Just In
- 4 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 5 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- 5 hrs ago
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
- 7 hrs ago
భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
Don't Miss
- News
జైలు నుంచి భూమా అఖిలప్రియ విడుదల, అన్నీ వివరాలు వెల్లడిస్తా.. సిటీ వదిలి వెళ్లొద్దు
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సరికొత్త ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తున్న మారుతి-టొయోటా జాయింట్ వెంచర్
భారత మార్కెట్లో తమ వ్యాపార వ్యూహంలో భాగంగా భారతదేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మరియు జపాన్‌కు చెందిన టొయోటా కిర్లోస్కర్ కంపెనీలు జాయింట్ వెంచర్‌గా ఏర్పడిన సంగతి తెలిసినదే. ఈ ఇరు కంపెనీల నుండి ఇప్పటికే బాలెనో - గ్లాంజా మరియు విటారా బ్రెజ్జా - అర్బన్ క్రూయిజర్ మోడళ్లు మార్కెట్లోకి వచ్చాయి.

అయితే, ఈసారి ఇలా క్లోనింగ్ చేయకుండా ఇరు కంపెనీలు కలిసి ఓ సరికొత్త ఎస్‌యూవీని అభివృద్ధి చేయాలని నిర్ణయించాయి. భారత్‌లో శరవేగంగా విస్తరిస్తున్న ఎస్యూవీ విభాగంలో మారుతి-టొయోటా కంపెనీలు ఓ సరికొత్త మోడల్‌ను విడుదల చేయనున్నాయి. మరో ఏడాది కాలానికి ఈ కొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

స్టాక్ ఎక్సేంజ్‌లో మారుతి సుజుకి చేసిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో, 2022 నుండి తమ అలయన్స్ భాగస్వామి టొయోటా ప్లాంట్‌లో విటారా బ్రెజ్జా ఉత్పత్తికి చేసిన ప్రణాళికల్లో పునర్విమర్శ చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. కర్ణాటకలోని బిడాడిలోని టొయోటా ప్లాంట్‌లో విటారా బ్రెజ్జా ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఓ కొత్త మోడల్‌ను తయారు చేయనున్నారు.
MOST READ:సైకిల్‌పై కాశ్మీర్ నుంచి 8 రోజుల్లో కన్యాకుమారి చేరుకున్న 17 ఏళ్ల యువకుడు, ఇతడే

మారుతి సుజుకి మరియు టొయోటా కిర్లోస్కర్ రెండు కంపెనీలు సంయుక్తంగా తయారు చేయనున్న ఈ మిడ్-సైజ్ ఎస్యూవీ ఉత్పత్తి 2022 నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్ వంటి మోడళ్లకు పోటీగా నిలిచే ఆస్కారం ఉంది.

మారుతి సుజుకి మరియు టొయోటా కిర్లోస్కర్ కంపెనీల నుండి వస్తున్న ఈ కొత్త మిడ్-సైజ్ ఎస్యూవీ, ఇరు కంపెనీలు కలిసి ఉమ్మడిగా అభివృద్ధి చేస్తున్న మొదటి ఉత్పత్తి కానుంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ఈ కారును టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్లాంట్-2 ఉత్పత్తి చేయనున్నారు. ఈ ఉత్పత్తిని మారుతి సుజుకి నిర్వహించనుంది.
MOST READ:మీకు తెలుసా.. లంబోర్ఘిని ఉరుస్ డ్రైవింగ్ చేస్తూ కనిపించిన తమిళ్ తలైవా రజినీకాంత్

కర్ణాటకలోని టొయోటా బిడాది ఉత్పత్తి కేంద్రంలో రెండు ప్లాంట్లు ఉన్నాయి. మొదటి ప్లాంట్‌లో టొయోటా ఇన్నోవా మరియు ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలను ఉత్పత్తి చేస్తుండగా, రెండవ ప్లాంట్ టొయోటా యారిస్ మరియు క్యామ్రీ హైబ్రిడ్ వాహనాలను ఉత్పత్తి చేస్తున్నారు.

కాగా, ఇరు సంస్థలు కలిసి అభివృద్ధి చేయనున్న ఈ మిడ్-సైజ్ ఎస్యూవీ పొడవులో 4.3 మీటర్లుగా ఉండి, టొయోటా యొక్క డిఎన్‌జిఎ ప్లాట్‌ఫాంపై ఆధారపడి ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని మారుతి-టొయోటాలు ఈ కారును తయారు చేయనున్నాయి.
MOST READ:కేవలం 100 రూపాయలకే స్లీపర్ బస్సులో ఉండొచ్చు.. ఎక్కడో తెలుసా?

మారుతి సుజుకి మరియు టొయోటా కిర్లోస్కర్ సంస్థలు తయారు చేస్తున్న వాహనాల్లో చాలా వరకూ ఒకేరకమైన సాంకేతికతను మరియు పరికరాలను కలిగి ఉన్నప్పటికీ, డిజైన్ లాంగ్వేజ్ పరంగా ఇవి విభిన్నమైన స్టైలింగ్‌ను కలిగి ఉంటాయి. ఈ జాయింట్ వెంచర్ నుండి రానున్న కొత్త ఎస్‌యూవీలో మారుతి సుజుకి ఆఫర్ చేస్తున్న 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా, ఈ కొత్త ఎస్‌యూవీలో టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతం ఈ ఎస్‌యూవీలో డీజిల్ ఇంజన్ వినియోగం గురించి ఎలాంటి సమాచారం లేదు. రాబోయే కొత్త ఎస్యూవీ మారుతి సుజుకి మరియు టొయోటా బ్రాండ్ల యొక్క ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న భారీ అంతరాన్ని పూరించడానికి సహాయపడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రెండు కంపెనీలకు మిడ్-సైజ్ ఎస్యూవీ విభాగంలో ఎలాంటి ఉత్పత్తులు లేవు.
MOST READ:జావా బైక్‌పై కనిపించిన మలయాళీ యాక్టర్ ; ఎవరో తెలుసా ?