రెస్సో అమ్మకాల బాగానే జరుగుతాయని కంపెనీ విశ్వసిస్తోంది.

Most Read Articles

English summary
Maruti Suzuki S-Presso Exports To Latin America, Africa & Asia Begins. Read in Telugu.
Story first published: Saturday, January 25, 2020, 14:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X