మారుతి సుజుకి ఇగ్నిస్ ఫేస్ లిఫ్ట్ కార్ వీడియో చూసారా..!

భారతదేశంలో అతి పెద్ద కార్ల తయారీ సంస్థగా ప్రసిద్ధి చెందిన మారుతి సుజుకి 2020 ఆటో ఎక్స్‌పోలో తన బ్రాండ్ అయిన ఇగ్నిస్ ని ఆవిష్కరించింది. మారుతీ సుజుకి ఇప్పటికే కారు యొక్క టివిసిని విడుదల చేసింది. ఆటో ఎక్స్‌పోలో విడుదల చేసిన ఇగ్నిస్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

మారుతి సుజుకి ఇగ్నిస్ ఫేస్ లిఫ్ట్ కార్ వీడియో చూసారా..!

మారుతి సుజుకి ఈ కారుని కొత్త అర్బన్ కాంపాక్ట్ ఎస్‌యువి గా తెలిపింది. ఇందులో ఇండియన్ వెర్షన్ ఆల్‌గ్రిప్ ఎడబ్ల్యుడి వ్యవస్థ ఉండదు . మారుతి ఇగ్నిస్ కొత్త డిజైన్ ని కలిగి ఉండటమే కాకుండా, చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది.

మారుతి సుజుకి ఇగ్నిస్ ఫేస్ లిఫ్ట్ కార్ వీడియో చూసారా..!

మారుతీ సుజుకి ఇగ్నిస్ యొక్క ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ సౌందర్య నవీకరణలను పొందుతుంది. ఈ విధంగా అప్డేట్ చేసిన వాటిలో కొత్త గ్రిల్ ఉంటుంది. ఇదే కాకుండా ఇందులో ఫాగ్ లాంప్ హౌసింగ్‌లు, బంపర్లు మరియు వాహనం యొక్క ఎయిర్ డ్యామ్‌లను కూడా సవరించారు.

మారుతి సుజుకి ఇగ్నిస్ ఫేస్ లిఫ్ట్ కార్ వీడియో చూసారా..!

తాజా నవీనీకరణలు చేయడం వల్ల మారుతీ ఇగ్నిస్ మరింత కొత్తగా కనిపిస్తుంది. ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన ఇగ్నిస్ కొత్తగా రూపొందించిన అల్లాయ్ వీల్స్‌ను కూడా అందుకుంటుంది. ఇది వాహనానికి కొత్త లుక్ ఇస్తుంది. అదే విధంగా బ్లాక్-అవుట్ ఎ-పిల్లర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మునుపటి సంస్కరణకంటే కొంత భిన్నంగా ఉంటుంది.

మారుతి సుజుకి ఇగ్నిస్ ఫేస్ లిఫ్ట్ కార్ వీడియో చూసారా..!

లోపలి భాగంలో మారుతి సుజుకి ఇగ్నిస్ యొక్క ప్రస్తుత వెర్షన్ మాదిరిగానే అన్ని లక్షణాలను కలిగి ఉంటుంది. కానీ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో కూడిన కొత్త స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ టాప్-ఎండ్ మాత్రం వేరియంట్ ని బట్టి అమర్చడం జరిగింది.

మారుతి సుజుకి ఇగ్నిస్ ఫేస్ లిఫ్ట్ కార్ వీడియో చూసారా..!

మారుతీ ఇగ్నిస్ డ్యూయెల్ టోన్ కలర్స్ ని కలిగి ఉంటుంది. అవి లూసెంట్ ఆరెంజ్ మరియు టర్కోయిస్ బ్లూ. ఇవే కాకుండా అనుకూలీకరించిన ఎంపికలు కొత్త ఇగ్నిస్ లో అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు వాహనాల యొక్క కాన్ఫిగరేటర్ లను ఆన్‌లైన్‌లో అనుకూలీకరించవచ్చు లేదా డీలర్‌షిప్‌ల వద్ద ఉపకరణాలను ఎంచుకోవచ్చు.

మారుతి సుజుకి ఇగ్నిస్ ఫేస్ లిఫ్ట్ కార్ వీడియో చూసారా..!

కొత్త నవీనీకరణలతో తయారు చేసిన ఇగ్నిస్ లో 1.2 లీటర్ కె 12 ఇంజిన్ ని బిఎస్-6 వెర్షన్ కి అనుగుణంగా మార్చడం జరిగింది. ఇందులో 5 స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి ఆటో ఎంపికలు మునుపటిలాగే ఉన్నాయి. ఇది 82 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 113 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

మారుతీ సుజుకి మార్కెట్లో విడుదలైన తరువాత టాటా టియాగో, హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్, ఫోర్డ్ ఫిగో వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. సుజుకి ఇగ్నిస్ చాల కొత్త నవీనీకరణలు పొందటం వల్ల ఇది మునుపటి మోడల్ కంటే కొంత అప్డేటెడ్ లక్షణాలను కలిగి ఉంది. ఇది వినియోగదారులకు చాల వరకు అనుకూలంగా ఉండటమే కాకుండా, మంచి రైడింగ్ అనుభూతిని కూడా ఇస్తుంది.

మారుతి సుజుకి ఇగ్నిస్ ఫేస్ లిఫ్ట్ కార్ వీడియో చూసారా..!

మారుతి సుజుకి తన ఇగ్నిస్ యొక్క బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభించింది. ఈ వాహనాల యొక్క డెలివరీలు కూడా త్వరలో ప్రారంభిస్తామని కంపెనీ యాజమాన్యం తెలిపింది.

Most Read Articles

English summary
Maruti Suzuki Ignis Facelift: First official TVC out [Video]. Read in Telugu.
Story first published: Monday, February 10, 2020, 15:59 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X