Just In
- 24 min ago
డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్
- 1 hr ago
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- 2 hrs ago
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- 4 hrs ago
ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
Don't Miss
- Movies
టాలీవుడ్లో మరో భారీ మల్టీస్టారర్: బన్నీ, విజయ్ కాంబోలో మూవీ.. చిన్న డైరెక్టర్.. పెద్ద నిర్మాత ప్లాన్!
- News
అప్పుడెందుకు వాయిదా వేశారు ? జగన్ కు మద్దతుగా పంచాయితీ పోరుపై నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Lifestyle
Zodiac signs: మీ రాశిని బట్టి మీకు ఎలాంటి మిత్రులు ఉంటారో తెలుసా...!
- Sports
ఇంగ్లండ్ అలా చేయకుంటే భారత్‌ను అవమానపరిచినట్టే.. జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ల ఫైర్!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మీరు ఎప్పుడైనా అతి చిన్న త్రీ-వీల్ మారుతి సుజుకి 800 కారు చూసారా ?
భారతదేశంలో ప్రసిద్ధి చెందిన వాహన సంస్థ మారుతి సుజుకి. దేశీయ మార్కెట్లో ఎక్కువ ప్రజాదరణ పొందిన వాహనాలు ఇందులో ఉన్నాయి. మారుతి కంపెనీ యొక్క బ్రాండ్ వాహనాలలో ఒకప్పుడు బాగా ప్రసిద్ధి చెందిన కారు మారుతి 800. ఈ కారు యొక్క ఉత్పత్తి ఇప్పుడు పూర్తిగా నిలిపివేయబడింది. ఈ వాహనాల ఉత్పత్తి నిలిపివేసినప్పటికీ కొంతమంది ఈ వాహనాలను కలిగి ఉన్నారు.

ఇటీవల కాలంలో చాల వాహనాలు మాడిఫై చేయబడుతున్నాయి. ఈ క్రమంలో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి 800 మాడిఫై చేయబడింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం. ఈ విధంగా మాడిఫై చేయడం కేవలం వినోదం కోసమే.. ఇది చట్టబద్దమైనది కాదు.

మారుతి 800 కారు యొక్క మాడియాఫై మాగ్నెటో 11 చేత చేయబడుతుంది. మాడిఫై చేయబడిన పూర్తి ప్రక్రియ వీడియో చూపిస్తుంది. మోడెర్ కారును సగానికి కట్ చేసి, ఆపై మోటారుసైకిల్ యొక్క టైర్‌ను ఇన్స్టాల్ చేయడానికి వెనుక భాగాన్ని సవరించుకుంటాడు. భారతదేశంలో మీరు చూడబోయే మూడు చక్రాల మారుతి సుజుకి 800 ఇదే.
MOST READ:ఐసిఐసిఐ బ్యాంకుతో భాగస్వామ్యం కుదుర్చుకున్న మారుతి సుజుకి, ఎందుకంటే ?

కారు యొక్క ఇంజిన్ ముందు భాగంలో ఉంది మరియు ఇది ఫ్రంట్-వీల్-డ్రైవ్ వాహనం కాబట్టి, కారును సగానికి తగ్గించడం ద్వారా ఎలాంటి నష్టం జరగదు. ఈ కారు యొక్క డ్రైవర్ కారును సర్కిల్‌లలో తిరిగేలా చేస్తుంది. కారు యొక్క మొత్తం నిర్మాణాన్ని మార్చడం ఇక్కడ మన చూడవచ్చు. కానీ ఇది చట్టబద్దమైనది కాదని గమనించాలి. ఇటువంటి సవరించిన వాహనాలు రూల్స్ పాటించనందుకు పోలీసులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.

ఇక్కడ చూపిన కారు వీడియో ప్రకారం ఇది తుది ఉత్పత్తి కాదు. కారులోని వీల్‌బేస్‌ను కుదించడం ద్వారా మినీ మారుతి 800 తయారు చేయాలని యోచిస్తున్నట్లు వీడియోలోని వ్యక్తి చెప్పారు.ఇందులో వెనుక భాగాన్ని మాత్రమే తీసివేశారు. దీనికి వెనుక ఒక చక్రం కూడా బిగించబడింది. ఇది వాహనం నడవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.
MOST READ:టైర్ తయారీలో కొత్త మైలురాయిని నెలకొల్పిన జెకె టైర్
భద్రతా సమస్యల కారణంగా భారతదేశంలో ఇటువంటి వాహనాలు అనుమతించబడవు. ఒకవేళ మీరు వాహనాన్ని మాడిఫై చేసి చట్టబద్దం చేయాలనుకుంటే ఎక్కువ శ్రమపడవలసి ఉంటుంది. మాడిఫై చేసిన వాహనాన్ని రహదారి చట్టబద్దంగా చేయడానికి ARAI లేదా ICAT చేత పరీక్షించవలసి ఉంటుంది. ఆ తరువాత అధికారిక రిజిస్ట్రేషన్‌కు ముందు వాహనాన్ని RTO చే తనిఖీ చేయబడుతుంది.

వెహికల్స్ మాడిఫై చేయడం అనేది సుదీర్ఘమైన ప్రక్రియ. దీనికోసం చాలా సమయం మరియు డబ్బు కూడా అవసరం అవుతుంది. ఇటీవల కాలంలో భారతదేశంలో చాలా మోడిఫికేషన్ గ్యారేజీలు ఉన్నాయి. అధికారికంగా ద్రువీకరించని మాడిఫైడ్ వాహనాలు రోడ్డు మీద తిరిగితే వారికి పోలీసులు కఠినమైన శిక్షలు విధించడం మాత్రమే కాకుండా, ఆ వాహనాలను స్వాధీనం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.
Image Courtesy: MAGNETO 11/YouTube
MOST READ:రెడ్ జోన్లో క్యాబ్ సర్వీసులకు గ్రీన్ సిగ్నల్, ఎక్కడో తెలుసా !