మారుతి సుజుకి బాలెనో కారుని తెగ కొనేస్తున్నారు, కారణమేంటో తెలుసా?

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ బ్రాండ్ మారుతి సుజుకి అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో అమ్మకాల పరంగా దేశంలో మరో అరుదైన మైలురాయిని చేరుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ మోడల్‌ను మార్కెట్లో ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకూ 8 లక్షలకు యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది.

మారుతి సుజుకి బాలెనో కారుని తెగ కొనేస్తున్నారు, కారణమేంటో తెలుసా?

మారుతి సుజుకి బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారును తొలిసారిగా 2015లో విడుదల చేశారు. మారుతి సుజుకి బ్రాండ్ యొక్క నెక్సా ఎక్స్‌పీరియన్స్ ప్రీమియం రిటైల్ స్టోర్‌లో విక్రయించిన మొదటి మోడళ్లలో బాలెనో కూడా ఒకటి.

మారుతి సుజుకి బాలెనో కారుని తెగ కొనేస్తున్నారు, కారణమేంటో తెలుసా?

భారత మార్కెట్లో ప్రారంభించిన మొదటి ఏడాదిలోనే (2016లో), బాలెనో 1 లక్షల అమ్మకపు మైలురాయిని చేరుకుంది. ఇటీవలి కాలంలో మార్కెట్ ధోరణిని అంచనా వేసిన, మారుతి సుజుకి 2017లో బాలెనోలో సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను పరిచయం చేసింది. దీంతో అమ్మకాలు కూడా జోరందుకున్నాయి.

MOST READ:చీపురు పట్టి రోడ్డు శుభ్రం చేసిన ట్రాఫిక్ పోలీస్.. ఎందుకో తెలుసా ?

మారుతి సుజుకి బాలెనో కారుని తెగ కొనేస్తున్నారు, కారణమేంటో తెలుసా?

ఆ తర్వాత 2018లో, బాలెనో 5 లక్షల సేల్స్ మైల్‌స్టోన్‌ను చేరుకుంది. అంటే ఈ మోడల్ మార్కెట్లోకి ప్రవేశించిన మొదటి మూడేళ్లలోనే ఈ భారీ మైలురాయిని సాధించింది. గత సంవత్సరం, మారుతి సుజుకి 1.2-లీటర్ జెట్ డ్యూయల్ వివిటి ఇంజిన్‌తో ఈ హ్యాచ్‌బ్యాక్‌లో సుజుకి మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ ‘ఎస్‌హెచ్‌విఎస్'ను ప్రవేశపెట్టింది. దీంతో ఇది స్మార్ట్-హైబ్రిడ్ వాహనంగా మారింది.

మారుతి సుజుకి బాలెనో కారుని తెగ కొనేస్తున్నారు, కారణమేంటో తెలుసా?

దేశంలో కఠినతరమైన బిఎస్6 నిబంధనల నేపథ్యంలో, మారుతి సుజుకి తమ బాలెనో మోడల్‌లో 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ మరియు 1.3-లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లను తొలగించాల్సి వచ్చింది. ఫలితంగా, మారుతి సుజుకి బాలెనో ప్రస్తుతం రెండు విభిన్న ట్యూనింగ్‌లు మరియు టెక్నాలజీతో ఒకేరకమైన 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది.

MOST READ:నడి రోడ్డుపై పోలీస్ చెంప చెళ్లుమనిపించిన మహిళ.. ఎందుకో తెలుసా

మారుతి సుజుకి బాలెనో కారుని తెగ కొనేస్తున్నారు, కారణమేంటో తెలుసా?

మారుతి సుజుకి 2020లో తమ బాలెనో మోడల్‌లో టర్బో-పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లను కోల్పోయినప్పటికీ, ఈ మోడల్ అమ్మకాలు మాత్రం ఎప్పటిలాగే బలంగా ఉన్నాయి. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 8 లక్షల మంది వినియోగదారులకు చేరువైంది.

మారుతి సుజుకి బాలెనో కారుని తెగ కొనేస్తున్నారు, కారణమేంటో తెలుసా?

