మారుతి సుజుకి ఇగ్నిస్‌లో ఇప్పుడు మరో కొత్త ఫీచర్; ఎంటో తెలుసా?

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (ఎమ్ఎస్ఐఎల్) తమ నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ 'మారుతి సుజుకి ఇగ్నిస్'లో కంపెనీ కొత్త ఫీచర్లను జోడించింది. ఇగ్నిస్ జెటా వేరియంట్ ఇప్పుడు అధనపు ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. మిడ్-స్పెక్ వేరియంట్ అయిన మారుతి సుజుకి ఇగ్నిస్ జెటా ఇప్పుడు బ్రాండ్ యొక్క లేటెస్ట్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో లభ్యం కానుంది.

మారుతి సుజుకి ఇగ్నిస్‌లో ఇప్పుడు మరో కొత్త ఫీచర్; ఎంటో తెలుసా?

ఈ వేరియంట్‌ను ఫుల్లీ లోడెడ్ వేరియంట్ అయిన ఇగ్నిస్ ఆల్ఫాకు దిగువన ఆఫర్ చేస్తున్నారు. ఈ వేరియంట్‌లో చేర్చిన కొత్త అప్‌డేట్స్ కారణంగా ఇగ్నిస్ జెటా ఇప్పుడు మరింత ప్రియమైంది. కొత్తగా అప్‌డేట్ చేసిన ఇగ్నిస్ జెటా వేరియంట్‌ ధరను కంపెనీ రూ.9,000 మేర పెంచింది.

మారుతి సుజుకి ఇగ్నిస్‌లో ఇప్పుడు మరో కొత్త ఫీచర్; ఎంటో తెలుసా?

ప్రస్తుతం మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభించే మారుతి సుజుకి ఇగ్నిస్ జెటా వేరియంట్ ధర రూ.5.98 లక్షలు గాను, ఎఎమ్‌టి వెర్షన్ ధర రూ.6.45 లక్షలు గాను ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ).

MOST READ:అమెజాన్ పే ద్వారా కార్ & బైక్ భీమా మరింత సులభం, ఎలాగో తెలుసా ?

మారుతి సుజుకి ఇగ్నిస్‌లో ఇప్పుడు మరో కొత్త ఫీచర్; ఎంటో తెలుసా?

ఇప్పటి వరకూ మారుతి సుజుకి ఇగ్నిస్ జెటా వేరియంట్‌లో డబుల్ డిన్ ఆడియో సిస్టమ్ లభించేంది. ఇప్పుడు ఆ స్థానాన్ని బ్రాండ్ యొక్క లేటెస్ట్ 'స్మార్ట్‌ప్లే స్టూడియో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌'తో భర్తీ చేశారు. ఈ సిస్టమ్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలతో పాటుగా వాయిస్ కమాండ్స్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ సిస్టమ్ రివర్స్ కెమెరా ఫీడ్‌ను తెరపే రిలే చేయగలదు.

మారుతి సుజుకి ఇగ్నిస్‌లో ఇప్పుడు మరో కొత్త ఫీచర్; ఎంటో తెలుసా?

మారుతి సుజుకి ఇగ్నిస్ జెటా వేరియంట్ ప్రత్యేకమైన ఫీచర్లతో లభిస్తుంది. ఇందులో అల్లాయ్ వీల్స్, మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్, రియర్ వైపర్ మరియు వాషర్ మరియు పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:240 ఇంచ్ చక్రాలతో కొత్త రికార్డ్ సృష్టించిన కార్ [వీడియో]

మారుతి సుజుకి ఇగ్నిస్‌లో ఇప్పుడు మరో కొత్త ఫీచర్; ఎంటో తెలుసా?

కానీ, జెటా వేరియంట్ కోల్పోయిన కొన్ని ఫీచర్లలో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్‌, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు ఎత్తు-సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్ ఉన్నాయి. అయితే, ఈ ఫీచర్లన్నీ టాప్ ఎండ్ వేరియంట్ అయిన ఆల్ఫాలో లభిస్తాయి.

మారుతి సుజుకి ఇగ్నిస్‌లో ఇప్పుడు మరో కొత్త ఫీచర్; ఎంటో తెలుసా?

మారుతి సుజుకి ఇగ్నిస్ హ్యాచ్‌బ్యాక్‌లో బయట వైపు చంకీ లుకింగ్ ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, స్కఫ్ ప్లేట్, రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్, రూఫ్ రైల్స్, హ్యాచ్‌బ్యాక్ చుట్టూ బాడీ క్లాడింగ్ వంటి వివరాలు ఉంటాయి. ఇగ్నిస్ కారులోని ఫ్రంట్ గ్రిల్ ఈ హ్యాచ్‌బ్యాక్‌కు గంభీరమైన వైఖరిని ఇస్తుంది.

MOST READ:రెండవసారి పెరిగిన టీవీఎస్ జూపిటర్ స్కూటర్ ధర, ఈసారి ఎంతో తెలుసా?

మారుతి సుజుకి ఇగ్నిస్‌లో ఇప్పుడు మరో కొత్త ఫీచర్; ఎంటో తెలుసా?

మారుతి సుజుకి ఇగ్నిస్ కారులో 1.2-లీటర్ బిఎస్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 83 బిహెచ్‌పి శక్తిని మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. మిడ్, టాప్ వేరియంట్లలో 5-స్పీడ్ ఏఎమ్‌టి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షనల్‌గా లభిస్తుంది.

మారుతి సుజుకి ఇగ్నిస్‌లో ఇప్పుడు మరో కొత్త ఫీచర్; ఎంటో తెలుసా?

మారుతి సుజుకి ఇగ్నిస్ కొత్త ఫీచర్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కొత్త ఇన్ఫోటైన్‌మెంట్‌ను చేర్చడం ద్వారా మారుతి సుజుకి ఈ మిడ్-స్పెక్ ఇగ్నిస్ జెటా వేరియంట్‌కు మంచి ఫంక్షనల్ అప్‌డేట్ ఇచ్చినట్లు అయింది. కారు క్యాబిన్ అనుభవంలో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఆఫ్టర్ మార్కెట్ ఉత్పత్తి కోసం వేలకు వేలు ఖర్చు చేయకుండా, కేవలం రూ.9,000 ఫ్యాక్టరీ ఫిట్టెడ్ ఎక్విప్‌మెంట్‌గా ఈ కారులో ఇన్ఫోటైన్‌ను పొందడం మంచి ఆప్షన అనే చెప్పాలి.

MOST READ:ఇండియన్ ఎయిర్ పోర్స్ లో చేరనున్న రాఫెల్ ఫైటర్ జెట్స్ ; ఎందుకో తెలుసా

Most Read Articles

English summary
Maruti Suzuki India Limited (MSIL) has recently updated the feature list of the Ignis Zeta variant. The mid-spec variant now receives the brand's latest touchscreen infotainment system. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X