మారుతి సుజుకి కస్టమర్లకు గుడ్ న్యూస్; కొత్త స్కీమ్‌ను ప్రారంభించిన కంపెనీ

'మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్' తమ కస్టమర్ల కోసం ఓ ప్రత్యేకమైన స్కీమ్‌ను తీసుకొచ్చింది. 'మారుతి సుజుకి రివార్డ్స్' పేరుతో కంరెనీ ఓ విశిష్టమైన లాయల్టీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఇది కంపెనీ అందిస్తున్న అరేనా, నెక్సా మరియు ట్రూ వాల్యూ అవుట్‌లెట్లలో కొనుగోలు చేసిన ప్యాసింజర్ వాహనాలను కస్టమర్లకు వర్తిస్తుంది.

మారుతి సుజుకి కస్టమర్లకు గుడ్ న్యూస్; కొత్త స్కీమ్‌ను ప్రారంభించిన కంపెనీ

మారుతి సుజుకి రివార్డ్స్ అనేది ఒక కాంపర్హెన్సివ్ ప్రోగ్రామ్, ఇది అదనపు కారు కొనుగోలు, సర్వీస్, మారుతి ఇన్సూరెన్స్, యాక్ససరీస్ కొనుగోలు చేసినప్పుడు మరియు ఇతర కొనుగోలుదారులను షోరూమ్‌కి పరిచయం చేయటం ద్వారా వచ్చే కస్టమర్ రెఫరల్స్ మొదలైన వాటి ద్వారా కస్టమర్లు రివార్డ్స్ పాయింట్స్ పొందవచ్చు. ఇలా పొందిన రివార్డ్ పాయింట్స్‌ను కస్టమర్లు భవిష్యత్తులో మారుతి సేవల కోసం/కొనుగోళ్ల కోసం ఉపయోగించుకోవచ్చు.

మారుతి సుజుకి కస్టమర్లకు గుడ్ న్యూస్; కొత్త స్కీమ్‌ను ప్రారంభించిన కంపెనీ

ఇదొక కార్డ్-లెస్ ప్రోగ్రామ్, ఈ రివార్డ్ పాయింట్స్‌కి సంబంధించిన మొత్తం సమాచారం మరియు అన్ని లావాదేవీల అలెర్ట్స్ కస్టమర్ల యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు డిజిటల్‌గా పంపబడుతాయి. అలాగే కస్టమర్లు ఈ ప్రోగ్రామ్ యొక్క బెనిఫిట్స్‌ను పొందేందుకు www.marutisuzuki.com లేదా www.nexaexperience.com వెబ్‌సైట్‌లకు లాగిన్ అయ్యి వారి వివరాలను నమోదు చేసుకోవచ్చు.

MOST READ: ఇండియన్ బైక్స్‌లో ఎండలో చల్లగా, చలిలో వేడిగా ఉండే బైక్ సీట్స్

మారుతి సుజుకి కస్టమర్లకు గుడ్ న్యూస్; కొత్త స్కీమ్‌ను ప్రారంభించిన కంపెనీ

ఈ ప్రణాళికను ప్రారంభించిన సందర్భంగా మారుతి సుజుకి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ కెనిచి ఆయుకావా మాట్లాడుతూ.. మారుతి సుజుకి రివార్డ్స్ తమ కస్టమర్లకు సంతోషకరమైన సేవలను అందించే నిబద్ధతను మరింత బలపరుస్తుందని, ఈ కొత్త లాయల్టీ ప్రోగ్రామ్ ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళుతుందని అలాగే ఇందులోని అత్యుత్తమ ప్రయోజనాలతో కస్టమర్లకు తమకు మద్య బంధం మరింత బలోపేతం అవుతుందని అన్నారు.

మారుతి సుజుకి కస్టమర్లకు గుడ్ న్యూస్; కొత్త స్కీమ్‌ను ప్రారంభించిన కంపెనీ

మారుతి సుజుకి రివార్డ్స్ ప్రోగ్రామ్ భారతదేశంలోని అన్ని మారుతి సుజుకి డీలర్‌షిప్‌లలో అంగీకరించబడుతుంది. ఈ రివార్డ్ పాయింట్స్ పొందిన కస్టమర్లు వాటిని ఎప్పుడైనా ఎక్కడైనా తమ కార్ సర్వీస్, యాక్ససరీస్, స్పేర్ పార్ట్స్, అధనపు వారంటీ, ఇన్సూరెన్స్ కొనుగోళ్లు లేదా మారుతి డ్రైవింగ్ స్కూల్‌లో నమోదు చేసుకోవటానికి ఉపయోగించుకోవచ్చని ఆయన వివరించారు.