భారతదేశంలో ప్రత్యేకంగా తయారు చేయబడిన మారుతి సుజుకి బాలెనో ఆస్ట్రేలియా, యూరప్, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ మరియు ఆగ్నేయ ఆసియా వంటి అనేక విదేశీ మార్కెట్లకు సైతం ఎగుమతి చేయబడుతుంది. మారుతి సుజుకి-టొయోటా భాగస్వామ్యంలో భాగంగా, గ్లాంజా పేరిట ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను టొయోటా రీబ్యాడ్జ్ చేసి విక్రయిస్తున్న సంగతి తెలిసినదే.

MOST READ:ఎలక్ట్రిక్ వాహనాన్ని డ్రైవ్ చేసిన మైనర్ బాలుడు.. తర్వాత ఏం జరిగిందో తెలుసా ?

మారుతి సుజుకి బాలెనో కారుని తెగ కొనేస్తున్నారు, కారణమేంటో తెలుసా?

బాలెనో విజయం గురించి మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, "మారుతి సుజుకి బాలెనో భారతదేశంలో అత్యంత ప్రియమైన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్, ఇది మా పోర్ట్‌ఫోలియోలో చాలా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. బోల్డ్ మరియు ప్రీమియం డిజైన్‌తో , అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు ఫీచర్-రిచ్ ఆఫరింగ్, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మా స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి బాలెనో మాకు సహాయపడింది. మా నెక్సా ఛానెల్‌కు గుర్తింపు తీసుకురావటంలో కూడా బాలెనో కూడా కీలక పాత్ర పోషించింది."

మారుతి సుజుకి బాలెనో కారుని తెగ కొనేస్తున్నారు, కారణమేంటో తెలుసా?

"మారుతి సుజుకి కుటుంబానికి కొత్త కస్టమర్లను తీసుకురావడానికి బాలెనో మాకు సహాయపడింది. ధైర్యమైన వ్యక్తిత్వం, తరువాతి తరం స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ, విలక్షణమైన లిక్విడ్-ఫ్లో డిజైన్, అత్యాధునిక సాంకేతిక ఫీచర్లు మరియు అత్యుత్తమ పనితీరు వంటి విశిష్టతలే దీని విజయానికి కారణం. బాలెనోలో సకాలంలో చేసిన ఆవిష్కరణలు పరిణామం చెందిన భారతదేశం యొక్క మారుతున్న ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నాయి. బాలెనో 5 సంవత్సరాల స్వల్ప వ్యవధిలోనే 8 లక్షల మంది ఆనందకరమైన కస్టమర్లను సొంతం చేసుకుంది. బాలెనో సాధించిన ఈ ముఖ్యమైన మైలురాయి మా కస్టమర్-సెంట్రిక్ తత్వానికి నిదర్శనంగా నిలుస్తుందని" అన్నారు.

MOST READ:68 ఏళ్ల వయసులో అందరిని ఆశ్చర్యపరిచిన వృద్ధ మహిళ.. ఇంతకీ ఏం చేసిందో తెలుసా?

మారుతి సుజుకి బాలెనో కారుని తెగ కొనేస్తున్నారు, కారణమేంటో తెలుసా?

మారుతి సుజుకి బాలెనో 8 లక్షల అమ్మకాల మైలురాయిపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మారుతి సుజుకి బాలెనో ప్రస్తుతం నెక్సా ప్రీమియం డీలర్‌షిప్ చైన్ ద్వారా మాత్రమే అమ్మబడుతోంది. ఈ ప్రీమియం డీలర్‌షిప్‌లు మెరుగైన కొనుగోలు మరియు యాజమాన్య అనుభవాన్ని ఇస్తాయి. అన్ని మారుతి సుజుకి మోడళ్ల మాదిరిగానే, బాలెనో కూడా లో మెయింటినెన్స్ మరియు విశ్వసనీయత కారణంగా ఇబ్బంది లేని యాజమాన్యాన్ని అందిస్తుంది, ఇది దేశంలో అత్యధికంగా అమ్ముడైన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా నిలిచింది.

Most Read Articles

English summary
Maruti Suzuki Baleno premium hatchback sales cross 8 lakh milestone mark since its inception in the country. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X