మారుతి సుజుకి కార్లపై ఫెస్టివల్ ఆఫర్స్; కొత్త సర్వీస్ క్యాంప్ ప్రారంభం

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, భారతదేశంలోని ప్రస్తుత పండుగ సీజన్‌ను పురస్కరించుకొని తమ వినియోగదారుల కోసం లిమిటెడ్ టైమ్ సర్వీస్ క్యాంప్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పండుగ సీజన్లో తమ మారుతి సుజుకి కార్లను సర్వీస్ చేయించుకనే కస్టమర్లకు కంపెనీ అనేక ప్రయోజనాలను అందిస్తోంది.

మారుతి సుజుకి కార్లపై ఫెస్టివల్ ఆఫర్స్; కొత్త సర్వీస్ క్యాంప్ ప్రారంభం

మారుతి సుజుకి అక్టోబర్ 18, 2020వ తేదీ నుండి నవంబర్ 20, 2020వ తేదీ వరకూ ఈ పరిమిత కాలానికి సర్వీస్ క్యాంప్‌ని నిర్వహించనుంది. కస్టమర్లు కలిగి ఉన్న మారుతి సుజుకి మోడల్ లేదా వేరియంట్‌తో సంబంధం లేకుండా వినియోగదారులందరికీ ఈ సర్వీస్ క్యాంప్ అందుబాటులో ఉంటుంది.

మారుతి సుజుకి కార్లపై ఫెస్టివల్ ఆఫర్స్; కొత్త సర్వీస్ క్యాంప్ ప్రారంభం

ఈ పరిమిత-కాల సర్వీస్ క్యాంప్ ఆఫర్లలో భాగంగా, పైన పేర్కొన్న తేదీలలో మారుతి సుజుకి సర్వీస్ సెంటర్‌కు తీసుకువచ్చే వాహనాలపై కంపెనీ అందిస్తున్న ప్రయోజనాలలో లేబర్ చార్జీలు మరియు విడిభాగాలపై ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. వీటితో పాటు, కాంప్లిమెంటరీ ఎక్స్‌టీరియర్ వాష్‌తో పాటు రాయితీ ధరతో పొడిగించిన (ఎక్స్‌టెండెడ్) వారంటీని కూడా కంపెనీ అందిస్తోంది.

MOST READ:రోల్స్ రాయిస్ నుంచి రానున్న హైస్పీడ్ ఎలక్ట్రిక్ విమానం ఇదే.. చూసారా !

మారుతి సుజుకి కార్లపై ఫెస్టివల్ ఆఫర్స్; కొత్త సర్వీస్ క్యాంప్ ప్రారంభం

కస్టమర్లు నిత్యం వేర్ అండ్ టేర్‌కు గురయ్యే టైర్లు, బ్యాటరీలు మరియు బ్రేక్ ప్యాడ్లు మొదలైన విడిభాగాలను మార్చాలని నిర్ణయించుకుంటే, వారికి ఇదే సరైన సమయంగా చెప్పవచ్చు. మారుతి సుజుకి కొత్తగా ప్రవేశపెట్టిన ఈ సర్వీస్ క్యాంప్‌లో భాగంగా పైన పేర్కొన్న విడిభాగాలపై కంపెనీ ప్రత్యేకమైన డిస్కౌంట్‌లను ఆఫర్ చేస్తోంది.

మారుతి సుజుకి కార్లపై ఫెస్టివల్ ఆఫర్స్; కొత్త సర్వీస్ క్యాంప్ ప్రారంభం

ప్రస్తుతం మారుతి సుజుకి తమ అరేనా షోరూమ్‌ల ద్వారా ఆల్టో, సెలెరియో, స్విఫ్ట్ ఎర్టిగా మొదలైన మోడళ్లను విక్రయిస్తోంది. అలాగే, తమ నెక్సా ఎక్స్‌పీరియన్స్ ప్రీమియం డీలర్‌షిప్‌ల ద్వారా బాలెనో, ఎక్స్‌ఎల్6, ఎస్-క్రాస్ మొదలైన మోడళ్లను విక్రయిస్తోంది. మారుతి సుజుకి అందిస్తున్న అన్ని రకాల మోడళ్లకు ఈ సర్వీస్ క్యాంప్ పరిధిలోకి వస్తాయి.

