Just In
- 54 min ago త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- 3 hrs ago బెంజ్ కారు కొన్న సోషల్ మీడియా సెన్సేషన్ 'కుషా కపిల'.. ధర తెలిస్తే షాకవుతారు!
- 3 hrs ago MG గ్లోస్టర్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్ ఖర్చులన్నీ ఉచితంగా.. సంస్థ బంపర్ ఆఫర్.!!
- 5 hrs ago సెకండ్ హ్యాండ్ కార్లలో ఎక్కువగా వీటికే ప్రాధాన్యత ఇస్తున్నారట.. ఆ కార్లపైనే క్రేజ్ ఎక్కువ!!
Don't Miss
- News ys jagan stone attack case: జగన్ పై దాడి కేసు-బోండా ఉమకు బిగుస్తున్న ఉచ్చు?
- Sports GT vs DC: వార్నర్‌పై వేటు..కుర్రాడికి అవకాశం- పంత్
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
- Lifestyle కొత్తగా పెళ్ళైన జంటలు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మీ లైఫ్ సేవ్ చేస్తుంది
- Movies ఎన్టీఆర్‌ను ఆ పరిస్థితుల్లో చూసి రాజమౌళి కంటతడి.. జన్మలో అలాంటి క్లైమాక్స్ పెట్టకుండా జక్కన్న షాకింగ్ నిర్ణయం!
బిఎస్6 సెలెరియో మోడల్ లాంచ్ చేసిన మారుతి సుజుకి
మారుతి సుజుకి మార్కెట్లోకి సరికొత్త బిఎస్6 వెర్షన్ సెలెరియో కారును లాంచ్ చేసింది. మారుతి సెలెరియో బిఎస్6 మోడల్ ధర ఇప్పుడు రూ. 4.41 లక్షల నుండి రూ. 5.67 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది. బిఎస్4 వెర్షన్ మారుతి సెలెరియోతో పోలిస్తే బిఎస్6 వెర్షన్ సెలెరియో ధర సుమారుగా రూ. 15,000 నుండి రూ. 24,000 వరకూ పెరిగింది.
మారుతి సెలెరియో బిఎస్6 మోడల్లో ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్‌లో ఎలాంటి కాస్మొటిక్ మార్పులు జరగలేదు. మునుపటి మోడల్లో ఉన్నటువంటి మెష్ గ్రిల్, న్యూ హెడ్‌ల్యాంప్స్ మరియు షార్ప్ లుకింగ్ బంపర్.
మారుతి సెలెరియో హ్యాచ్‌బ్యాక్‌లో బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, బంపర్లు, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్ గల సైడ్ మిర్రర్లు, అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్, 60:40 స్ల్పిట్ సీట్లు, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, కీలెస్ ఎంట్రీ, ఆటో-డౌన్ పవర్ విండోస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
సేఫ్టీ పరంగా మారుతి సుజుకి సెలెరియో బిఎస్6 కారులో ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్, ఇబీడీ, సీట్-బెల్ట్ రిమైండర్, చైల్డ్-ప్రూఫ్ రియర్ డోర్ లాక్స్, హౌ-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్స్, రియర్ విండో వైపర్ మరియు వాషర్ మరియు ఇంజన్ ఇమ్మొబిలైజర్ వంటివి ఉన్నాయి.
మారుతి సెలెరియోలో 35-లీటర్ల సామర్థ్యం గల ఫ్యూయల్ ట్యాంక్ ఉంది, ఏఆర్ఏఐ సర్టిఫికేట్ ప్రకారం మారుతి సెలెరియో పెట్రోల్ వెర్షన్ లీటర్‌కు 23.10కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
సాంకేతికంగా మారుతి సెలెరియోలో 998సీసీ సామర్థ్యం గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇంజన్ పాతదే అయినప్పటికీ, కొత్తగా అమల్లోకి వచ్చిన బిఎస్6 ఉద్గార ప్రమాణాలను పాటిస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇంజన్ గరిష్టంగా 68బిహెచ్పి పవర్ మరియు 90ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
బిఎస్6 వెర్షన్ మారుతి సెలెరియో ఆరు విభిన్న రంగుల్లో లభిస్తుంది. అవి, బ్లేజింగ్ రెడ్, సిల్కీ సిల్వర్, గ్లిజనింగ్ గ్రే, అర్కిటిక్ వైట్, టార్క్ బ్లూ మరియు ట్యాంగో ఆరేంజ్.
మారుతి సెలెరియో విపణిలో ఉన్నహ్యుందాయ్ శాంట్రో, మారుతి వ్యాగన్ఆర్, డాట్సన్ గో మరియు టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
మారుతి సుజుకి రూ. 15,000 నుండి రూ. 24,000 మధ్య ధరల పెంపుతో మారుతి సెలెరియో బిఎస్6 వెర్షన్‌ను పరిచయం చేసింది. పవర్, మైలేజ్ పరంగా బిఎస్4తో పోల్చుకుంటే పెద్దగా మార్పులేమీ జరగలేదు. బిఎస్6 వెర్షన్ మార్కెట్లో నూతనత్వాన్ని పరిచయం చేసింది.