భారత్‌కి 3 డోర్స్ జిమ్నీకారును తీసుకురావడంలేదన్న మారుతి సుజుకి, ఎందుకంటే ?

మారుతి సుజుకి జిమ్ని భారత మార్కెట్లో లాంచ్ చేయబోయే అత్యంత బహుముఖ ఎస్‌యూవీలలో ఒకటి. ఇది 2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడింది. ప్రపంచ మార్కెట్లో ప్రశంసలు అందుకున్న సుజుకి జిమ్మీ మినీ ఎస్‌యూవీని భారత్‌లో విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.

భారత్‌కి 3 డోర్స్ జిమ్నీకారును తీసుకురావడంలేదన్న మారుతి సుజుకి, ఎందుకంటే

గత ఏడాది మారుతి సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సివి రామన్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ 3 డోర్ల జిమ్మీ ఎస్‌యువిని భారత్‌లో విడుదల చేయడంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. మారుతి సుజుకి జిమ్నీని 2020 లో భారతదేశంలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకి జిమ్నీ అత్యంత ప్రాచుర్యం పొందిన ఎస్‌యూవీ.

భారత్‌కి 3 డోర్స్ జిమ్నీకారును తీసుకురావడంలేదన్న మారుతి సుజుకి, ఎందుకంటే

సివి రామన్‌కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో 3 డోర్ల మోడల్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేయలేమని చెప్పారు. దీనిని సిబియు ద్వారా భారత్‌కు తీసుకురావడంలో అర్థం లేదని తెలిపారు. దీనిని స్థానికంగా తయారు చేయడానికి మేము చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాము అని అన్నారు.

MOST READ:2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ; త్వరలో భారత్‌లో విడుదల!

భారత్‌కి 3 డోర్స్ జిమ్నీకారును తీసుకురావడంలేదన్న మారుతి సుజుకి, ఎందుకంటే

కొన్ని నివేదికల ప్రకారం మారుతి సుజుకి 5 డోర్ల జిమ్మీ ఎస్‌యూవీని భారత్‌లో విడుదల చేయనుంది. సుజుకి జిమ్మీ ఎస్‌యూవీ కోసం భారతీయ వాహన ప్రేమికులు అధిక సంఖ్యలో వేచి ఉన్నారు.

భారత్‌కి 3 డోర్స్ జిమ్నీకారును తీసుకురావడంలేదన్న మారుతి సుజుకి, ఎందుకంటే

భారతదేశంలో లాంచ్ చేస్తే, గుర్గావ్ ఆధారిత ప్లాంట్ లో మారుతి సుజుకి జిమ్మీ ఎస్‌యూవీని ఉత్పత్తి చేస్తుంది. జిమ్నీ ఎస్‌యూవీని హెర్టెక్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా బ్రెజ్జా, ఎస్-క్రాస్, ఎకో వంటి ఇతర ఎస్‌యూవీలతో కూడా తయారు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ మినీ-ఎస్‌యూవీ 2019 సంవత్సరపు ప్రతిష్టాత్మక వరల్డ్ అర్బన్ కారుగా నిలిచింది.

MOST READ:ఇండియన్ పొలిటికల్ లీడర్స్ ఎలాంటి వాహనాలు డ్రైవ్ చేస్తారో తెలుసా ?

భారత్‌కి 3 డోర్స్ జిమ్నీకారును తీసుకురావడంలేదన్న మారుతి సుజుకి, ఎందుకంటే

ఈ జిమ్మీ ఎస్‌యూవీని భారత్‌లో విడుదల చేయడంపై కంపెనీ ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. కానీ ఆటో ఎక్స్‌పో కస్టమర్ల నుండి సానుకూల స్పందన ఉన్నందున, ఇది భారతదేశంలో ప్రారంభించాలని నిర్ణయించింది.

భారత్‌కి 3 డోర్స్ జిమ్నీకారును తీసుకురావడంలేదన్న మారుతి సుజుకి, ఎందుకంటే

ఈ మినీ ఎస్‌యూవీలో 3 లింక్ యాక్సిల్ సస్పెన్షన్ ఉంటుంది. కఠినమైన భూభాగంలో సజావుగా నావిగేట్ చేయడానికి వాహనదారునికి ఇది చాలా సహాయపడుతుంది. ఈ మినీ ఎస్‌యూవీలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ అమర్చబడి ఉంటుంది. ఈ ఇంజిన్ 5 స్పీడ్ లేదా 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది.

MOST READ:పెరిగిన టొయోటా ఇన్నోవా క్రిస్టా బిఎస్6 ధరలు

భారత్‌కి 3 డోర్స్ జిమ్నీకారును తీసుకురావడంలేదన్న మారుతి సుజుకి, ఎందుకంటే

ఈ మినీ ఎస్‌యూవీ డీజిల్ మరియు హైబ్రిడ్ ఆప్షన్లలో విడుదల కాలేదు. భారతదేశంలో విడుదల చేస్తే, ఈ జిమ్మీ ఎస్‌యూవీ 33 సంవత్సరాలుగా దేశంలో అమ్ముడవుతున్న ప్రముఖ జిప్సీ ఎస్‌యూవీకి వారసురాలు అవుతుంది. ఈ కారు ఎలాంటి రహదారులలో అయినా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా ఈ ఎస్‌యూవీ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా వాహనదారుని చాలా అనుకూలంగా ఉండటం వల్ల దేశీయ మార్కెట్లో ఎక్కువమంది వినియోగదారులను ఆకర్శించింది.

Most Read Articles

English summary
Maruti Suzuki dead-set on not launching 3-door Jimny in India. Read in Telugu.
Story first published: Friday, June 5, 2020, 14:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X