భారత రోడ్లపై మారుతి సుజుకి జిమ్నీ టెస్టింగ్; త్వరలో విడుదల!

భారతదేశపు నెంబర్ వన్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, తమ అధునాతన ఆఫ్-రోడర్ సుజుకి జిమ్నీ ఎస్‌యూవీని భారత మార్కెట్లో ప్రవేశపెట్టడం ద్వారా ఆఫ్-రోడ్ వాహన విభాగంలోకి పునఃప్రవేశించాలని కంపెనీ యోచిస్తోంది. ఇదివరకు ఈ విభాగంలో మారుతి సుజుకి తమ జిప్సీ ఆఫ్-రోడర్ వాహనాన్ని విక్రయించిన సంగతి మనందరికీ తెలిసినదే.

భారత రోడ్లపై మారుతి సుజుకి జిమ్నీ టెస్టింగ్; త్వరలో విడుదల!

జిమ్నీ ఎస్‌యూవీని దేశీయ మార్కెట్లో విడుదల చేయటానికి ముందే కంపెనీ ఈ వాహనాన్ని భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. గుర్గావ్‌లోని మానేసర్‌లో ఉన్న మారుతి సుజుకి ప్లాంట్ సమీపంలో సరికొత్త జిమ్నీ ఎస్‌యూవీని టెస్టింగ్ చేస్తున్నారు. ఇదే ప్లాంట్‌లోనే ఈ వాహనాన్ని దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్ల కోసం ఉత్పత్తి చేయనున్నారు.

భారత రోడ్లపై మారుతి సుజుకి జిమ్నీ టెస్టింగ్; త్వరలో విడుదల!

తాజాగా కార్ డిఐవై లీక్ చేసిన సుజుకి జిమ్నీ స్పై చిత్రాలను గమనిస్తే, కంపెనీ ఎలాంటి క్యామోఫ్లేజ్ లేకుండా ఈ వాహనాన్ని పరీక్షిస్తుండటాన్ని మనం గమనించవచ్చు. దీన్నిబట్టి చూస్తుంటే, మారుతి సుజుకి జిమ్నీ భారత మార్కెట్లో విడుదల కావటానికి ఎంతో సమయం పట్టదని తెలుస్తోంది. ఈ టెస్టింగ్ వాహనం చుట్టూ బ్లాక్ కలర్ ప్లాస్టిక్ బాడీ క్లాడింగ్ ఉంది, అలాగే ఉందులో గన్‌మెటల్ బ్లాక్‌లో ఫినిష్ చేసిన స్టైలిష్ అల్లాయ్ వీల్స్ డిజైన్‌ను కూడా చూడొచ్చు.

MOST READ:మతిపోగొడుతున్న మోడిఫైడ్ హిందూస్తాన్ అంబాసిడర్

భారత రోడ్లపై మారుతి సుజుకి జిమ్నీ టెస్టింగ్; త్వరలో విడుదల!

భారత మార్కెట్ కోసం తయారు చేయబోయే మారుతి సుజుకి జిమ్నీలో 1.5 లీటర్ కె సిరీస్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని తెలుస్తోంది. ఇదే ఇంజన్‌ను విటారా బ్రెజ్జాతో సహా పలు మారుతి సుజుకి మోడళ్లలో ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 103.2 బిహెచ్‌పి శక్తిని, 138 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఆప్షనల్ 4-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉండొచ్చని అంచనా. అంతర్జాతీయ మార్కెట్లలో సుజుకి విక్రయిస్తున్న జిమ్నీ ఆఫ్-రోడర్ మాదిరిగానే భారత మార్కెట్లో విడుదల కాబోయే జిమ్నీలో కూడా ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్ ఉండొచ్చని తెలుస్తోంది.

MOST READ:మాడిఫైడ్ బెంజ్ 600 పుల్మాన్ లిమోసిన్ : ఈ కార్ ముందు ఏ కారైనా దిగదుడుపే

భారత రోడ్లపై మారుతి సుజుకి జిమ్నీ టెస్టింగ్; త్వరలో విడుదల!

ప్రస్తుతం సుజుకి జిమ్నీ ఎస్‌యూవీ తయారీలో ఉపయోగించే పూర్తి విడిభాగాలను విదేశాల నుండి సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) రూట్లో దిగుమతి చేసుకొని, భారత్‌లో అసెంబ్లింగ్ చేస్తున్న నేపథ్యంలో, ఇండియన్ వెర్షన్ జిమ్నీ ఇంటీరియర్స్ కూడా అంతర్జాతీయ మోడల్ మాదిరిగానే ఉండే అవకాశం ఉంది. అయితే, మన మార్కెట్‌కు తగినట్లుగా కంపెనీ ఇందులో స్వల్ప మార్పులు చేర్పులు చేయవచ్చని అంచనా.