MOST READ:ఒక్క సారిగా సర్వీస్ సెంటర్లపై పడిన కార్ ఓనర్స్.. ఎందుకంటే ?

మారుతి సుజుకి కార్లపై ఫెస్టివల్ ఆఫర్స్; కొత్త సర్వీస్ క్యాంప్ ప్రారంభం

ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో వాహనంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సున్నితంగా నడవాలంటే సరైన మెయింటినెన్స్ ఎంతో అవసరం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, తమ వినియోగదారులకు విలువైన సేవలను అందించే లక్ష్యంగా మారుతి సుజుకి ఈ సర్వీస్ క్యాంప్‌ను ప్రారంభించింది.

మారుతి సుజుకి కార్లపై ఫెస్టివల్ ఆఫర్స్; కొత్త సర్వీస్ క్యాంప్ ప్రారంభం

మారుతి సుజుకి బ్రాండ్‌కు సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ అందిస్తున్న పాపులర్ ఎంట్రీ లెవల్ స్మాల్ కార్ ఆల్టో భారత మార్కెట్లో విజయవంతంగా 20 సంవత్సరాల అమ్మకాలను పూర్తి చేసుకుంది. ఈ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌ను మొట్టమొదటి సారిగా 2000వ సంవత్సరంలో విడుదల చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ కంపెనీ సుమారు 40 లక్షల యూనిట్ల ఆల్టో కార్లను విక్రయించినట్లు పేర్కొంది.

MOST READ:బుల్లెట్ బైక్‌లు మాత్రమే టార్గెట్ చేసిన దొంగల ముఠా.. చివరికి ఏమైందంటే ?

మారుతి సుజుకి కార్లపై ఫెస్టివల్ ఆఫర్స్; కొత్త సర్వీస్ క్యాంప్ ప్రారంభం

మారుతి సుజుకి ఆల్టో స్టాండర్డ్ పెట్రోల్ ఇంజన్ లేదా ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. పెట్రోల్ వెర్షన్ మారుతి సుజుకి ఆల్టో లీటరుకు 22.05 కిమీ మైలేజీని, సిఎన్జి వెర్షన్ మోడల్ కిలోకు 31.56 కిమీ మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

మారుతి సుజుకి కార్లపై ఫెస్టివల్ ఆఫర్స్; కొత్త సర్వీస్ క్యాంప్ ప్రారంభం

మారుతి సుజుకి సర్వీస్ క్యాంప్, ఫెస్టివల్ ఆఫర్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మారుతి సుజుకి దేశంలో పండుగ సీజన్‌ను స్వాగతించేందుకు గాను తమ కస్టమర్లు కోసం ఈ కొత్త సర్వీస్ క్యాంప్‌ను ప్రారంభించింది. ఇందులో వాహన మరమ్మత్తు చేయటానికి అయ్యే ఖర్చు మరియు విడిభాగాలపై కంపెనీ ఆకర్షణీయమైన ఆఫర్లు, ప్రయోజనాలను అందిస్తోంది. లేబర్ ఛార్జీలు, విడిభాగాలపై డిస్కౌంట్ ఇవ్వడం ద్వారా యాజమాన్య ఖర్చులను తగ్గించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

MOST READ:సర్వీస్ సెంటర్ నుంచి దొంగలించబడిన టయోటా ఇన్నోవా క్రిస్టా.. ఇంతకీ ఎలా జరిగిందో తెలుసా ?

Most Read Articles

English summary
Maruti Suzuki has announced a new limited-time service camp offer to welcome the upcoming festive season in India. The company is offering a host of benefits to its customers for getting their Maruti Suzuki cars serviced during the festive season. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X