MOST READ: భారత్‌లో ఇప్పుడు డీజిల్, పెట్రోల్ కంటే కాస్ట్లీ, ఎక్కడో తెలుసా..!

మారుతి సుజుకి కస్టమర్లకు గుడ్ న్యూస్; కొత్త స్కీమ్‌ను ప్రారంభించిన కంపెనీ

ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా, కస్టమర్లను మెంబర్, సిల్వర్, గోల్డ్, మరియు ప్లాటినం అనే నాలుగు విభాగాలుగా వర్గీకరిస్తారు అంచెలుగా వర్గీకరిస్తారు. వీరికి ప్రత్యేకమైన బ్యాడ్జ్‌లను కూడా కేటాయిస్తారు, వాటి సాయంతో మారుతి సుజుకి అందించే ప్రత్యేకమైన ఆఫర్లు, ఈవెంట్లకు కూడా యాక్సెస్ పొందే అవకాశం ఉంటుంది.

మారుతి సుజుకి కస్టమర్లకు గుడ్ న్యూస్; కొత్త స్కీమ్‌ను ప్రారంభించిన కంపెనీ

ఇప్పటికే ఆటోకార్డ్, మైనెక్సా ప్రోగ్రామ్‌లో సభ్యులుగా ఉన్న కస్టమర్లు ఎలాంటి అదనపు రుసుము చెల్లించకుండా ఈ సరికొత్త మారుతి సుజుకి రివార్డ్ ప్రోగ్రామ్‌లకు అప్‌గ్రేడ్ కావచ్చు. ఈ ప్రోగ్రామ్‌లలో ఉన్న అన్ని రివార్డ్ పాయింట్స్ కూడా ఈ కొత్త మారుతి సుజుకి రివార్డ్ ప్రోగ్రామ్‌కు బదిలీ అవుతాయి.

MOST READ: కొత్త హోండా సిటీ ఉత్పత్తి ప్రారంభం, త్వరలో విడుదల - వివరాలు

మారుతి సుజుకి కస్టమర్లకు గుడ్ న్యూస్; కొత్త స్కీమ్‌ను ప్రారంభించిన కంపెనీ

మారుతి సుజుకి సంబంధించిన ఇతర వార్తల్లోకి వెళితే, కంపెనీ ఇటీవలే ఫ్యాక్టరీ ఫిట్టెడ్ ఎస్-సిఎన్‌జి టెక్నాలజీతో తయారు చేసిన మారుతి సుజుకి ఎస్-ప్రెస్ హ్యాచ్‌బ్యాక్‌ను మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ మోడల్ ప్రారంభ ధర రూ.4.84 లక్షలు, ఎక్స్‌షోరూమ్‌గా ఉంది. ఎస్-ప్రెసో సిఎన్‌జి మోడల్ ఎల్ఎక్స్ఐ, ఎల్ఎక్స్ఐ (ఓ), విఎక్స్ఐ మరియు విఎక్స్ఐ (ఓ) అనే నాలుగు వేరియంట్లలో లభ్యం కానుంది.

మారుతి సుజుకి కస్టమర్లకు గుడ్ న్యూస్; కొత్త స్కీమ్‌ను ప్రారంభించిన కంపెనీ

మారుతి సుజుకి రివార్డ్ ప్రోగ్రామ్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మారుతి సుజుకి కస్టమర్‌లు ఈ ప్రోగ్రామ్‌ను ఎంచుకుంటే, సమీప భవిష్యత్తులో వారు దాని నుండి ఎక్కువ ప్రయోజనాలను పొందే ఆస్కారం ఉంది. మరోవైపు, మారుతి సుజుకి ఇలాంటి కార్యక్రమాలను ప్రారంభించడం ద్వారా ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించడానికి కూడా వీలవుతుంది.

Most Read Articles

English summary
Maruti Suzuki India Limited has launched a unique loyalty program - Maruti Suzuki Rewards that will cover all passenger vehicle customers from ARENA, NEXA and the True Value outlets. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X