భారత రోడ్లపై మారుతి సుజుకి జిమ్నీ టెస్టింగ్; త్వరలో విడుదల!

భారత్‌లో మారుతి సుజుకి నుండి అత్యంత పాపులర్ అయిన స్మార్ట్ ప్లే స్టూడియోని సుజుకి జిమ్నీలో కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఇందులో అండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే టెక్నాలజీలను సపోర్ట్ చేసే 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండొచ్చని అంచనా. ఈ ఇన్ఫోటైన్‌మెంట్‌ను కంట్రోల్ చేసేందుకు స్టీరింగ్ వీల్‌పై కంట్రోల్స్ కూడా ఉంటాయని సమాచారం.

MOST READ:స్పోర్ట్స్ కారు రూపం దాల్చిన మారుతి 800 కార్

భారత రోడ్లపై మారుతి సుజుకి జిమ్నీ టెస్టింగ్; త్వరలో విడుదల!

ఇందులోని సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ పాపులర్ ఆఫ్-రోడర్ ఎస్‌యూవీలో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్‌పి), ట్రాక్షన్ కంట్రోల్ (టిసి), హిల్ హోల్డ్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లు స్టాండర్డ్‌గా లభించే అవకాశం ఉంది.

మారుతి సుజుకి ఇండియా తమ కొత్త సుజుకి జిమ్నీ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేయటమే కాకుండా, ఈ మోడల్ ఉత్పత్తిని పూర్తిగా భారతదేశానికి తరలించాలని యోచిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసినదే. భారత మార్కెట్‌ను 3-డోర్ మరియు 5-డోర్ వెర్షన్ సుజుకి జిమ్నీ ప్రొడక్షన్ హబ్‌గా మార్చాలని కంపెనీ భావిస్తోంది.

భారత రోడ్లపై మారుతి సుజుకి జిమ్నీ టెస్టింగ్; త్వరలో విడుదల!

మారుతి సుజుకి ఇప్పటికే తమ గుర్గావ్ ప్లాంట్‌లో జిమ్నీ ఎస్‌యూవీ అసెంబ్లీ ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు సమాచారం. భారత మార్కెట్ కోసం 5-డోర్ వెర్షన్ జిమ్నీని కంపెనీ తయారు చేయనుంది. జిమ్నీ ధరను అందుబాటులో ఉంచేందుకు గాను కంపెనీ దీని తయారీలో ఉపయోగించే విడిభాగాలను స్థానికంగానే సేకరించాలని ప్లాన్ చేస్తోంది.

MOST READ:కొత్తగా కనిపిస్తున్న మూడు కార్లు కలయికతో తయారయిన కొత్త కారు

భారత రోడ్లపై మారుతి సుజుకి జిమ్నీ టెస్టింగ్; త్వరలో విడుదల!

భారత మార్కెట్లో సుజుకి జిమ్నీ విడుదలకు సంబంధించి ఇప్పటికీ స్పష్టమైన వివరాలు ఇంకా నిర్ధారించబడలేదు. అయితే, ఇది 2021లో ఏ సమయంలో నైనా ఇక్కడి మార్కెట్లోకి రావచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది మారుతి సుజుకి ఇండియా డిస్‌కంటిన్యూ చేసిన జిప్సీ స్థానంలో కొత్త సుజుకి జిమ్నీ మోడల్‌ను ప్రవేశపెట్టనున్నారు.

భారత రోడ్లపై మారుతి సుజుకి జిమ్నీ టెస్టింగ్; త్వరలో విడుదల!

భారత రోడ్ల మీద సుజుకి జిమ్నీ టెస్టింగ్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భారత్‌లో ఇప్పుడిప్పుడే ఆఫ్-రోడ్ వాహనాలకు డిమాండ్ జోరందుకుంటోంది. ఈ విభాగంలో మారుతి సుజుకి ఇండియాకు ప్రస్తుతం ఎలాంటి మోడల్ అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో, భారత్‌లో కొత్త జిమ్నీ విడుదలతో ఆఫ్-రోడ్ వాహన విభాగంలో తమ సత్తా ఏంటో చాటాలని కంపెనీ చూస్తోంది. మారుతి సుజుకి జిమ్నీ భారత్‌లో విడుదలైతే ఇది ఈ విభాగంలో మహీంద్రా థార్, ఫోర్స్ గుర్ఖా వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Image Courtesy: Kar DIY

Most Read Articles

English summary
Maruti Suzuki is planning to launch all-new Suzuki Jimny off-road SUV in India. Ahead of its arrival in the market, the Maruti Suzuki Jimny has been spied testing for the first time in India near the brand's manufacturing facility in Manesar, Gurgaon. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X