భారత్‌లో కరోనా భయంతో ఉత్పత్తి పెంచిన మారుతి సుజుకి సప్లయర్స్

భారత్‌లో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, దేశంలో మరోసారి లాక్‌డౌన్ నాటి పరిస్థితులు పునరావృతం అయ్యే అకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియాకి దేశవ్యాప్తంగా ఉన్న విడిభాగాల సరఫరాదారులు త్వరలోనే ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

భారత్‌లో కరోనా భయంతో ఉత్పత్తి పెంచిన మారుతి సుజుకి సప్లయర్స్

అనివార్య పరిస్థితుల్లో భవిష్యత్తులో ఏదైనా ఉత్పత్తి అంతరాయం ఏర్పడితే ఆ పరిస్థితులకు అనుగుణంగా సప్లయ్ కొరత రాకుండా ఉండేందుకు సప్లయర్లు ప్లాన్ చేస్తున్నారు. లైవ్‌మింట్ ప్రచురించిన కథనం ప్రకారం, మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మాతృ సంస్థ అయిన జపాన్‌కి చెందిన సుజుకి మోటార్ కార్పొరేషన్ చైర్మన్ ఒసాము సుజుకి నేరుగా లేఖలో ఈ విషయాన్ని ప్రస్థావించినట్లు సమాచారం.

భారత్‌లో కరోనా భయంతో ఉత్పత్తి పెంచిన మారుతి సుజుకి సప్లయర్స్

భారతదేశ వ్యాప్తంగా ఉన్న మారుతి వెండర్లకు ఒసాము సుజుకి పంపిన లేఖ దశాబ్ద కాలంలో ఇదే మొదటిది. దేశంలోని మారుతి సుజుకి వెండర్లు మరియు సప్లయర్లను ఉద్దేశించి ఈ లేఖను రాశారు. జూన్ 17న రాసిన ఈ లేఖలో భారతదేశంలో కరోనా మహమ్మారి కారణం ప్రస్తుతం నెలకొన్ని పరిస్థితులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మారుతి సుజుకి ఉత్పత్తిలో భాగమైన విడిభాగాల సరఫరాదారులు మరియు ఇతర అమ్మకందారుల ఉత్పత్తిని గణనీయంగా పెంచి, వీలైనంత ఎక్కువ నిల్వను ఉంచుకోవాలని ఆ లేఖలో సుజుకి కోరారు.

MOST READ: భారత్‌లో ఎమ్‌జి హెక్టర్ విడుదల తేదీ ఖరారు - ఫీచర్లు, వివరాలు

భారత్‌లో కరోనా భయంతో ఉత్పత్తి పెంచిన మారుతి సుజుకి సప్లయర్స్

ఒకవేళ దేశంలో కోవిడ్-19 మహమ్మారి అదుపులోకి రాకపోయినట్లయితే, మరోసారి ఇది వరకటి లాక్‌డౌన్ తరహా పరిస్థితులు పునరావృతమైతే గతంలో మాదిరిగా ఉత్పత్తికి అంతరాయం రాకుండా చూసుకోవాలని మారుతి భావిస్తోంది. ఇందు కోసం ముందుగానే వీలైనంత అధిక మొత్తంలో విడి భాగాలను నిల్వ ఉంచుకోవాలని చూస్తోంది.

భారత్‌లో కరోనా భయంతో ఉత్పత్తి పెంచిన మారుతి సుజుకి సప్లయర్స్

మరోవైపు తమిళనాడు రాష్ట్రంలో కరోనా కేసులు ఎంతకీ అదుపులోకి రాకపోవటంతో రాష్ట్రవ్యాప్తంగా 12 రోజుల పాటు లాక్‌డౌన్‌ని పొడగిస్తున్నట్లు తమిళనాడు ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో మారుతి సుజుకి ఇండియాకి సంబంధించిన కొందరు సరఫరాదారులు తమిళనాడులో ఉన్నందున కొన్ని భాగాల కొరతను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇది ఆయా డీలర్ల ఉత్పత్తి కార్యకలాపాలకు అంతరాయం కలిగించే అవకాశం ఉంది.

MOST READ: ఈ ఎయిర్‌బ్యాగ్స్‌తో తల, మెదడు భద్రం - అక్యురా కొత్త ప్రయోగం!

భారత్‌లో కరోనా భయంతో ఉత్పత్తి పెంచిన మారుతి సుజుకి సప్లయర్స్

మారుతి సుజుకి ఇండియా, జపనీస్ కంపెనీలో ఓ అంతర్భాగంగా ఉంది. సుజుకి మోటార్స్ యొక్క మొత్తం లాభాలలో 60% కంపెనీ వాటా కలిగి ఉంది. కరోనా కారణంగా పరిస్థితి అదుపు తప్పితే ఎదురయ్యే సమస్యలను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండేందుకు కంపెనీ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది.

భారత్‌లో కరోనా భయంతో ఉత్పత్తి పెంచిన మారుతి సుజుకి సప్లయర్స్

గడచి మే నెలలో ప్రకటించిన లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో, మారుతి సుజుకి తమ మానేసర్ ప్లాంట్లో మే 12వ తేదీ నుండి తిరిగి కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గుర్గావ్ ప్లాంట్ మరియు గుజరాత్‌లోని సుజుకి మోటార్ ప్లాంట్‌లో కాస్తంత ఆలస్యంగా తెరవబడ్డాయి.

MOST READ: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బైక్‌లు, కార్లు ఎలా ఉన్నాయో చూసారా ?

భారత్‌లో కరోనా భయంతో ఉత్పత్తి పెంచిన మారుతి సుజుకి సప్లయర్స్

కాగా.. మారుతి సుజుకి గడచిన మే 2020 నెలలో అమ్మకాలు 86 శాతం పడిపోయాయి. కంపెనీ గత మే 2019లో అమ్మిన 1.34 లక్షల యూనిట్లతో పోలిస్తే మే 2020లో కేవలం 18,539 యూనిట్ల అమ్మకాలను మాత్రమే నమోదు చేసింది.

భారత్‌లో కరోనా భయంతో ఉత్పత్తి పెంచిన మారుతి సుజుకి సప్లయర్స్

మారుతి సుజుకి విడిభాగాల నిల్వపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భారతదేశంలో కోవిడ్-19 మహమ్మారి రోజురోజుకీ భయంకరమైన రేటుతో పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ సమయం ముగిసినప్పటికీ, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ వివిధ ప్రాంతాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నాయి. గడచిన లాక్‌డౌన్ కారణంగా సుజుకి ఉత్పత్తి కొంచెం దెబ్బతిన్నప్పటికీ, అమ్మకపు డిమాండ్‌ను తీర్చడానికి కంపెనీ ముందస్తు జాగ్రత్త చర్యలను తీసుకుంటోంది.

Most Read Articles

English summary
Maruti Suzuki suppliers across the country will soon be increasing their production rates. The increased production will allow them to build up sufficient inventory in case of any future production disruption. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X