Just In
- 11 hrs ago
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- 13 hrs ago
హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్యూవీ వస్తోంది, టీజర్ విడుదల
- 14 hrs ago
పూర్తి చార్జ్‌పై 500 కి.మీ ప్రయాణించే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఎలక్ట్రిక్!
- 14 hrs ago
మాట నిలబెట్టుకున్న జగన్మోహన్రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : జాబ్ కోసం నిరుద్యోగులు అకస్మాత్తుగా జర్నీ చేయొచ్చు...!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Movies
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారతదేశంలో మారుతి సుజుకి జిమ్నీ ఇకపై 5 డోర్స్ లో కూడా
మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ తమ బ్రాండ్ అయిన జిమ్మీ ఎస్‌యువి యొక్క కొత్త ఐదు-డోర్ల వేరియంట్‌ను అభివృద్ధి చేస్తోంది. వచ్చే ఏడాది ఎప్పుడైనా కంపెనీ జిమ్మీ ఆఫ్-రోడ్ ఎస్‌యుని భారతదేశంలో విడుదల చేసే అవకాశం ఉంది.

ఆటోకార్ ఇండియా ప్రకారం, భారత మార్కెట్ కోసం జిమ్మీ ఆఫ్-రోడ్ ఎస్‌యువి యొక్క ఐదు-డోర్ల వేరియంట్‌ను కంపెనీ విడుదల చేయనుంది. మూడు-డోర్ల జిమ్మీకి మరో రెండు డోర్స్ ఉంచి 5 డోర్స్ జిమ్నీగా మార్కెట్లో విడుదల చేస్తుంది.

ప్రారంభంలో కంపెనీ తన జిమ్మీ ఆఫ్-రోడ్ ఎస్‌యువిని భారతదేశంలో ప్రవేశపెట్టే ఆలోచన లేదు. ఎందుకంటే భారతదేశంలో మూడు-డోర్ల ఆఫ్-రోడ్ ఎస్‌యువిల యొక్క డిమాండ్ తక్కువగా ఉండటం వల్ల 5 డోర్ల ఎస్‌యువిని ప్రవేశపెట్టాలనుకోలేదు.

2020 ఆటోఎక్స్పోలో భారత్‌లోకి ప్రవేశించక ముందే ఈ ఎస్‌యువి చాలా సంచలనం సృష్టించింది. అంతే కాకుండా 2019 వరల్డ్ అర్బన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా అందుకుంది. 2020 ఆటోఎక్స్పోలో అద్భుతమైన స్పందన వచ్చిన తరువాత జిమ్మీ ఎస్‌యువీని భారత్‌లో ప్రవేశపెట్టాలని కంపెనీ నిర్ణయించింది.

జిమ్మీ ఆఫ్-రోడ్ ఎస్‌యువి 1.5-లీటర్ 4-సిలిండర్ కె-సిరీస్ ఇంజిన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 103.2 బిహెచ్‌పి మరియు 138 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఐదు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మరియు నాలుగు-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌తో జతచేయబడుతుంది.

ఈ కఠినమైన ఆఫ్-రోడ్ ఎస్‌యువిలో గ్లోబల్-స్పెక్ మోడళ్ల వంటి ఇంటీరియర్స్ పరికరాలు ఉంటాయి. వీటిలో ఆపిల్ కార్ప్లే మరియు గూగుల్ ఆండ్రాయిడ్ ఆటోతో పాటు 7-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటివి ఇందులో ఉన్నాయి.

కొత్త 5 డోర్స్ జిమ్మీలో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, మరియు ఆరు-ఎయిర్‌బ్యాగులు ప్రయాణీకులకు అత్యుత్తమ రక్షణను అందించే భద్రతా లక్షణాలను కలిగి ఉంటుంది.

మూడు-డోర్ల జిమ్నీ ఉత్పత్తి 2020 జూన్ లో గుజరాత్‌లోని హన్సాల్‌పూర్ ప్లాంట్‌లో ప్రారంభించనుంది. భారతదేశంలో ఐదు డోర్స్ జిమ్నీ తయారీ మరియు ఎగుమతి అనేది 2020 డిసెంబర్ నాటికి ప్రారంభం కానుంది.

ఒకసారి ఇండియన్ మార్కెట్లో ప్రారంభించిన తర్వాత మారుతి సుజుకి జిమ్నీ, మహీంద్రా థార్ మరియు ఫోర్స్ గూర్ఖాకు ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ రెండూ రాబోయే నెలల్లో కొత్త వెర్షన్లతో పరిచయం చేయబడుతున్నాయి. మారుతి జిమ్మీ 5-డోర్స్ కేవలం 10 లక్షల రూపాయల ఎక్స్-షోరూమ్ కంటే తక్కువ ధరతో రిటైల్ చేస్తుందని ఆశించవచ్చు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం.. !
ఐదు తలుపులతో మారుతి సుజుకి జిమ్నీ మూడు తలుపుల జిమ్నీ కన్నా చాలా ప్రాక్టికల్ గా ఉంటుంది. మూడు-డోర్ల వెర్షన్ భారత మార్కెట్లో సరిపోదని కంపెనీ అభిప్రాయపడింది. ఏదేమైనా మహీంద్రా థార్, ఫోర్స్ గూర్ఖా మరియు ఆల్-మైటీ మారుతి సుజుకి జిప్సీ భారతదేశంలో మూడు-డోర్ల ఆఫ్-రోడ్ ఎస్‌యువి మంచి సంఖ్యలో అమ్ముడయ్యాయి. ఈ కొత్త 5 డోర్ల జిమ్నీ త్వరలో విడుదల కానుంది.